ఏఐ మార్చిన యుద్ధ చరిత్ర – ఇరాన్ పై యుద్ధంలో మూడు ఏఐలే కీలకం
సహనం వందే, హైదరాబాద్: యుద్ధ రంగంలో మనిషి వేగాన్ని యంత్రం అధిగమించింది. గగనతలం నుంచి వచ్చే వేలాది నిఘా వీడియోలను విశ్లేషించడానికి గతంలో వందలాది మంది సైనికులు అవసరమయ్యేవారు. కానీ ఇప్పుడు ఏఐ కేవలం సెకన్లలోనే ఆ పనిని పూర్తి చేస్తోంది. ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడుల్లో ఇదే జరిగింది. అగ్రరాజ్యం వాడిన అత్యంత శక్తివంతమైన ఏఐ వ్యవస్థలు యుద్ధాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లాయి. కేవలం కొన్ని గంటల్లో వేలాది లక్ష్యాలను గుర్తించి వాటిని ధ్వంసం చేయడం…