అ’ఖండ ఖండ’ – దురంధర్ దెబ్బకు బాలకృష్ణ విలవిల

Akhanda Vs Dhurandar
  • అరుపులు కేకల పైత్యంతో సినిమాలా?
  • బాలయ్య సీక్వెల్‌కు ఊహించని షాక్
  • బోయపాటి సినిమాకు నష్టాలు తప్పేట్లు లేదు
  • ధురంధర్ తెలుగు డబ్బింగ్‌తో మరింత గండం
  • ఈనెల 19న డబ్బింగ్ విడుదలకు ఛాన్స్?

సహనం వందే, హైదరాబాద్:

నందమూరి బాలకృష్ణ – బోయపాటి కాంబోలో భారీ అంచనాల మధ్య విడుదలైన అఖండ 2 సినిమాకు బాక్సాఫీస్ వద్ద చుక్కెదురైంది. అంచనాలకు తగ్గ స్పందన రాకపోవడంతో తొలి రోజు వసూళ్లకు… శని-ఆదివారాల్లో వచ్చిన కలెక్షన్లకు అస్సలు పొంతన లేదు. ఇదే సమయంలో విడుదలైన మోగ్లీ చిత్రం పూర్తిగా తేలిపోయింది. రణ్‌వీర్ సింగ్ నటించిన హిందీ చిత్రం ధురంధర్ దూసుకుపోతుంది. కేవలం హిందీ వెర్షన్‌తోనే తెలుగు రాష్ట్రాల్లో ఈ స్పై థ్రిల్లర్ జోరు పెంచడం విశేషం.

ధురంధర్ సునామీలో మునిగిన అఖండ…
ఈ నెల 5న రిలీజైన ధురంధర్ సినిమా అనూహ్యమైన మౌత్ టాక్‌తో ఒక్కసారిగా పికప్ అయ్యింది. అఖండ విడుదల వాయిదా వల్ల తెలుగు రాష్ట్రాల్లో ధురంధర్‌కు కలిసొచ్చిందనే చెప్పాలి. అఖండ విడుదలైన తర్వాత కూడా రణ్‌వీర్ సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. హైదరాబాద్‌తో పాటు చాలాచోట్ల శని, ఆదివారాలు ధురంధర్ సినిమాకు హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. సోమవారం బుకింగ్స్‌లోనూ బాలయ్య చిత్రం కంటే రణ్‌వీర్ చిత్రమే కాస్త ముందు ఉండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

అరుపులు కేకల అఖండ 2…
సినిమాలో కంటెంట్ లేకుండా కేవలం అరుపులు గోలలతో విజయం సాధించాలనుకోవడం భ్రమ అని సినిమా విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. అఖండ 2 అలాంటి సినిమాయేనని అంటున్నారు. దురంధర్ పూర్తిగా దేశభక్తి కలిగిన సినిమా. పాకిస్తాన్ లో గూఢచారి నేపథ్యంలో కొనసాగిన స్టోరీ అది. కానీ అఖండ మాత్రం కంటెంట్ లేకుండా ఏదో కొద్దిపాటి దైవత్వం కలిపి అరుపులు కేకలతో కొనసాగిన సినిమాగా పలువురు విమర్శిస్తున్నారు. దీంతో దురంధర్ సినిమా ముందు అఖండ పప్పులు ఉడకలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన అఖండ 2 బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. కానీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కేవలం 65 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత కలెక్షన్ల ప్రకారం ఈ సినిమాకు నష్టాలు తప్పేలా కనిపించట్లేదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ధురంధర్ తెలుగు డబ్బింగ్‌తో మరింత గండం
ఇప్పటికే అఖండ 2 కలెక్షన్లు డీలా పడగా వచ్చే శుక్రవారం (డిసెంబర్ 19) ధురంధర్ సినిమా తెలుగు డబ్బింగ్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు మరింత కలవరం సృష్టిస్తున్నాయి. ఒకవేళ డబ్బింగ్ రిలీజైతే ధురంధర్ సినిమా ఆల్రెడీ చేసిన నష్టం ఇంకాస్త పెరగడం గ్యారంటీ. ధురంధర్ సినిమా 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 500 కోట్ల రూపాయల మార్కును దాటేసి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరడం గమనార్హం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *