ఉమర్ బెయిల్… చంద్రచూడ్ డిబేట్ – ఉమర్ ఖలీద్ కేసుపై మాజీ సీజేఐ సంచలనం
సహనం వందే, జైపూర్: నిందితులకు బెయిల్ ఇవ్వడమే నిబంధన అని… నిరాకరించడం కేవలం మినహాయింపు మాత్రమేనని సుప్రీం కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఐదేళ్లుగా జైల్లో ఉన్న ఉమర్ ఖలీద్ కేసును ప్రస్తావిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణ పూర్తికాకుండానే ఒక వ్యక్తిని ఏళ్ల తరబడి కటకటాల వెనక ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన తేల్చి చెప్పారు. విచారణే శిక్ష కావద్దుజైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఆదివారం చంద్రచూడ్ మాట్లాడారు. విచారణలో…