ఏ దారి ఎటు పోతుందో! – స్వదేశీ ‘మ్యాపుల్స్’ మహాద్భుతం!

  • ప్రతి గల్లీ క్లారిటీ… గూగుల్‌ కు గూబగుయ్
  • గూగుల్ మ్యాప్స్ కంటే మరింత ఖచ్చితత్వం
  • 13 రకాల ఫీచర్లు… ప్రాంతీయ భాషల్లో
  • ఆఫ్‌లైన్‌లోనూ దారిచూపే నావిగేటర్

సహనం వందే, హైదరాబాద్:
గూగుల్‌ మ్యాప్‌కు గట్టి పోటీనిస్తూ మ్యాప్స్‌ మై ఇండియా సంస్థ రూపొందించిన ‘మ్యాపుల్స్’ యాప్‌ ఆకర్షిస్తుంది. మన రోడ్ల సంక్లిష్టతకు అనుగుణంగా తయారుచేసిన ఈ నావిగేషన్ యాప్ 3.5 కోట్ల డౌన్‌లోడ్లతో దూసుకుపోవడమే కాకుండా గోప్యత, భద్రతకు పెద్దపీట వేస్తుంది. ఇస్రో భాగస్వామ్యంతో ఉపగ్రహ చిత్రాల డేటాను ఉపయోగించుకోవడం ద్వారా మ్యాప్ ఖచ్చితత్వాన్ని అమాంతం పెంచింది.

13 అద్భుత ఫీచర్లు…
ఇందులో 13 అద్భుత ఫీచర్లు ఉన్నాయి. ఫ్లైఓవర్లు, ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల వద్ద మూడు డైమెన్షనల్ జంక్షన్ వ్యూస్ డ్రైవింగ్‌ను సులభతరం చేస్తాయని యాప్ నిర్వాహకులు తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గ్రీన్ లైట్‌కు ఎన్ని సెకన్లు మిగిలి ఉన్నాయో చెప్పే ‘లైవ్ ట్రాఫిక్ సిగ్నల్ టైమర్’ ట్రాఫిక్ టెన్షన్ ను తగ్గిస్తుంది. టోల్‌ఫ్రీ మార్గాలను సూచించే ‘టోల్ సేవింగ్స్ రూట్ ఆప్టిమైజేషన్’ ఫీచర్ డబ్బుతో పాటు సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. సంక్లిష్టమైన రౌండ్‌ అబౌట్‌లు, మల్టీలెవల్ ఫ్లైఓవర్లను త్రీ డైమెన్షనల్ ఫోటో రియలిస్టిక్ వ్యూస్‌తో చూపించే ‘త్రీ డైమెన్షనల్ జంక్షన్ వ్యూ’ డ్రైవింగ్ పొరపాట్లను నివారిస్తుంది. అంతేకాకుండా ట్రాఫిక్ కెమెరాలు, స్పీడ్ బ్రేకర్లు, రోడ్డు గుంతల గురించి హెచ్చరికలు జారీ చేస్తూ డ్రైవింగ్‌ను సురక్షితం చేస్తుంది. ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో కూడా పనిచేసే ఆఫ్‌లైన్ మోడ్ గ్రామీణ భారతానికి వరంగా మారింది.

ఈ ఫీచర్లో ముఖ్య అంశాలు…

  • మ్యాపుల్స్ పిన్ అనే ఆరు అంకెల కోడ్ ద్వారా ఏ చిరునామాన్నైనా సులభంగా కనుక్కోవచ్చు. డిజిపిన్ సాంకేతికతతో ఐఐటీ హైదరాబాద్, ఇస్రో కలిసి 3.8 మీటర్ల చదరపు ప్రదేశాలకు కోడ్‌లు జారీ చేస్తారు. అపార్ట్‌మెంట్లలో నిర్దిష్ట ఫ్లాట్, షాప్ వరకు గైడెన్స్ ఇస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో భూ‌ముల ఆధారంగా పిన్‌లు జనరేట్ చేస్తుంది.
  • తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, గుజరాతీ వంటి తొమ్మిది భారతీయ భాషల్లో వాయిస్ గైడెన్స్, సెర్చ్, మ్యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.
  • లడఖ్ వంటి దూర ప్రాంతాల్లోకి వెళ్లకుండానే పూర్తి పానారామిక్ వ్యూస్ చూడవచ్చు. మూడు డైమెన్షనల్ ల్యాండ్‌మార్క్‌లు, మోన్యూమెంట్‌లతో ముందుగానే ప్రదేశాన్ని అర్థం చేసుకోవచ్చు.
  • లవ్డ్ వన్స్‌తో లైవ్ లొకేషన్ షేరింగ్ ద్వారా భద్రతను పెంచుకోవచ్చు. ట్రాకింగ్ ఫీచర్ ప్రయాణాలను మానిటర్ చేసుకోవచ్చు.
  • డోర్‌స్టెప్ వరకు స్టెప్ బై స్టెప్ వాయిస్ గైడెన్స్‌తో ఈటీఏ, లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్‌లు అందిస్తుంది. హైపర్ లోకల్ సెర్చ్‌తో రెస్టారెంట్లు, మాల్‌లు, ఆసుపత్రులు సులభంగా కనుక్కోవచ్చు.
  • డ్రైవింగ్, వాకింగ్, సైక్లింగ్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మోడ్‌లకు సరిపడే రూట్ ప్లానింగ్ ను భారతీయ అవసరాలకు అనుగుణంగా రూపొందించారు.
  • డార్క్ మోడ్‌తో కళ్లకు సౌకర్యం, రిఫ్రెష్డ్ యూఐతో సులభ నావిగేషన్.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *