మన దేశ అల్లుడు మస్క్ – భార్య శివాన్ కి ఇండియన్ మూలాలు

Elon Musk Indian Sun in Law
  • ఆమె తల్లి పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి
  • దీంతో మస్క్ కొడుకుకు శేఖర్ అని పేరు
  • భారత్‌తో బంధం బయటపెట్టిన టెస్లా అధిపతి
  • దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అల్లుడు

సహనం వందే, అమెరికా:

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇండియాకు అల్లుడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అవుతుంది. ఆయన భార్య శివానికి భారతీయ మూలాలు ఉండటమే దీనికి కారణం. తన కొడుకు పేరు వెల్లడించడంతో మస్క్ ఈ విషయాన్ని ధృవీకరించారు. తన భాగస్వామి సగం భారతీయురాలని… అందుకే తన కొడుకు పేరు శేఖర్ అని పెట్టామని మస్క్ బహిరంగంగా చెప్పడం సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయింది. దీంతో భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

శివానీ ఫొటోతో సంచలనం!
ఎక్స్ ప్లాట్‌ఫాంపై జరిగిన ఒక చర్చ ఈ సంచలనానికి తెర తీసింది. ఓ యూజర్ శివాన్ జిల్ అనే మహిళ ఫొటోను పోస్ట్ చేసి ఆమెను ఎలాన్ మస్క్ భాగస్వామిగా… భారతీయ మూలాలున్న వ్యక్తిగా పరిచయం చేశాడు. దీనికి స్పందించిన మస్క్… నిజమేనని ధృవీకరించారు. ఆమె తల్లి భారత్ నుంచి వచ్చారని, అందుకే తమ బిడ్డకు శేఖర్ అని పేరు పెట్టామని రాశారు. తన కుటుంబంలోనే భారతీయత ఉందని ఆయన పేర్కొన్నారు.

కొడుకు పేరు..’ఎక్స్ ఏఈ ఏ ట్వెల్వ్ శేఖర్ మస్క్
శేఖర్
అనే పేరు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఈ పేరుకు శివుడు లేదా శిఖరం అని అర్థం. మస్క్ కొడుకు పూర్తి పేరు ఎక్స్ ఏఈ ఏ ట్వెల్వ్ శేఖర్ మస్క్‘ అని తెలుస్తోంది. గతంలో మస్క్ తన పిల్లలకు తౌ, ఎక్స్ వంటి వింత పేర్లు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాంటిది ఇప్పుడు ఆయన శేఖర్ అనే సంప్రదాయ పేరును ఎంచుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. తన పిల్లల పేర్లలో ఒక భారతీయ పేరును చేర్చడం ద్వారా ఆయన భారత్‌కు మరింత దగ్గరయ్యారనే చెప్పాలి.

భార్యకు పంజాబ్ హిందూ మూలాలు
ఎలాన్ మస్క్
భాగస్వామి శివాన్ జిలిస్ కు భారతీయ మూలాలు ఉన్నాయి. ఆమె తల్లి షార్డా పూర్తిగా భారతీయురాలు. షార్డా పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. వీరు హిందూ పంజాబీ కుటుంబానికి చెందినవారు. శివాన్ 1986లో కెనడాలోని మార్క్‌హామ్‌లో జన్మించింది. తండ్రి రిచర్డ్ జిలిస్ కెనడా వాసి. 2015లో యూఎస్‌ఏ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పంజాబీ మూలాల వల్ల తన పెద్ద కళ్లు వచ్చాయని చెప్పుకుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *