కర్ణాటకలో 70 శాతం మంది బీసీలే

సహనం వందే, బెంగళూరు:కర్ణాటకలో బీసీల జనాభా ఏకంగా 70 శాతం ఉండటం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇంతమంది బీసీలు అక్కడ ఉన్నారా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. కులగణన సర్వేలో ఈ వివరాలు వెలుగు చూశాయి. కర్ణాటకలో దశాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉన్న కుల గణన నివేదిక ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ ఈ నివేదికను ఏప్రిల్ 17న చర్చించనుంది. ఈ సందర్భంగా ఇతర వెనుకబాటు తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్‌ను ప్రస్తుత 32 శాతం నుంచి…

Read More

26/11 రియల్ హీరో సదానంద్ డేట్

సహనం వందే, ఢిల్లీ:26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్ రాణా విచారణను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ముమ్మరం చేసింది. ఈ విచారణకు 26/11 దాడుల్లో పోరాడిన హీరో, ఐపీఎస్ అధికారి సదానంద్ డేట్ నాయకత్వం వహిస్తుండటం విశేషం. అప్పుడు ముంబై దాడుల్లో గాయపడిన ఈ ఐపీఎస్, ఇప్పుడు అదే కేసులో అంతర్జాతీయ ఉగ్రవాదిని విచారణ చేయడం విశేషం. సదానంద్ డేట్ 1990 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి. ముంబై దాడుల్లో అసమాన ధైర్యం…26/11 దాడుల…

Read More

కర్ణాటకలో ఓబీసీలకు 51 శాతం రిజర్వేషన్లు

సహనం వందే, బెంగళూరు:కర్ణాటకలో రిజర్వేషన్ల విధానం ఒక్కసారిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్‌ను భారీగా పెంచాలని కుల గణన నివేదిక సిఫార్సు చేసింది. ప్రస్తుతం 32 శాతంగా ఉన్న ఓబీసీ రిజర్వేషన్లను ఏకంగా 51 శాతానికి పెంచాలని నివేదిక ప్రతిపాదించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నివేదికను సమర్పించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కుల గణన నివేదికలో ఏం…

Read More

వక్ఫ్ భూముల కుంభకోణం!

సహనం వందే, హైదరాబాద్/అమరావతి:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డుకు చెందిన వేల కోట్ల రూపాయల విలువైన లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త వక్ఫ్ చట్టాన్ని తీసుకువచ్చిన నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లోని వక్ఫ్ ఆస్తుల దుస్థితి మరోసారి తెరపైకి వచ్చింది. అసలు ఎన్ని ఎకరాలు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయి? ఎంత మేర కబ్జాకు గురయ్యాయి? అనే అంశాలపై తాజాగా ఒక నివేదిక వెలువడింది. తెలంగాణలో 74% వక్ఫ్ భూములు కబ్జా!తెలంగాణలో వక్ఫ్ బోర్డు…

Read More

యుద్ధానికి సిద్ధంగా ఉండండి!

సహనం వందే, యూరప్:రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తమ కొంప ముంచుతుందని యూరోపియన్ దేశాలు భయపడుతున్నాయి. తూర్పు యూరప్‌లో రష్యా సైనిక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇతర యూరోపియన్ దేశాలపైనా దాడి చేసే అవకాశం ఉందని పలువురు నాయకులు భయపడుతున్నారు. దీంతో యూరప్ లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ పౌరుల భద్రత కోసం పలు యూరప్ దేశాలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. యుద్ధం…

Read More

చైనాతో మెటా రహస్య ఒప్పందాలు

సహనం వందే, వాషింగ్టన్:అమెరికాకు చెందిన ప్రముఖ ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ కు చెందిన మెటా సంస్థ తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటోంది. విజిల్ బ్లోయర్ సారా విన్-విలియమ్స్ ఈ సంచలన ఆరోపణలు చేశారు. మెటా సంస్థ చైనా ప్రభుత్వంతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని, అమెరికా జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించిందని ఆరోపించారు. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. సారా విన్-విలియమ్స్ తెలిపిన వివరాల ప్రకారం..‌‌. మెటా సంస్థ చైనా ప్రభుత్వంతో ఒక ఒప్పందం…

Read More

యాదాద్రిలో వైద్య డిప్యూటేషన్ల దందా

ఏకంగా 106 మంది సిబ్బందికి డిప్యూటేషన్లు సహనం వందే, హైదరాబాద్:వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటేషన్లపై మంత్రి దామోదర రాజనర్సింహ నిషేధం విధించినా, యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం వైద్య మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. మంత్రి ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నారు. తమకు ఎవరూ ఎదురులేదన్న ధోరణితో ఉన్నారు. మంత్రి ఆదేశాలకు విరుద్ధంగా, ఈ కాలంలో ఏకంగా 106 మందిని డిప్యూటేషన్ ద్వారా ఇష్టమైన చోటకు పంపించారు. నర్సింగ్ ఆఫీసర్లు మొదలు సీనియర్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితర సిబ్బందికి డిప్యూటేషన్లు…

Read More

ఈవీఎంలు హ్యాక్ అవుతాయి

పేపర్ బ్యాలెట్లే మేలన్న అమెరికా నిఘా చీఫ్ సహనం వందే, వాషింగ్టన్:ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) హ్యాకర్లకు సులువుగా చిక్కుతాయని అమెరికా దేశీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబ్బార్డ్ హెచ్చరించారు. దీనివల్ల దేశవ్యాప్తంగా కాగితపు బ్యాలెట్లే సురక్షితమైన ఆమె అభిప్రాయపడ్డారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఒక ముఖ్యమైన సమావేశంలో గబ్బార్డ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ మిషన్లలో భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని తమ కార్యాలయం సేకరించిన ఆధారాలను ఆమె సమావేశంలో అందజేశారు.”ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్…

Read More

అమెరికాకు 15 లక్షల ఐఫోన్లు ఎయిర్‌లిఫ్ట్!

సహనం వందే, హైదరాబాద్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త దిగుమతి సుంకాలను తప్పించుకోవడానికి టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఒక తెలివైన ఎత్తుగడ వేసింది. సుమారు 600 టన్నుల యాపిల్ ఐఫోన్లను భారతదేశం నుంచి నేరుగా అమెరికాకు కార్గో విమానాల్లో తరలించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇది దాదాపు 15 లక్షల యాపిల్ ఐఫోన్లని అంచనా. ట్రంప్ సుంకం వల్ల అమెరికాలో యాపిల్ ఐఫోన్ ధరలు పెరిగే పరిస్థితిని నివారించడానికి తోడ్పడుతుంది. అలాగే యాపిల్ ఉత్పత్తిలో భారతదేశం…

Read More

టెర్రరిస్టుగా డాక్టర్

సహనం వందే, న్యూఢిల్లీ:వైద్య వృత్తిని అభ్యసించి ప్రాణాలు కాపాడాల్సిన ఒక డాక్టర్ ఉగ్రవాదిగా మారడం ఎంతటి విషాదమో కదా! 2008 ముంబై ఉగ్రదాడి కేసులో కీలక నిందితుడైన తహవూర్ హుస్సేన్ రాణా అటువంటి నేపథ్యం కలిగినవాడే. పాకిస్తాన్‌లో వైద్య విద్య అభ్యసించిన ఈ కెనడియన్ పౌరుడు, దాదాపు పదేళ్లపాటు సాగిన న్యాయ పోరాటం తర్వాత ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాడు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయంలో భారత అధికారులు రాణాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 64 ఏళ్ల రాణా…

Read More