sahanamvande@gmail.com

Talk of the Sunday - KCR Press Meet

టాక్ ఆఫ్ ది సండే కేసీఆర్ – రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ సీఎం సందడి

సహనం వందే, హైదరాబాద్: తెలుగు రాజకీయాల్లో ఆదివారం అసలైన హీట్ పుట్టింది. పదేళ్ల పాటు తెలంగాణను ఏలిన కేసీఆర్… దాదాపు ఏడాది కాలం తర్వాత మళ్ళీ నోరు విప్పారు. తనదైన మార్కు విమర్శలతో అటు రేవంత్ రెడ్డిని, ఇటు చంద్రబాబును ఓ ఆట ఆడుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే భవిష్యత్ యుద్ధానికి సిద్ధమంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సండే పొలిటికల్ మండే…కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన…

Read More
With Sarrogacy developing Empire

వ్యాపార సామ్రాజ్యానికి 100 మంది కొడుకులు – సరోగసి పద్ధతిలో కంటున్న బిలియనీర్లు

సహనం వందే, హైదరాబాద్: చైనా కుబేరులు ఇప్పుడు కేవలం ఆస్తులు పెంచుకోవడమే కాకుండా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి అడ్డదారుల్లో వంశ విస్తరణకు తెరలేపారు. చైనాలో సరోగసీ (అద్దె గర్భం)పై నిషేధం ఉండటంతో వీరు తెలివిగా అమెరికా చట్టాలను వాడుకుంటున్నారు. వీడియో గేమ్స్ కంపెనీ అధిపతి జూ బో దీనికి తాజా ఉదాహరణ. ఏకంగా 100 మందికి పైగా పిల్లలను కనడం కేవలం కుటుంబ ప్రణాళిక కాదు… ఇదొక భారీ వ్యాపార వ్యూహం. అమెరికాలో పుట్టిన…

Read More
Journalists Arrests - Justice Eswaraiah comments

రాహుల్ గాంధీ… హామీ ఏమైంది? – బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదేంటి?

సహనం వందే, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల గళం ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తోంది. ఓట్ల రాజకీయాల కోసం వాడుకుని అధికారంలోకి వచ్చాక విస్మరిస్తున్న ధోరణిపై బీసీ మేధావులు కన్నెర్ర చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినా ఆశించిన మార్పు రాకపోవడంపై అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య మండిపడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ బీసీలకు మాత్రం…

Read More
ఒకే ప్రేములో జగన్, కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు

కటౌట్ కిక్.. పాలిటిక్స్ షేక్ – ఒకే ఫ్రేములో జగన్, కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ చర్చకు తెరలేపాయి. తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఒక కటౌట్ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. కేవలం శుభాకాంక్షలకే పరిమితం కాకుండా రాబోయే ఎన్నికల పొత్తుల వైపు ఈ ఫ్లెక్సీ సంకేతాలు పంపుతోంది. పుట్టినరోజు వేళ కొత్త రచ్చ…వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు (డిసెంబర్ 21) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ…

Read More
H-1B visa appointments delayed in India

ఇండియాకు వచ్చి ఇరుక్కుపోయారు – అమెరికా వీసా స్టాంపింగ్ రద్దుతో బందీలు

సహనం వందే, హైదరాబాద్: అమెరికా కల ఇప్పుడు భారతీయ టెక్కీల పాలిట కన్నీటి గాధగా మారుతోంది. క్రిస్మస్ సెలవులకు సరదాగా సొంతూరికి వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఇప్పుడు ఇక్కడే బందీలుగా మిగిలిపోయారు. అమెరికా కాన్సులేట్ల ఆకస్మిక నిర్ణయాలతో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అగ్రరాజ్యపు వీసా ఆంక్షలు భారతీయ మేధోసంపత్తిని అవమానించేలా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గందరగోళంలో వీసా స్లాట్లుఅమెరికా వీసా అపాయింట్మెంట్ల రద్దు ఇప్పుడు పెద్ద విపత్తుగా మారింది. డిసెంబర్ 15 నుంచి 26…

