sahanamvande@gmail.com

కైలాష్ కి గ్రీన్ సిగ్నల్

సహనం వందే, హైదరాబాద్: కైలాష్ మానసరోవర్ యాత్ర కోసం ఎదురుచూస్తున్న భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2020 నుంచి నిలిచిపోయిన ఈ పవిత్ర యాత్రను మళ్లీ ప్రారంభించేందుకు విదేశాంగ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. త్వరలో కైలాష్ కు ప్రయాణం! హిందూ, బౌద్ధ, జైన మతాల వారికి ఎంతో పవిత్రమైన కైలాష్ పర్వతం, మానస సరోవర్ సరస్సులను దర్శించుకునే అవకాశం మళ్లీ రానుంది. ఈ ఏడాది…

Read More

ప్యాలెస్ పాలిటిక్స్

సహనం వందే, హైదరాబాద్/అమరావతి: రాజకీయ నాయకులు పేదల సేవకులమని గొప్పలు చెప్పుకుంటూ, సామాన్య దుస్తులు, చెప్పులు ధరించి అత్యంత సాధారణ జీవన శైలితో కనిపిస్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధరించే దుస్తులు అత్యంత సామాన్యుడిని గుర్తుచేస్తాయి. అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సాధారణమైన బట్టలు, చెప్పులతో కనిపిస్తారు. ఇక ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటినుంచి ఒకే స్టయిల్ సాధారణ దుస్తులు ధరిస్తారు. వందల కోట్లు ఉన్న తెలంగాణ రెవిన్యూ మంత్రి పొంగిలేటి…

Read More

ద్విజాతి సిద్ధాంతం వల్లే పాకిస్థాన్ ఏర్పాటు

సహనం వందే, ఇస్లామాబాద్: హిందువులకు, ముస్లింలకు జీవన విధానంలో ప్రతి విషయంలోనూ వైరుధ్యం ఉందని, అనేక తేడాలు ఉన్నాయని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఏర్పడటానికి ఈ ద్విజాతి సిద్ధాంతమే ముఖ్య కారణమని ఆయన మరోసారి చెప్పారు. ఇస్లామాబాద్‌లో జరిగిన విదేశీ పాకిస్థానీయుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ మూలాలను గుర్తుంచుకోండి… దేశ గుర్తింపును కాపాడుకోవడానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ ద్విజాతి సిద్ధాంతం గురించి తప్పకుండా…

Read More

సిజేరియన్ డెలివరీలపై కఠిన చర్యలు

వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ సహనం వందే, హైదరాబాద్: సరియైన కారణం లేకుండా సిజేరియన్ డెలివరీలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సి-సెక్షన్ ఆడిట్‌ను మరింత పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ కాన్పుల సంఖ్యను మరింత పెంచాలని మంత్రి అన్నారు. సాధారణ కాన్పుల వల్ల కలిగే లాభాలను, సిజేరియన్ వల్ల జరిగే నష్టాలను…

Read More

జలుబుకి సిగరెట్ చికిత్స

5 ఏళ్ల బాలుడికి చికిత్స పేరుతో సిగరెట్ తాగించిన డాక్టర్ సహనం వందే, లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో ఒక డాక్టర్ చేసిన పని అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. డాక్టర్ సురేష్ చంద్ర ఐదేళ్ల బాలుడికి జలుబు నయం చేయడానికి చికిత్స పేరుతో సిగరెట్ తాగించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై విచారణ ప్రారంభించారు. కుతుంద్‌లోని సెంట్రల్ హెల్త్ సెంటర్‌లో ఈ అమానుషమైన సంఘటన జరిగింది. వీడియోలో డాక్టర్ ఆ బాలుడికి…

Read More

గూగుల్‌కు ఎదురుదెబ్బ

వెబ్ యాడ్ వ్యాపారంలో గుత్తాధిపత్యం చెలాయించిందని కోర్టు తీర్పు సహనం వందే, వర్జినియా: టెక్ దిగ్గజం గూగుల్ తన వెబ్ ప్రకటనల వ్యాపారంలో చట్టవిరుద్ధంగా గుత్తాధిపత్య సామ్రాజ్యాన్ని నిర్మించిందని అమెరికా ఫెడరల్ జడ్జి తీర్పు చెప్పారు. ఈ తీర్పు గూగుల్‌పై అమెరికా న్యాయశాఖ వేసిన యాంటీట్రస్ట్ కేసులో ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు. వర్జీనియాలోని అలెగ్జాండ్రియా ఫెడరల్ కోర్టులో జరిగిన విచారణలో జడ్జి లియోనీ బ్రింకెమా గూగుల్ ఆన్‌లైన్ యాడ్ మార్కెట్‌లో పోటీని తగ్గించే విధంగా ప్రవర్తించిందని…

Read More

స్మితా సబర్వాల్‌కు కంచె గచ్చిబౌలి ఎఫెక్ట్

పోలీసుల నోటీసులు సహనం వందే, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల అంశానికి సంబంధించి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలిలో వన్యప్రాణుల పరిస్థితి దయనీయంగా ఉందంటూ వైరల్ అయిన కొన్ని నకిలీ ఫోటోలను స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. పోలీసులు ఈ విషయంపై మరింత విచారణ జరుపుతున్నారు.

Read More

ఉద్యమాలకు గ్లామర్

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, ఆధునిక ఉద్యమాలకు కొత్త దిశానిర్దేశం చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) సమీపంలోని 400 ఎకరాల అటవీ భూములను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు, విద్యార్థులు, మేధావులు, సినీ తారలు, ప్రజాసంఘాలు ఒక్కటై ఈ భూములను కాపాడారు. ఈ భూములను పునరుద్ధరించాలని బుధవారం తీర్పు ఇవ్వడంతో ఈ ఉద్యమం చారిత్రక విజయాన్ని సాధించింది. అటవీ సంపద కోసం విద్యార్థుల…

Read More

హంతకుడి చర్మంతో పుస్తకం

సహనం వందే, లండన్: బ్రిటన్ చరిత్రలో ఒక భయంకరమైన నేరానికి గుర్తుగా నిలిచిన పుస్తకం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హంతకుడు విలియం కోర్డర్ చర్మంతో చేసిన అరుదైన పుస్తకం సఫోల్క్‌లోని మోయిసెస్ హాల్ మ్యూజియంలో త్వరలో సందర్శకులకు అందుబాటులో రానుంది. ఈ పుస్తకం ఊహించని విధంగా బయటపడటంతో దీని చుట్టూ చరిత్ర, నైతికతకు సంబంధించిన ప్రశ్నలు ముసురుకుంటున్నాయి. 19వ శతాబ్దంలో సంచలనం సృష్టించిన “రెడ్ బార్న్ మర్డర్” కేసుతో ఈ పుస్తకానికి సంబంధం ఉంది. ఆనాటి…

Read More

హిందీ హిందువుల భాష… ఉర్దూ ముస్లింల భాష కాదు

సహనం వందే, ఢిల్లీ: హిందీ హిందువుల భాష, ఉర్దూ ముస్లింల భాష అనే భావనను సుప్రీం కోర్టు తీవ్రంగా ఖండించింది. ఈ నమ్మకం వాస్తవ దూరం అని పేర్కొంటూ, భాష కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఉపయోగపడే సాధనమని, దానికి ఏ మతంతోనూ సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బుధవారం ఒక కేసు విచారణ సందర్భంగా చేశారు. భాషలను మతాలతో ముడిపెట్టడం వల్ల సమాజంలో చీలికలు వస్తాయని, భారతదేశం లాంటి…

Read More