లోకేష్ విందులో కలిశెట్టి భావోద్వేగం -ఎంపీ కుటుంబంతో ఆత్మీయ బంధం

Lokesh Dinner to MP
  • లోకేష్‌కు అప్పలనాయుడి తల్లి ఆశీస్సులు
  • నుదుటిపై ముద్దుపెట్టిన కలిశెట్టి సూరప్పమ్మ
  • అమ్మ ఆశీస్సు ఘట్టం… ఎంపీ కన్నీటి క్షణం!
  • ప్రజాప్రతినిధుల కుటుంబాలతో లోకేష్

సహనం వందే, అమరావతి:

రాజకీయ చదరంగంలో ఎత్తుగడలు ఒకవైపు ఉంటే మానవీయ సంబంధాలు మరోవైపు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం సరిగ్గా ఇలాంటి అరుదైన దృశ్యానికే వేదికైంది. కేవలం రాజకీయ చర్చలకే పరిమితం కాకుండా కుటుంబ సభ్యులను భాగస్వామ్యం చేయడం ద్వారా లోకేష్ సరికొత్త రాజకీయ సంస్కృతికి తెరలేపారు.

MP Kalisetti Family with Nara Lokesh

కుటుంబాల కలయిక…
ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం సోమవారం రాత్రి ఒక వినూత్న వేడుకకు సాక్ష్యంగా నిలిచింది. మంత్రి నారా లోకేష్ తన నివాసంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజాప్రతినిధులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. రాజకీయాల కంటే ఆత్మీయతకే ఇక్కడ పెద్దపీట వేశారు.

మంత్రి లోకేష్ పలకరింపు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న లోకేష్ ఈ విందులో ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది. ఒక శక్తివంతమైన మంత్రిగా కాకుండా ఇంటి సభ్యునిగా ఆయన వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కార్యకర్తలను, నాయకులను సొంత మనుషులుగా భావించే గుణమే ఆయనను ప్రత్యేకంగా నిలుపుతోంది.

కలిశెట్టి మాతృమూర్తి భావోద్వేగం
ఈ సమావేశంలో అత్యంత ఆసక్తికరమైన, మనసును హత్తుకునే ఘట్టం ఒకటి చోటుచేసుకుంది. ఎంపీ అప్పలనాయుడి మాతృమూర్తి కలిశెట్టి సూరప్పమ్మ లోకేష్‌ను చూసి ఎంతో ఆనందించారు. తన కుమారుడిపై లోకేష్ చూపిస్తున్న అభిమానాన్ని చూసి ఆమె బావోద్వేగానికి లోనయ్యారు. ప్రేమపూర్వకంగా మంత్రిని హత్తుకుని తన ఆశీస్సులు అందజేశారు.

అరిసెలు… పిండి వంటలు
ఎంపీ అప్పలనాయుడు స్టైలే వేరు. తన ఆత్మీయతతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈ సందర్భంగా ఎంపీ కుటుంబం సభ్యులు లోకేష్ కు పిండి వంటలు, అరిసెలు అందజేశారు. అలాగే లోకేష్ తన తల్లి భువనేశ్వరికి యువగళం పాదయాత్రలో షూ లేస్ కట్టిన చిత్రాన్ని ఫ్రేం చేయించి బహుమతిగా ఇవ్వడం ఆసక్తికరం.

ఉత్తేజితమైన నాయకత్వం
ఈ విందు అనంతరం ఎంపీ అప్పలనాయుడు మాట్లాడారు. లోకేష్ ఇచ్చిన ఈ ఆత్మీయ భేటీ తమలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి సమావేశాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కేవలం భోజనం మాత్రమే కాదని తమ మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరిచే ప్రక్రియ అని ఆయన విశ్లేషించారు.

ప్రజా సేవకు ప్రేరణ
ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ కలయిక కేవలం వ్యక్తిగత గౌరవానికే పరిమితం కాలేదు. ఇది ప్రజా సేవలో మరింత ఉత్సాహంగా పనిచేసేలా తమను ప్రేరేపిస్తుందని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఎటువంటి భేషజాలు లేని ఇలాంటి సంభాషణలు నాయకత్వానికి క్షేత్రస్థాయి కార్యకర్తలకు మధ్య వారధిగా పనిచేస్తాయి. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ఇలాంటి ఐక్యత ఎంతో దోహదపడుతుంది.

లోకేష్ కొత్త పంథా
నారా లోకేష్ అనుసరిస్తున్న ఈ విధానం రాజకీయాల్లో కొత్త మార్పును సూచిస్తోంది. సాధారణంగా రాజకీయ సమావేశాలు గంభీరంగా సాగుతుంటాయి. కానీ లోకేష్ మాత్రం కుటుంబ సభ్యులను కలపడం ద్వారా ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ప్రజాప్రతినిధుల వ్యక్తిగత జీవితాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వారి విధేయతను, పనితీరును మెరుగుపరిచే వ్యూహమిది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *