- జాబితాలో హ్యారీ పోటర్ నటి ఎమ్మా వాట్సన్
- నెంబర్ 1 స్థానంలో ఆస్ట్రేలియా మార్గోట్ రాబీ
- టాప్ టెన్ హీరోయిన్ల జాబితా విడుదల
- ఎంపిక చేసిన మూవీ వెబ్ సైట్ ఐఎండీబీ
- తారల తళుకులు… అందంలో మెరుపులు
సహనం వందే, హైదరాబాద్:
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పాత్రలకు గ్లామరస్ చాలా ముఖ్యం. టాలెంట్ తో పాటు బ్యూటీ కూడా కలిసొస్తే ఇక వారికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు నల్లేరు మీద నడకే. రంగుల ప్రపంచంలో అందానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ అందాల తారల్లో ఇండియాకు చెందిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ మాత్రమే నిలిచింది. ఈ ఏడాదికిగాను ఐఎండీబీ ప్రకటించిన అందాల తారల లిస్టులో ఆమె ఐదో స్థానం దక్కించుకుంది.

ఆస్ట్రేలియా నుంచి మార్గోట్ రాబీ…
ఆస్ట్రేలియాకు చెందిన నటి, నిర్మాత మార్గోట్ రాబీ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. 1990లో జన్మించిన ఈమె సూసైడ్ స్క్వాడ్, ది వూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటనకు ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ కూడా లభించింది.
అమెరికా నుంచి షైలీన్ వుడ్లీ…
నటి, సామాజిక కార్యకర్త షైలీన్ వుడ్లీ అమెరికా నుండి ఈ జాబితాలో నిలిచింది.1991లో కాలిఫోర్నియాలో జన్మించిన ఈమె ది డిసెండెంట్స్, డైవర్జెంట్ సిరీస్‌లతో సినీ రంగంలో సంచలనం సృష్టించింది. పలు అవార్డులు, గోల్డెన్ గ్లోబ్ నామినేషన్లు ఈమె సొంతం.
చైనా నుంచి దిల్ర్బా దిల్మురత్…
చైనాకు చెందిన నటి దిల్ర్బా దిల్మురత్ తన అందం, ప్రతిభతో ఆకట్టుకుంటోంది. 1992లో జన్మించిన ఈమె ఎటర్నల్ లవ్, ది ఫ్లేమ్స్ డాటర్ వంటి డ్రామాలతో చైనాలో తిరుగులేని నంబర్ 1 నటిగా నిలిచింది.
దక్షిణ కొరియా నుంచి నాన్సీ మెక్‌డోనీ…
దక్షిణ కొరియా నటి నాన్సీ మెక్‌డోనీ ఈ జాబితాలో స్థానం దక్కించుకుంది. 2000లో జన్మించిన ఈమె పర్ఫెక్ట్ గర్ల్, డే జాంగ్-గీమ్ ఈజ్ వాచింగ్ వంటి చిత్రాలు, సిరీస్‌లతో గుర్తింపు పొందింది.
ఇండియా నుంచి కృతి సనన్
భారతదేశం నుంచి జాతీయ అవార్డు గ్రహీత కృతి సనన్ టాప్ 10లో నిలిచింది. ఇంజనీరింగ్ చదివి సినీ రంగంలోకి వచ్చిన ఈమె ‘మిమి’ చిత్రానికి జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. దిల్‌వాలే, క్రూ వంటి హిట్‌లలో నటించి నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టింది.

పాకిస్థాన్ నుంచి హానియా అమీర్…
పాకిస్థాన్‌కు చెందిన నటి హానియా అమీర్. 2016లో జనాన్ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె మేరే హమ్‌సఫర్ వంటి విజయవంతమైన టీవీ సిరీస్‌లతో పాక్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీగా మారింది.
క్యూబా నుంచి అనా డి అర్మాస్…
క్యూబాలో పుట్టిన నటి అనా డి అర్మాస్ ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసింది. నైవ్స్ అవుట్, బ్లేడ్ రన్నర్ 2049 వంటి చిత్రాలలో నటించిన ఈమె ప్రస్తుతం హాలీవుడ్‌లో అత్యంత క్రేజీ నటిగా కొనసాగుతోంది.
ఇంగ్లండ్ నుంచి ఎమ్మా వాట్సన్…
బ్రిటిష్ నటి ఎమ్మా వాట్సన్ ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. హ్యారీ పోటర్ సిరీస్‌లోని హెర్మైన్ గ్రెంజర్ పాత్రతో బాల్యంలోనే ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. బ్యూటీ అండ్ ది బీస్ట్ వంటి చిత్రాలతోపాటు ఐక్యరాజ్యసమితికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా కూడా పని చేస్తోంది.
అమెరికా నుంచి అంబర్ హర్డ్…
అమెరికన్ నటి అంబర్ హర్డ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఆక్వామ్యాన్, పైన్‌యాపిల్ ఎక్స్‌ప్రెస్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఈమె మంచి యాక్టివిస్ట్‌గా కూడా పేరు తెచ్చుకుంది.
టర్కీ నుంచి హ్యాండే ఎర్సెల్…
టర్కీ నటి హ్యాండే ఎర్సెల్ తన అందం, నటనతో ప్రపంచాన్ని ఆకట్టుకుంది. 2012లో మిస్ టర్కీ టైటిల్ గెలుచుకున్న ఈమె ది డాటర్స్ ఆఫ్ ది సన్, లవ్ ఈజ్ ఇన్ ది ఎయిర్ వంటి సిరీస్‌లతో టర్కీలో నంబర్ 1 నటిగా రాణిస్తోంది.