sahanamvande@gmail.com

Eswara Chari Death

బీసీ బిడ్డ బలిదానం… రగులుతున్న తెలంగాణ

సహనం వందే, హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్యాయత్నం చేసుకున్న బీసీ యువకుడు సాయి ఈశ్వరాచారి చికిత్స పొందుతూ కన్నుమూయడం రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లను ఏకంగా 17 శాతానికి తగ్గించడంతో బీసీ వర్గాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వం తమను మోసం…

Read More
World Population Review

అమెరికా అహంకారం… చైనా చండాలం – అగ్రరాజ్యాలను ఇష్టపడని ప్రపంచ ప్రజలు

సహనం వందే, అమెరికా: ప్రపంచంలో ఏ దేశాన్ని ప్రజలు అత్యంత ఎక్కువగా డిస్‌లైక్ చేస్తున్నారు? ఈ ప్రశ్నకు వరల్డ్ పాపులేషన్ రివ్యూ నిర్వహించిన 2025 ప్రపంచ సర్వే షాకింగ్ సమాధానం ఇచ్చింది. ప్రపంచంలో అత్యంత ద్వేషించే దేశంగా చైనా మొదటి స్థానంలో నిలిచింది. హాంకాంగ్, తైవాన్‌ వంటి ప్రాంతాల స్వేచ్ఛను అణచివేయడం… ఉయ్‌ఘుర్ ముస్లింలపై దాడులు… మానవ హక్కుల ఉల్లంఘనలు… కోవిడ్ సమయంలో సమాచారాన్ని దాచిపెట్టడం వంటి కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మంది చైనాను…

Read More
Location Tracking system

లొకేషన్ ట్రాకింగ్‌ – కొత్త ఫిట్టింగ్… ప్రజల సీక్రెట్స్ విషయంలో వెనక్కుతగ్గని కేంద్రం

సహనం వందే, న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. మొన్నటికి మొన్న నిఘా సైబర్ సేఫ్టీ పేరుతో సంచార్‌ సాథీ యాప్‌ ను స్మార్ట్‌ఫోన్లలో ముందే ప్రీలోడ్ చేయాలని ఆదేశించింది. నిఘా, వ్యక్తిగత సమాచార చౌర్యంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన రావడంతో ఆ ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఆ అనుభవం మర్చిపోక ముందే ఇప్పుడు ఏకంగా స్మార్ట్‌ఫోన్లలో లొకేషన్ ట్రాకింగ్‌ వ్యవస్థను ఆఫ్ చేయకుండా చూసేలా మరో కుట్ర…

Read More
400 Indigo Flights Cancelled

ఇండిగో ఇదేం రోగం? – ఈరోజు 400 విమానాలు రద్దు

సహనం వందే, హైదరాబాద్: దేశంలోని ప్రధాన విమానాశ్రయాలలో వరుసగా నాలుగో రోజు కూడా ప్రయాణికుల ఆందోళనలు ఆగడం లేదు. ఇండిగో విమానాలు ఆలస్యం కావడం… చివరి నిమిషంలో రద్దు కావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే 400కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఇది ఎంతటి దారుణమో అర్థం చేసుకోవచ్చు. దేశంలోని 6 ముఖ్య నగరాలలో గురువారం బయలుదేరిన విమానాలు కేవలం ఎనిమిదిన్నర శాతం మాత్రమే. ఇంత దారుణమైన సేవను విమానయాన సంస్థ…

Read More
Rage Bait Word of the Year shakes Social Media

సోషల్ మీడియాలో ‘రేజ్ బెయిట్’ షేక్ – ఆక్స్‌ఫర్డ్ ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’గా ఈ పదం

సహనం వందే, హైదరాబాద్: ప్రముఖ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రచురణ సంస్థ ఈ ఏడాదికి గాను ఒక సంచలనాత్మక పదాన్ని ప్రకటించింది. ఈ ఏడాది వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా ‘రేజ్ బెయిట్’ (Rage Bait) ను ఎంపిక చేసింది. అంటే మనల్ని కావాలని కోపం తెప్పించడానికి… ఆగ్రహాన్ని రేకెత్తించడానికి వాడే కంటెంట్ అని అర్థం. గత 12 నెలల్లో ఈ పదం వాడుక ఏకంగా మూడు రెట్లు పెరిగిందంటే సోషల్ మీడియాలో ఆగ్రహం ఏ స్థాయిలో…

