రైతు సంక్షేమమా? కార్పొరేట్ జూదమా? – నాబార్డు ఆర్థిక ప్రయోగంపై నీలినీడలు
సహనం వందే, హైదరాబాద్: రైతు ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన జాతీయ వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ఇప్పుడు అసాధారణమైన ఆర్థిక జూదాన్ని ఎంచుకుని విమర్శలపాలవుతోంది. దశాబ్దాలుగా రైతులకు చౌకగా రుణాలను అందిస్తూ వచ్చిన ఈ సంస్థ… తాజాగా అంతర్జాతీయ బాండ్ల మార్కెట్లో సంక్లిష్టమైన ‘సావరిన్ బాండ్-లింక్డ్ స్వైప్’ లావాదేవీలకు తెరతీయడం వ్యవసాయ రంగంలో తీవ్ర కలకలం రేపుతోంది. క్షేత్రస్థాయిలో రైతులకు అప్పులు దొరక్క అల్లాడుతుంటే నాబార్డు తన వద్ద ఉన్న నిధులను అస్థిరమైన గ్లోబల్ ఫైనాన్షియల్ డెరివేటివ్‌లలో…