sahanamvande@gmail.com

35 రకాల ఔషధాలపై నిషేధం

నొప్పి నివారణ, మధుమేహం సహా పలు మందులు సహనం వందే ఢిల్లీ: దేశవ్యాప్తంగా 35 రకాల ఔషధాల తయారీని నిలిపివేయడంతో పాటు వాటి విక్రయాలను కూడా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నొప్పి నివారణ, మధుమేహం వంటి వ్యాధులకు ఉపయోగించే అనుమతి లేని సుమారు 35 రకాల ఔషధాలపై నిషేధం విధిస్తూ కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సంస్థ సూచనల మేరకు అనుమతి…

Read More

న్యూయార్క్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు

సహనం వందే, న్యూయార్క్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని న్యూయార్క్ సిటీ ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఏప్రిల్ 14వ తేదీని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ డేగా న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ అధికారికంగా ప్రకటించారు. డాక్టర్ అంబేద్కర్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన కృషిని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన పుట్టినరోజును ప్రత్యేకంగా గుర్తించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ, న్యూయార్క్…

Read More

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్

1248 నామినేషన్లు సహనం వందే, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌కు భారీ స్పందన లభించింది. ఈ అవార్డుల ఎంపిక కోసం సినీనటి జయసుధ చైర్మన్‌గా జ్యూరీ సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని ఎఫ్‌డిసి కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు జ్యూరీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, అవార్డుల కోసం వచ్చిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని కోరారు. తెలుగు సినిమా రంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా జ్యూరీ…

Read More

సూర్యాపేట శరత్ కార్డియాక్ సెంటర్‌లో తనిఖీలు

బయటపడ్డ అక్రమాలు… టీజీఎంసీ నోటీసులు సహనం వందే, సూర్యాపేట సూర్యాపేటలోని శరత్ కార్డియాక్ సెంటర్‌లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కార్డియాక్ సెంటర్‌లో జరుగుతున్న పలుఅక్రమాలు బయటపడ్డాయి. తనిఖీల్లో డాక్టర్లు తమ సర్టిఫికెట్లను అమ్ముకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. అర్హత కలిగిన గుండె డాక్టర్ లేకుండానే టెక్నీషియన్ స్కాన్ చేసి డాక్టర్ పేరు మీద రిపోర్ట్ ఇస్తున్నట్టు తేలింది. ప్రశాంత్ అనే పేషెంట్‌కు వనం శరత్ చంద్ర అనే…

Read More

బిడ్డ మాయమైతే ఆసుపత్రి లైసెన్స్ రద్దు

సహనం వందే, న్యూఢిల్లీ: ఇకపై ఏ ఆసుపత్రిలో పసిపాప కనిపించకుండా పోయినా, వారి లైసెన్స్ రద్దు చేయడం ఖాయం! పిల్లల అక్రమ రవాణాదారుల పట్ల తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో, ఆసుపత్రులు కూడా అంతే బాధ్యతగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు మంగళవారం తన తీర్పులో స్పష్టం చేసింది. ముఠాల నుంచి చిన్నారులను కాపాడటంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అత్యున్నత న్యాయస్థానం పిలుపునిచ్చింది. కంటికి రెప్పలా కాపాడాలి… ప్రతి ఆసుపత్రిలో ప్రసవించిన శిశువు సంపూర్ణ బాధ్యత ఆసుపత్రి సిబ్బందిదేనని జస్టిస్…

Read More

నగర జీవితానికి స్వస్తి పలికి…

సహనం వందే, హర్యానా: నగరంలోని ఉరుకులు పరుగుల జీవితానికి విసిగిపోయిన ఓ జంట.. పచ్చని పొలాల బాట పట్టారు. రసాయనాలు లేని సేంద్రీయ వ్యవసాయంతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. హర్యానాలోని సోనిపట్ జిల్లా, మెహమూద్‌పూర్ గ్రామానికి చెందిన జితేంద్ర మాన్, ఆయన భార్య సర్లా మాన్.. పట్టణ జీవితంలోని ఒత్తిళ్లకు దూరంగా, స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. టీసీఎస్ ఉద్యోగం వదిలేసి… గతంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్)లో 11 ఏళ్ల పాటు…

Read More

ఉగ్రవాది డిమాండ్లకు తలొగ్గిన ఎన్ఐఏ

సహనం వందే, న్యూఢిల్లీ: 2008 ముంబై మారణహోమ సూత్రధారి, వైద్య వృత్తిని అభ్యసించి ఉగ్రవాదిగా మారిన తహవూర్ హుస్సేన్ రాణా ప్రస్తుతం ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నాడు. ఢిల్లీలోని ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సెల్‌లో ఉన్న రాణా డిమాండ్లకు ఎన్ఐఏ తలొగ్గిందా అన్న విమర్శలు వస్తున్నాయి. అతను ఖురాన్ పుస్తకం, రాయడానికి కలం, కాగితం ఇవ్వాలని కోరడంతోపాటు రోజూ ఐదు సార్లు నమాజ్ చేసుకుంటానని కోరాడు. దీన్ని ఎన్ఐఏ అధికారులు అనుమతించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొనసాగుతున్న…

Read More

కోవిడ్ తర్వాత పుంజుకున్న విమానయానం

సహనం వందే, న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి కారణంగా నాలుగేళ్లపాటు భారీగా పడిపోయిన విమాన ప్రయాణాలు… గత ఏడాది నుంచి మళ్లీ పుంజుకున్నాయి. 2024లో ప్రపంచ వైమానిక ప్రయాణికుల సంఖ్య 2019 స్థాయిలను అధిగమించినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ డేటా ప్రకారం… 2024లో మొత్తం ప్రయాణికుల సంఖ్య 4.7 బిలియన్లకు చేరుకుంది, ఇది 2019లో నమోదైన 4.5 బిలియన్ల కంటే ఎక్కువ. నాలుగేళ్లు దెబ్బ తిన్న విమానరంగం… 2020లో కోవిడ్ కారణంగా విమాన…

Read More

అందాల వేదికపై ఎర్రజెండా

సహనం వందే, హైదరాబాద్: చైనా, వియత్నాం వంటి కమ్యూనిస్టు దేశాలు అందాల పోటీలను ప్రోత్సహిస్తుంటే… క్యూబా, ఉత్తర కొరియా కమ్యూనిస్టు దేశాలు మాత్రం వాటిని పాశ్చాత్య సంస్కృతిగా దూరంగా ఉంచుతున్నాయి. ఇండియా కమ్యూనిస్టులు సైతం ఇదే బాటలో నడుస్తున్నారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలపై వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతర్జాతీయ ఉనికికోసం చైనా తహతహ… చైనా, వియత్నాం వంటి కమ్యూనిస్టు దేశాలు అందాల పోటీలను ఆర్థికాభివృద్ధికి, అంతర్జాతీయంగా తమ…

Read More

యాదాద్రి జిల్లాలో వైద్యం అస్తవ్యస్తం

సహనం వందే, హైదరాబాద్: ప్రభుత్వం నుంచి నిధులు రావడమే కష్టం. అలాంటిది వచ్చిన నిధులను కూడా వాడుకోకపోవడం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వైద్యాధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఆ జిల్లాకు వచ్చిన నిధుల్లో దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయకపోవడంతో అవి తిరిగి వెనక్కి పోయాయి. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్ సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్ సీ), జిల్లా ఆసుపత్రుల్లో సమస్యలు తిష్ట వేశాయి. దీంతో రోగులకు సరైన వైద్యం చేయడానికి…

Read More