సహనం వందే, నెల్లూరు:
నెల్లూరు జిల్లా కల్లూరుపల్లికి చెందిన అరవ కామాక్షి అనే లేడీ డాన్ గంజాయి దందాకు అడ్డుగా వస్తున్నాడని భావించి సీపీఎం నాయకుడు కె. పెంచలయ్య (38)ను దారుణంగా హత్య చేయించింది. గంజాయి విక్రయాలను అడ్డుకుంటున్న పెంచలయ్యపై కక్ష పెంచుకున్న ఈ ముఠా గత శుక్రవారం సాయంత్రం ఆయన్ను అడ్డగించి కత్తులతో పొడిచి చంపింది. ఈ లేడీ డాన్ దందాలకు కొంతమంది పోలీసులు సహకరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలతో నెల్లూరులో రౌడీయిజం, గంజాయి దందాలు మళ్లీ పడగ విప్పడంపై ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.
గంజాయి రాణి దారుణ హత్యలు – నెల్లూరులో సీపీఎం నేతను చంపిన కసాయి