Read More
పేదింటి చదువుకు చదువుకు హరీష్ రావు అండ

పేదింటి చదువుకు సొంతిల్లు తాకట్టు – డాక్టరమ్మ చదువుకు హరీష్ రావు అండ

సహనం వందే, సిద్దిపేట: కష్టం వస్తే కాదనని మనసు… కన్నీరు వస్తే కరిగిపోయే తత్వం ఆయనది. సిద్దిపేట బిడ్డల భవిష్యత్తు కోసం తన ఆస్తులను సైతం పణంగా పెట్టే గొప్ప మానవతావాది హరీష్ రావు. తాజాగా ఒక నిరుపేద వైద్య విద్యార్థిని మెడికల్ పీజీ చదువు ఆగిపోకుండా ఉండేందుకు ఆయన ఏకంగా తన స్వగృహాన్నే బ్యాంకులో తనఖా పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఫీజు గండం నుంచి బయటపడేలా…సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం టైలరింగ్ వృత్తి చేస్తూ కుటుంబాన్ని…

Read More
ఉత్తరాంధ్ర భూదందా

ఉత్తరాంధ్ర భూదందా… పవన్ పంజా! – అక్రమార్కుల గుండెల్లో డిప్యూటీ సీఎం దడ

సహనం వందే, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర భూములు ఇప్పుడు రాజకీయ నేతల ఆటబొమ్మలయ్యాయి. ధరలు పెరగడంతో వివాదాలు ముదిరి హత్యల దాకా వెళ్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. సొంత పార్టీ సహా కూటమి నేతలే ఈ దందాల్లో ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇక చాలు అంటూ ఆయన హెచ్చరికలు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా పెను చర్చకు దారి తీసింది. పవన్ కళ్యాణ్ పవర్ వార్నింగ్రెండు రోజుల క్రితం జరిగిన కలెక్టర్ల సమావేశంలో…

Read More
Examples for చిన్నప్పుడు తోపు... పెద్దయ్యాక ప్లాపు: Viswanathan Anand Einstein

చిన్నప్పుడు తోపు… పెద్దయ్యాక ప్లాపు

సహనం వందే, హైదరాబాద్: పిల్లవాడు పట్టుమని పదేళ్లు రాకముందే బ్యాటు పట్టుకుని సెంచరీలు కొడుతున్నాడా? వెంటనే అతనో సచిన్ టెండూల్కర్ అయిపోతాడని మురిసిపోకండి. బాల్యంలోని మెరుపులు భవిష్యత్తులో తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. చిన్నప్పుడు సామాన్యంగా కనిపించేవారే కాలక్రమేణా ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ప్రతిభకు తొందరపాటు కంటే సహనమే అసలైన పెట్టుబడి అని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. పరిశోధన చెప్పిన చేదు నిజంజర్మనీకి చెందిన ప్రముఖ పరిశోధకుడు అర్నే గులిచ్ నేతృత్వంలో ఈ…

Read More
Hush Dating

హుష్ డేటింగ్… కొత్త ట్రెండింగ్ – అడ్డూ అదుపూలేని హైదరాబాద్ చెత్త కల్చర్

సహనం వందే, హైదరాబాద్: గతంలో ప్రేమంటే ఒక గర్వం. పది మందికి చెప్పుకునే ఒక అందమైన అనుభూతి. కానీ ఇప్పుడు కలియుగం పరాకాష్టకు చేరింది. బంధాలకు రంగులు మారాయి. నిన్న మొన్నటి వరకు పెళ్లి పెటాకులు లేకుండా సహజీవనం అంటూ తిరిగారు. ఇప్పుడు అంతకుమించి చెత్త కల్చర్ హైదరాబాదును సర్వనాశనం చేస్తుంది. నగర యువత ఇప్పుడు కొత్త రూట్ పట్టింది. అదే హుష్ డేటింగ్. గుట్టుచప్పుడు కాకుండా.. ఎవరికీ తెలియకుండా.. కేవలం ఇద్దరి మధ్యే సాగే ఈ…

Read More
రాజమండ్రి పేపర్ మిల్లులో గోల్‌మాల్

రాజమండ్రి పేపర్ మిల్లులో గోల్‌మాల్ – రిటైర్డ్ కార్మికుల సొమ్ము 4 కోట్లకు రెక్కలు

సహనం వందే, రాజమండ్రి: రిటైర్ అయ్యాక ఆసరాగా ఉంటుందని దాచుకున్న పైసలు మాయమయ్యాయి. దశాబ్దాల పాటు ఫ్యాక్టరీలో రక్తం ధారపోసి సంపాదించిన సొమ్మును సొసైటీ ముంచేసింది. ఆంధ్ర పేపర్ మిల్లు (రాజమండ్రి) రిటైర్డ్ ఉద్యోగుల బతుకులు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా కనికరించే నాథుడే కరువయ్యారు. నమ్మించి ముంచారుఆంధ్ర పేపర్ మిల్లులో 30 నుంచి 40 ఏళ్ల పాటు సేవలందించి రిటైర్ అయిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు వచ్చిన…

Read More