రేవంత్ రెడ్డితో అజయ్ దేవగణ్ – రాష్ట్రంలో అంతర్జాతీయ స్టూడియో

సహనం వందే, ఢిల్లీ:
ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు ఆసక్తి కనబరిచారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో అజయ్ దేవగణ్ ప్రత్యేకంగా సమావేశమై ఈ అంశంపై చర్చించారు. తెలంగాణలో సినీ నిర్మాణానికి కీలకమైన యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియోలు, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సదుపాయాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి స్టూడియో నిర్మాణానికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రిని అజయ్ దేవగణ్ విజ్ఞప్తి చేశారు.

నైపుణ్య శిక్షణ కేంద్రం కూడా…
కేవలం అంతర్జాతీయ స్థాయి స్టూడియో నిర్మాణంతో ఆగకుండా, సినీ పరిశ్రమలోని వివిధ విభాగాలకు అవసరమైన నిపుణులను తయారు చేసేందుకు ఒక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అజయ్ దేవగణ్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇది తెలంగాణలో సినిమా రంగానికి కొత్త ఊపిరి పోస్తుందని, యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, వివిధ రంగాల్లో సాధిస్తున్న ప్రగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజయ్ దేవగణ్‌కు వివరించారు. తెలంగాణ రైజింగ్ (అభివృద్ధి)కి సంబంధించి మీడియా, సినిమా రంగాలకు తాను ప్రచారకర్తగా ఉంటానని అజయ్ దేవగణ్ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *