మా’ర్వౌడీ’ బిజినెస్ – ఉత్తరాది నుంచి దక్షిణాదికి మార్వాడీ విస్తరణ

  • ఉత్తరాది నుంచి దక్షిణాదికి మార్వాడీ విస్తరణ
  • ఓలా, ఓయో, లెన్స్‌కార్ట్, డీమార్ట్ అన్నీ వాళ్ళవే
  • దేశాన్ని ఏలుతున్న మార్వాడీ కుటుంబాలు
  • తెలంగాణలో కోమట్ల కుటుంబాలు మటాష్
  • రాష్ట్రంలో రాజుకున్న ఉత్తరాది వ్యతిరేకత
  • ఇతర రాష్ట్రీయ వ్యాపారాలకూ తూట్లు
  • మార్వాడీల ఎత్తుల ముందు మనం చిత్తు

సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ఊపందుకుంది. వారిని తట్టుకోలేక వైశ్య కుటుంబాలు వ్యాపారాలను వదిలేస్తున్నాయి. అంతే కాదు అనేక ఇతర వ్యాపార కుటుంబాలు కూడా మార్వాడీల ముందు చిత్తయిపోతున్నాయి. కిరాణం కొట్టు మొదలు… బంగారం వ్యాపారం వరకు మార్వాడీలదే రాజ్యం నడుస్తుంది. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో వారి హవా కొనసాగుతోంది. దీంతో స్థానిక వ్యాపారులు దుకాణాలు మూసేసుకుంటున్నారు. వారిని తట్టుకొని నిలబడటం సాధ్యం కావడం లేదు.

భారత్‌ ధనవంతుల్లో 42 శాతం మార్వాడీలే…
రూ. 5 వేల పెట్టుబడితో రూ. 50వేల కోట్లు సంపాదించారు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా. ఆయనో మార్వాడీ. మధ్యతరగతి పచారీ సామాన్లకు కేరాఫ్‌ అడ్రస్ డీమార్ట్. దాని ఫౌండర్ ఓ మార్వాడీ. ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ మార్వాడీ. బజాజ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఒక మార్వాడీ. ఓయో రూమ్స్‌ ఫౌండర్ మార్వాడీ. అల్ట్రాటెక్‌ సిమెంట్, రేమండ్, గోయెంకా, సియెట్‌… ఈ కంపెనీలన్నీ మార్వాడీలవి. ఫ్లిప్‌కార్ట్, మింత్రా, లెన్స్‌కార్ట్, జొమాటో కో-ఫౌండర్లు మార్వాడీలు. ఓలా, షాప్‌క్లూస్ పెట్టిన వాళ్లూ మార్వాడీలే. ఒక లెక్క ప్రకారం భారత్‌లో ఉన్న ధనవంతుల్లో 42 శాతం మార్వాడీలే. ఈ మార్వాడీల వ్యాపార మెళకువల ముందు… ఎంబీఏలు, మార్కెటింగ్ పాఠాలు, బిజినెస్‌ స్కూల్స్‌ అన్నీ దిగదుడుపే.

ఎత్తులతో చిత్తు చేస్తారు..‌.
మార్వాడి బిజినెస్ ఒకరకంగా రౌడీ వ్యాపారం లాంటిది. స్థానిక వ్యాపారులను తొక్కి పైకి రావడంలో వాళ్లకు మించిన వాళ్లు లేరు. మార్వాడీల వ్యాపార ఆధిపత్యంపై తెలంగాణలో ఎప్పటినుంచో ఆందోళన కనిపిస్తోంది. అయితే పెద్దగా బయటపడలేదు, అలాంటి సందర్భాలూ రాలేదు. కాని ఈమధ్య వరుస సంఘటనలు కనిపిస్తున్నాయి మార్వాడీలకు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో కార్‌ పార్కింగ్‌ విషయంలో చిన్న తగాదా జరిగింది. ఆ గొడవలో మార్వాడీలు స్థానికుడిపై దాడి చేశారు. విజువల్స్‌ కూడా బయటికొచ్చాయి. అది కాస్త సోషల్‌ మీడియాలో చాలా వైరల్‌ అయింది. అదే సమయంలో ఆమనగల్లులో మార్వాడీలకు వ్యతిరేకంగా పెద్ద పోరాటమే జరుగుతోంది. అక్కడ సోమవారం బంద్ కూడా పాటించారు.

ఉత్తరాధిపత్యం…
దక్షిణాదిలో కేవలం మార్వాడి వ్యాపారస్తులే కాకుండా అనేకమంది ఉత్తరాది ప్రాంతాలకు చెందిన వాళ్లు ఇక్కడికి వలస వచ్చి ఈ ప్రాంతాన్ని తమ గుపిట్లోకి తీసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. వ్యాపారస్తుల కుటుంబాలనే కాకుండా సాధారణ ఉద్యోగులు, కూలీల ఉపాధి అవకాశాల మీద కూడా ఉత్తరాది వాళ్లు గండి కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు దేశంలో ఉత్తరాది రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక ఆధిపత్యం నడుస్తుంది. ఉత్తరాదికి చెందిన వాళ్లే దేశంలో కీలక స్థానాల్లో రాజకీయాలను నడిపిస్తున్నారు. ప్రధాన మంత్రులు కీలక స్థాయి ఇతరత్రా రంగాల్లో వాళ్లే గుత్తాధిపత్యం వహిస్తున్నారు. ఆర్థిక రంగంలో ఉత్తరాది వాళ్లే పెత్తనం చేస్తున్నారు.

డీలిమిటేషన్ తో సౌత్ లిమిటేషన్…
మరోవైపు రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్) జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగనుంది. ఇప్పుడున్న పద్ధతిలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆ తర్వాత దక్షిణాది ప్రాంతం రాజకీయాల్లో జీరోగా మారనుంది. ఇక్కడి ఎంపీలతో సంబంధం లేకుండా కేవలం ఉత్తరాది పార్లమెంటు సభ్యులతోనే దేశంలో అధికారం చలాయించే అవకాశం ఉంటుంది. ఇలా ఉత్తరాది కుట్రలు దక్షిణాదిని అన్ని రంగాల్లో దిగజార్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితి మారాలని సౌత్ సేన, సౌత్ ఇండియా మీడియా అసోసియేషన్ (సైమా) ప్రత్యేక కార్యాచరణకు నడుం బిగించాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *