నెలకు 60 కోట్ల సంపాదన లక్ష్యం!

సహనం వందే, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొత్త మద్యం విధానం, డిస్టిలరీ కంపెనీలతో సజ్జల శ్రీధర్ రెడ్డి ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేసినట్లు రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన కీలక సమావేశంలో నెలకు సుమారు రూ. 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల వరకు అక్రమంగా సంపాదించేందుకు వ్యూహరచన జరిగిందని…

Read More

మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్ 2025’లో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. 100 దేశాలకు చెందిన 450 మంది ప్రముఖులు పాల్గొన్న ఈ సమ్మిట్ చివరి రోజున రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు ఎంతో మారిపోయాయి. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. విపక్షాలను అణగదొక్కడమే అధికార…

Read More

కాశ్మీర్ వెయ్యేళ్ళ పోరాటమా?

సహనం వందే వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. భారత్, పాకిస్థాన్ మధ్య కాశ్మీర్ సమస్యపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఆయన ఖండించారు. భారత్, పాకిస్థాన్‌లు కాశ్మీర్ కోసం “వెయ్యి సంవత్సరాలుగా” పోరాడుతున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చరిత్రాత్మకంగా తప్పుగా ఉన్నాయని, పాకిస్థాన్ 1947లోనే ఏర్పడిందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. భారత్-పాక్…

Read More

తెలంగాణ అభివృద్ధికి సహకారం కావాలి

భారత్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో ప్రపంచ దేశాలు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సంక్షేమం, పెట్టుబడులు, ఉద్యోగావకాశాల కల్పన, పర్యావరణ సమతుల్యతను సాధిస్తూ ప్రజల జీవితాలను మెరుగుపరచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. శనివారం భారత్ సమ్మిట్ వేదికగా ప్రపంచ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానం లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ,…

Read More

‘లెఫ్ట్’కు ట్రంప్ బూస్ట్

సహనం వందే, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక తీసుకున్న అనూహ్య నిర్ణయాలు ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఆయన విధానాలు… వివిధ దేశాలపై సుంకాల విధింపుతో బలహీనపడిన లెఫ్ట్ రాజకీయ పార్టీలకు కొత్త ఊపిరినిస్తున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, యూకే వంటి దేశాల్లో వామపక్ష పార్టీలు మళ్లీ బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. తాజా సర్వేలు కూడా ఈ దేశాల్లో లెఫ్ట్ పార్టీల ప్రజాదరణ పెరుగుతోందని వెల్లడిస్తున్నాయని ప్రముఖ అమెరికా పత్రిక ‘వాల్ స్ట్రీట్…

Read More

ఉగ్రదాడికి అంతర్గత సాయంపై అనుమానాలు

సహనం వందే, కోల్ కతా: కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడికి దేశీయంగా ఎవరైనా సాయం చేశారా అన్న అనుమానాలు ఉన్నాయని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ శంకర్ రాయ్‌చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన కోల్ కతాలో పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఇంత పెద్ద సంఖ్యలో చొరబాటుదారులు ఎలా చొచ్చుకురాగలిగారనే దానిపై సమగ్రమైన విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఎక్కడో పెద్ద లోపం జరిగింది. ఇంత మంది చొరబాటుదారులు ఎలా లోపలికి…

Read More

ఉగ్రదాడిపై ముస్లింల ఆగ్రహజ్వాల

సహనం వందే, హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాద్‌లో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. శుక్రవారం మక్కా మసీదు వద్ద జరిగిన జుమా నమాజ్‌లో పాల్గొన్న ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెలిపారు. నమాజ్ అనంతరం వారు వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్ ముర్దాబాద్, హిందూస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ…

Read More

ఇండియా చుట్టూ శత్రువలయం

సహనం వందే, ఢిల్లీ: మన దేశం చుట్టూ శత్రుదేశాల కోరలు చాస్తున్నాయి. పశ్చిమాన పాకిస్తాన్ తన ఉగ్రవాద చర్యలతో నిత్యం మనల్ని రెచ్చగొడుతోంది. ఉత్తరాన చైనా తన దుష్ట పన్నాగాలతో సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతోంది. తూర్పున బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లు ఆగడం లేదు. దక్షిణాన శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే… ఆఫ్ఘనిస్తాన్‌లోని అల్లకల్లోల పరిస్థితులు మనకు నిత్యం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవన్నీ మనకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ శత్రుదేశాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి మనపై కుట్రలు పన్నుతుండటం…

Read More

అమెరికా కోసమే ఉగ్రవాదులకు సాయం

సహనం వందే ఇస్లామాబాద్: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన షాకింగ్ ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. గత మూడు దశాబ్దాలుగా తమ దేశం అమెరికా ఆదేశాల మేరకే ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చిందని ఆయన బహిరంగంగా అంగీకరించడం సంచలనం కలిగిస్తోంది. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్‌లో ప్రచురితమైన కథనం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్కై న్యూస్‌ ముఖాముఖిలో వెల్లడి… ఖ్వాజా ఆసిఫ్ స్కై న్యూస్ యాంకర్ యాల్డా హకీమ్‌తో…

Read More

హైదరాబాద్‌లో పాకిస్తాన్ పేర్లతో బిజినెస్

సహనం వందే, హైదరాబాద్: కాశ్మీర్‌లో 26 మంది అమాయక భారతీయుల ప్రాణాలను బలిగొన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్య యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సరిహద్దుల్లో నెత్తురు ఏరులై పారుతుంటే… మన హైదరాబాద్ నగరంలో మాత్రం పాకిస్తాన్ నగరాల పేర్లతో వ్యాపారం యథేచ్ఛగా కొనసాగడం అత్యంత సిగ్గుచేటు. కరాచీ బేకరీ, పెషావర్ హోటల్ వంటి ప్రసిద్ధ సంస్థలు తమ పేర్లను ఇప్పటికీ మార్చకపోవడం వారి దేశభక్తి రాహిత్యాన్ని తేటతెల్లం చేస్తోంది. శత్రుదేశపు నగరాల పేర్లను బ్రాండ్‌లుగా వాడుకోవాల్సిన దుస్థితి…

Read More