- అనే నినాదంతో మిస్ వరల్డ్ పోటీలు
- ఈనెల 7 నుండి 31 వరకు నిర్వహణ
- 120 దేశాల నుంచి అందాల రాణులు
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ ఖ్యాతిని మరింతగా పెంచేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలను హైదరాబాద్ వేదికగా ఈ నెల 7 నుండి 31 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించింది. ఈ పోటీలను తెలంగాణ ప్రత్యేకతలను ప్రపంచానికి చాటి చెప్పే సువర్ణావకాశంగా భావిస్తూ, భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.

ప్రపంచం కళ్లన్నీ తెలంగాణవైపే!…
‘ప్రపంచం కళ్లన్నీ తెలంగాణవైపే!’ అనే నినాదంతో ఈ మెగా ఈవెంట్ రాష్ట్ర చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలువనుంది. దాదాపు 120 దేశాల నుండి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఈ వేడుకలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పర్యాటక ఆకర్షణలు, వైద్య, భద్రతా టూరిజం, తెలంగాణ అభివృద్ధి, ఇతర ప్రత్యేకతలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ప్రత్యేక థీమ్‌లు, టూరిస్ట్ సర్క్యూట్‌లను సిద్ధం చేశారు. కాగా, మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్‌పర్సన్, సీఈఓ జూలియా ఎవెలిన్ మోర్లీ, మిస్ వరల్డ్ అధికారిణి కెర్రీ ఇతర అధికారులు శుక్రవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా వారికి భారతీయ సంప్రదాయంతో ఘన స్వాగతం లభించింది.

తేదీల వారీగా కార్యక్రమాల ప్రణాళిక…
- మే 2 – 8: మిస్ వరల్డ్ పోటీల కంటెస్టెంట్లు హైదరాబాద్‌కు రాక.
- మే 12:
- బుద్ధిష్టు ఆధ్యాత్మిక పర్యటన: నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం ప్రాజెక్టు సందర్శన.
- హైదరాబాద్ హెరిటేజ్ వాక్: చార్మినార్, లాడ్ బజార్‌లలో సాంస్కృతిక వారసత్వ నడక.
- మే 13: చౌమహల్లా ప్యాలెస్ సందర్శన, లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ వీక్షణ.
- మే 14:
- గ్రూప్ 1: వరంగల్‌లోని వెయ్యి స్థంభాల గుడి, వరంగల్ కోట సందర్శన.
- గ్రూప్ 2: యునెస్కో వారసత్వ సంపద రామప్ప ఆలయ సందర్శన, పేరిణి నృత్య ప్రదర్శన.
- మే 15:
- గ్రూప్ 1: యాదగిరిగుట్ట ఆలయ సందర్శన.
- గ్రూప్ 2: పోచంపల్లిలో చేనేత వస్త్రాల తయారీ, ప్రదర్శన ప్రత్యక్షంగా తిలకిస్తారు.
- మే 16:
- గ్రూప్ 1: హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో మెడికల్ టూరిజంపై అవగాహన కార్యక్రమం, ఆధునిక ఆసుపత్రుల ప్రత్యేకతల గురించి వివరణ.
- గ్రూప్ 2: మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి వృక్ష సందర్శన.
- గ్రూప్ 2 (సాయంత్రం): హైదరాబాద్‌లోని ఎక్స్పీరియన్ ఎకో పార్కు సందర్శన.
- మే 17:
- గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫైనల్ పోటీలు.
- రామోజీ ఫిలిం సిటీ సందర్శన.
- మే 18:
- తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సందర్శన, రాష్ట్ర భద్రతా చర్యలు, సేఫ్టీ టూరిజం గురించి పరిశీలన.
- సచివాలయ సందర్శన, తెలంగాణ అభివృద్ధి, చరిత్రపై అవగాహన, ట్యాంక్ బండ్‌పై సండే ఫండే కార్నివాల్ సందర్శన.
- మే 20 & 21: కాంటినెంటల్ ఫినాలే – ప్రాంతాల వారీగా ఫాస్ట్ ట్రాక్ ఎంపికలు.
- మే 20 లేదా 21: గ్రూప్ 1 కంటెస్టెంట్లు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌కు హాజరు.
- మే 21: గ్రూప్ 2 కంటెస్టెంట్లు శిల్పారామంలో తెలంగాణ కళాకారులచే నిర్వహించే ఆర్ట్స్, క్రాఫ్ట్స్ వర్క్‌షాప్‌లో పాల్గొంటారు.
- మే 22: మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే.మే 23: H2H ఛాలెంజ్ ఫినాలే.
- మే 24: మిస్ వరల్డ్ టాప్ మోడల్, ఫ్యాషన్ ఫినాలే & జ్యువెలరీ/పెర్ల్ గది షో.
- మే 26: బ్యూటీ విత్ పర్పస్ కార్యక్రమం.
- మే 31: మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే.