భజన్ రాక్… ‘జెన్ జెడ్’ కిరాక్ – ఇండియాలో భక్తికి యువతరం మోడ్రన్ టచ్
సహనం వందే, ముంబై:యువతరం ఇప్పుడు భక్తిని కొత్తగా ఆవిష్కరిస్తోంది. ప్రార్థనలు, భజనలు ఇకపై ఆలయాలకే పరిమితం కావడం లేదు. జెన్ జెడ్ యువత సాంప్రదాయ భజన్ సంధ్యలను తమదైన మ్యూజిక్ కల్చర్‌తో మిళితం చేసి ‘భజన్ క్లబింగ్’ అనే కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఈ ట్రెండ్ వేగంగా వ్యాపిస్తూ భక్తి భావానికి ‘యంగ్ వైబ్’ను జోడిస్తోంది. ఇది కేవలం పార్టీ కాదు, ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుకునే సోల్‌ఫుల్ జామ్…