- సీఎస్ 80%... ఐటీలో 78% ఉద్యోగాలు
- 2026లోనూ ఈ రంగంలోనే ఎక్కువ జాబ్స్
- 72.76 శాతానికి పడిపోయిన ఎంబీఏ జాబ్స్
- గతం కంటే కామర్స్, సైన్స్‌ల కొత్త రైజింగ్
- ఐటీఐ గ్రాడ్యుయేట్ల ఎంప్లాయబిలిటీ 45.95%
- సర్టిఫికెట్లు కాదు ముఖ్యం… పని వచ్చా లేదా?
- ప్రపంచంలో చదువుల రూటు మారుతోంది!
- టెక్, మేనేజ్మెంట్ రెండింటితో బిగ్ ఆఫర్స్
సహనం వందే, న్యూఢిల్లీ:
నిజం మాట్లాడుకుందాం! జాబ్ మార్కెట్‌లో ఇప్పటికీ డిమాండ్ అంటే అది కంప్యూటర్ సైన్స్ (సీఎస్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) డిగ్రీలకే ఉంది. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 ఏం చెబుతోందంటే… సీఎస్ గ్రాడ్యుయేట్లకు 80 శాతం, ఐటీ గ్రాడ్యుయేట్లకు 78 శాతం ఉద్యోగావకాశాలున్నాయి. అంటే నువ్వు ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్ వైపు అడుగులేస్తే నీ కెరీర్‌కి ఢోకా లేనట్టే! కంపెనీలు ఇప్పుడు కోడింగ్‌కి పరిమితమయ్యే టాలెంట్‌ని కాదు… ఇంజినీరింగ్‌తో పాటు డేటా సామర్థ్యం ఉన్నవారిని కోరుకుంటున్నాయి. మొత్తంగా ఫ్రెషర్ల నియామకాల్లో 35 శాతం ఐటీ రంగంలోనే జరుగుతున్నాయంటే ఈ డిగ్రీల పవరేంటో అర్థం చేసుకోవచ్చు.
ఐటీ జోరు … తగ్గిన ఎంబీఏ డామినేషన్
ఒకప్పుడు పెద్ద చదువు అంటే ఎంబీఏ! కానీ, ఇప్పుడు ఆ సీన్ మారుతోంది. గతంలో 78 శాతం దాకా ఉన్న ఎంబీఏ గ్రాడ్యుయేట్ల ఉద్యోగ సామర్థ్యం ఇప్పుడు 72.76 శాతానికి పడిపోయింది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఎందుకంటే కంపెనీలు కేవలం జనరల్ మేనేజ్‌మెంట్ థియరీ చదివిన వారిని కాకుండా… బిజినెస్ నాలెడ్జ్‌తో పాటు డిజిటల్ స్కిల్స్ (అనలిటిక్స్, టెక్ ఆపరేషన్స్) తెలిసిన వారిని వెతుకుతున్నాయి. ఇంజినీరింగ్ చేసి తర్వాత మేనేజ్‌మెంట్ చేసిన వాళ్లకి డిమాండ్ పెరుగుతోంది. కేవలం థియరీతో కూడిన పాతతరం ఎంబీఏ డిగ్రీ ఇప్పడు అంతగా సరిపోవడం లేదు. ఆ రోజులు పోయాయి!

కామర్స్, సైన్స్‌ల కొత్త రైజింగ్
ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది! నిన్నటిదాకా లైట్ తీసుకున్న కామర్స్ (బీకాం లేదా అలాంటివి) ఇప్పుడు హాట్ ఫేవరెట్ అవుతోంది. ఈ స్ట్రీమ్‌లో ఉద్యోగ సామర్థ్యం 62.81 శాతానికి పెరిగింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసులు, ఇన్సూరెన్స్ రంగాల్లో ఈ గ్రాడ్యుయేట్లకు డిమాండ్ ఓ రేంజ్‌లో ఉంది. ఎందుకంటే కంపెనీలకు తక్కువ ఖర్చుతో డొమైన్ నాలెడ్జ్ ఉన్న టాలెంట్ కావాలి. కేవలం కామర్స్ అనే కాదు… సైన్స్ (నాన్-ఐటీ) గ్రాడ్యుయేట్లు 61 శాతం, ఆర్ట్స్ గ్రాడ్యుయేట్లు 55.55 శాతం ఉద్యోగాలను సాధిస్తున్నారు. అంటే ఆర్ట్స్-సైన్స్ చదివే వాళ్లు కూడా ఇకపై భయపడాల్సిన పనిలేదు. సరైన స్కిల్స్ ఉంటే చాలు ఏ బ్యాక్‌గ్రౌండ్ అయినా పనిచేస్తుంది.
స్కిల్‌కే పీఠం… వొకేషనల్‌కు డిమాండ్
మరో శుభవార్త ఏంటంటే… వృత్తిపరమైన విద్య చదివిన వారి డిమాండ్ మెల్లగా పెరుగుతోంది. ఐటీఐ గ్రాడ్యుయేట్ల ఎంప్లాయబిలిటీ 45.95 శాతం, పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్లది 32.92 శాతానికి పెరిగాయి. దీనికి కారణం ఒక్కటే… కంపెనీలు ఇప్పుడు స్కిల్ ఫస్ట్ నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. తయారీ రంగం, ఈవీ (ఎలక్ట్రిక్ వాహనాలు), రిన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్, హ్యాండ్స్-ఆన్ సామర్థ్యం ఉన్నవారికి మంచి డిమాండ్ ఉంది. కేవలం డిగ్రీ పేపర్‌తో పనవదు… చేతిలో పని తెలిసుండాలి!
యువతకు స్ట్రెయిట్ ఫార్వర్డ్ సూచన…
మొత్తంగా ఈ రిపోర్ట్ యువతకు ఒకే ఒక్క క్లియర్ మెసేజ్ ఇస్తోంది. డిగ్రీ ఒక్కటే ముఖ్యం కాదు… దానితో పాటు నీకు స్కిల్స్ ముఖ్యం!
- టెక్ వైపు వెళ్తే అది సీఎస్ లేదా ఐటీ అయితే జాబ్ పక్కా!
- ఎంబీఏ చేయాలంటే… జనరల్ సబ్జెక్టులు కాకుండా… డేటా అనలిటిక్స్, ఆపరేషన్స్ టెక్ వంటి వాటిలో కచ్చితంగా స్పెషలైజ్ చెయ్యాలి.
- కామర్స్ లేదా ఆర్ట్స్ చదివినా దానికి అనలిటికల్ లేదా డిజిటల్ స్కిల్స్ జోడిస్తే నీ కెరీర్ గ్రాఫ్ ఆకాశాన్ని తాకుతుంది.
- ఇప్పుడు చదువుల ఫార్ములా మారిపోయింది. స్కిల్స్ + స్పెషలైజేషన్ + రియల్-వరల్డ్ నాలెడ్జ్ ఉంటేనే భవిష్యత్తు నీ సొంతం అవుతుంది.
- ఏది చదివామనేదానికంటే ఎలా చదివాం… ఏం నేర్చుకున్నాం అనేది ఇప్పుడు చాలా కీలకం.
Source ➡ https://tinyurl.com/3rabx6hp