Read More
Rahul Gandhi Comments on Puthin Visit

విదేశీ స్నేహం… విపక్షం దూరం – కేంద్ర సర్కారుపై రాహుల్ గాంధీ ఫైర్

సహనం వందే, న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ పర్యటన సందర్భంగా ప్రతిపక్షానికి చుక్కెదురైంది. విదేశీ ప్రముఖులు దేశాన్ని సందర్శించినప్పుడు సంప్రదాయబద్ధంగా ప్రతిపక్ష నాయకులతో కూడా సమావేశమవడం ఆనవాయితీ. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని పూర్తిగా తుంగలో తొక్కిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం పార్లమెంట్ బయట విలేకరులతో మాట్లాడిన రాహుల్ గాంధీ… విదేశీ ప్రతినిధులు ప్రతిపక్ష నాయకులను కలువకుండా కేంద్రం వ్యవస్థీకృతంగా అడ్డుకుంటోందని ఆరోపించారు. అభద్రతా భావంతోనే ఆంక్షలు…గతంలో…

Read More
Girl Friend Movie on Netflix

గర్ల్‌ఫ్రెండ్ లో ఓయో రూమ్ – కాలేజీ లేడీస్ హాస్టల్‌ లో ప్రేమికుల రాసలీలలు

సహనం వందే, హైదరాబాద్: ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రం ఈరోజు నుంచి (డిసెంబర్ 5) నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి సినిమాలు కుటుంబ సభ్యులు కలిసి చూడాలా లేదా అన్నది ఇక్కడ చర్చనీయాంశం. ఈ సినిమాకు విపరీతమైన హైప్ ఇచ్చి గొప్ప కళాఖండంగా డప్పు కొట్టుకుంటున్నారు. ఇలాంటి సినిమాలు బోలెడు వచ్చాయి. ఇందులో అభ్యుదయ భావాలతో చూపించిన ప్రత్యేకతలు ఏమీ లేవని గుర్తుంచుకోవాలి. పైగా టీనేజ్ పిల్లల మనసుల్లో విష భావాలు నింపేలా ఈ చిత్రం ఉందన్న విమర్శలు…

Read More
Tata Trust Money to BJP

టాటా ట్రస్ట్… బీజేపీ లూట్ – కాషాయం ఖజానాకు గుట్టలుగా నిధులు

సహనం వందే, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో ఎన్నికల బాండ్ల వ్యవహారంపై తెరపడింది అనుకుంటున్న తరుణంలో రాజకీయ పార్టీలకు నిధుల ప్రవాహం మరో కొత్త రూపంలో కొనసాగుతోంది. కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూపు ఆధీనంలో ఉన్న ప్రొగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ (పీఈటీ) ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారీగా రూ. 915 కోట్ల విరాళాల పంపిణీ జరిగింది. అందులో 83 శాతం వాటా ఏకంగా అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖాతాలోకి చేరింది. టాటా ట్రస్ట్…

Read More
Apple Opposes SancharSathi

యాపిల్‌ డోంట్ కేర్ – సంచార్ సాథీ యాప్ షరతుల తిరస్కరణ

సహనం వందే, హైదరాబాద్: సంచార్ సాథీ ప్రీఇన్‌స్టాలేషన్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రీ ఇన్‌స్టాలేషన్‌ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఈ యాప్ ఆప్షన్ మాత్రమేనని వెల్లడించింది. అయినప్పటికీ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అంటున్నారు. అయితే ఈ యాప్ విషయంలో యాపిల్‌ సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. ఐఫోన్ తయారీదారులు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారనేది చర్చనీయాంశంగా మారింది….

Read More
TS Outsourcing JAC

బతుకు కోసం బతుకు – ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల బానిసత్వం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సేవలు అందిస్తున్న లక్షలాది మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నా వీరికి జీతాలు మాత్రం సకాలంలో అందడం లేదు. నెలలు గడుస్తున్నా వేతనం రాక ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంటి అద్దె, పిల్లల ఫీజులు చెల్లించలేక అప్పుల బాధతో అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేదనేందుకు, పాలనా యంత్రాంగం సరిగా పనిచేయడం లేదనేందుకు ఈ జీతాల జాప్యమే నిదర్శనం. ఈ సమస్యను…

Read More