క్రికెట్ బాల్… క్యాబినెట్ ‘గోల్’ – నేడు స్టార్ క్రికెటర్ అజహర్ ప్రమాణ స్వీకారం
సహనం వందే, హైదరాబాద్:భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత గ్రేస్‌ఫుల్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. శుక్రవారం (నేడు) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాజ్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమైంది. క్రికెట్ పిచ్‌లపై మాయ చేసిన ఈ సెలబ్రిటీ ఇప్పుడు పరిపాలనలోకి అడుగు పెట్టడం రాష్ట్ర రాజకీయాలకు గ్లామర్ టచ్ ఇస్తోంది. ముస్లిం మైనారిటీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలనే కాంగ్రెస్ వ్యూహంలో…