స్కూల్ బ్యాగ్… సీఈఓ ట్యాగ్ – రన్‌వైజ్ ఏఐ కంపెనీతో టీనేజీ విప్లవం
సహనం వందే, కెనడా: సాంకేతిక ప్రపంచంలో సరిహద్దులు చెరిగిపోతున్నాయి. అనుభవానికి అర్థం మారుతోంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతిభే పెట్టుబడిగా కొత్త సామ్రాజ్యాలు వెలుస్తున్నాయి. 15 ఏళ్ల కుర్రాడు ఏకంగా ఒక ఏఐ కంపెనీని స్థాపించి తనకంటే రెట్టింపు వయసున్న వ్యక్తిని ఉద్యోగిగా నియమించుకోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది కేవలం ఒక నియామకం మాత్రమే కాదు భవిష్యత్తు ఉపాధి రంగంలో రాబోతున్న పెను మార్పులకు నిదర్శనం. యువ సీఈఓ థామస్ గుత్రీఈ కథనానికి కథానాయకుడు థామస్ గుత్రీ…