సహనం వందే, హైదరాబాద్:
విద్య ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చని వాల్మీకి ఫౌండేషన్ చైర్మన్ సూర్య గణేష్ వాల్మీకి అన్నారు. శనివారం సిటీ శివారులోని డీఎంఆర్ గార్డెన్స్‌లో సంస్థ వార్షికోత్సవం ‘ఏకత్వం – మనీ హాండ్స్, వన్ మిషన్’ థీమ్‌తో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 100కు పైగా సైకిళ్లు, పుస్తకాలు, క్రీడా సామగ్రిని గ్రామీణ పిల్లలకు పంపిణీ చేశారు. ప్రత్యూష సపోర్ట్, పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగని సహకారంతో 3,000 బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్‌లను హైస్కూల్ బాలికలకు అందజేశారు. సంస్థ జనరల్ సెక్రటరీ, ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ హరి కిషన్ వాల్మీకి, స్కల్ ఇంటర్నేషనల్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ ఎన్‌ఎస్‌ఎన్ మోహన్, ప్రగతి గ్రూప్ చైర్మన్ డాక్టర్ జీబీకే రావు, సెక్యూరిటీ స్టడీస్ నిపుణులు డాక్టర్ రమేష్ కన్నెగంటి, మౌనిక రెడ్డి, కెన్నెడీ హాలిడే ట్రావెల్ సీఈవో, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
విద్యతో పేదరిక నిర్మూలన – వాల్మీకి ఫౌండేషన్ చైర్మన్
