sahanamvande@gmail.com

ఆకలితో అమ్మ… చనిపోయెనమ్మా – మరణించన 70 ఏళ్ల వృద్ధురాలు

సహనం వందే, హైదరాబాద్:దేశమంతా దీపావళి వెలుగులు, ఆనందాల నడుమ మునిగి తేలుతున్న వేళ, హైదరాబాద్‌లో ఒక వృద్ధురాలు ఆకలితో మరణించడం అత్యంత హృదయ విదారకరం. విశ్వనగరంగా పేరుగాంచిన నగరంలో గోపన్ పల్లి అక్షిత హాస్పిటల్ వద్ద 70 ఏళ్ళున్న ఒక నిస్సాయ మహిళ మృతదేహం దొరకడం గుండెలవిసేలా చేసింది. భిక్షాటన చేస్తూ జీవిస్తున్న ఆమె గత కొన్ని రోజులుగా కనీసం పట్టెడన్నం లేక ఆకలి బాధలతో అలమటించి చివరికి ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మరణం…

Read More

కలిశెట్టి రాక… చిన్నారుల కేక – విజయనగరం ఎంపీ వినూత్న దీపావళి వేడుక

సహనం వందే, రణస్థలం:విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ప్రతి ఏటా ప్రభుత్వ బాలికల వసతి గృహం విద్యార్థినులతో దీపావళి సంబరాలు జరుపుకోవడం ఒక సంప్రదాయంగా మారింది. ఆయన స్వతహాగా పిల్లలతో గడపడానికి, వారి నిష్కల్మషమైన ఆనందాన్ని చూసి మురిసిపోవడానికి ఎంతో ఇష్టపడతారు. వారికి కావాల్సినవన్నీ చేసిపెట్టడం, అడగకముందే అవసరాలను తీర్చడం ఆయన సహజ శైలి. ఈ మానవీయ కోణం ఆయన రాజకీయ జీవితంలో ఒక ప్రత్యేకతను చాటుతోంది. సొంత బిడ్డతో వచ్చి తీపి పంచిన ఎంపీసోమవారం…

Read More

ఓల్డ్ లేడీ… గోల్డ్ రూల్ – 117 ఏళ్ల బతికిన మరియా జీవిత రహస్యం

సహనం వందే, స్పెయిన్:ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలుగా గుర్తింపు పొందిన మరియా బ్రాన్యాస్ మొరెరా 117 ఏళ్ల 168 రోజుల బతికి గత ఏడాది కన్నుమూశారు. ఆమె 1918 ఫ్లూ మహమ్మారిని తట్టుకున్నారు. అలాగే కరోనా నుంచి బయటపడ్డారు. రెండు ప్రపంచ యుద్ధాలు చూశారు. ఆమె చిరకాలం బతకడానికి గల రహస్యాలను శాస్త్రవేత్తలు ఛేదించారు. స్పెయిన్‌లోని బార్సిలోనా విశ్వవిద్యాలయంలో జన్యుశాస్త్ర విభాగం అధిపతి డాక్టర్ మానెల్ ఎస్టెల్లర్ నేతృత్వంలో జరిగిన ఈ అపూర్వ అధ్యయనం మరియా జీవన మంత్రంలోని…

Read More

భరించలేం… బతకలేం – కొండపై నుంచి దూకిన 9వ తరగతి బాలికలు

సహనం వందే, కేరళ:కేరళలో మారుతిమల కొండపై జరిగిన దారుణం అందరి హృదయాలను పిండేస్తుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న మీను, శివర్ణ అనే ఇద్దరు బాలికలు మనసు కకావికలమై వెయ్యి అడుగుల ఎత్తున్న కొండపై నుంచి దూకగా ఒక అమ్మాయి చనిపోయింది. ఒక బాలిక ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. స్నేహం, చదువు, కలలతో కళకళలాడాల్సిన ఆ చిన్న హృదయాలను ఆత్మహత్యకు పురిగొల్పేంతటి క్రూరమైన ఒత్తిడి, ఆవేదనను ఎవరు కలిగించారు? వారి మౌనం వెనుక దాగిన బాధే ఈ విషాదానికి…

Read More

అమెరికా అల్లకల్లోలం- 70 లక్షల గొంతులు ఒక్కటై పిక్కటిల్లేలా‌…

సహనం వందే, అమెరికా:అమెరికా అల్లకల్లోలంగా మారింది. 2700 పట్టణాలు, నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి ట్రంప్ విధానాలపై గళమెత్తుతున్నారు. శనివారం దేశవ్యాప్తంగా 70 లక్షల మంది రోడ్లపైకి వచ్చి ట్రంప్ ను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసనలతో యావత్ ప్రపంచం నివ్వెర పోయింది. ట్రంప్ రాచరిక పద్ధతులకు వ్యతిరేకంగా ‘నో కింగ్స్’ పేరుతో ఈ ఉద్యమం జరుగుతుంది. గత జూన్‌లో 20 లక్షల మంది వీధుల్లోకి వచ్చి పోరాటం చేయగా… ఇప్పుడు దాదాపు నాలుగింతల మంది…

Read More

సహకార బ్యాంకుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ – 225 స్టాఫ్ అసిస్టెంట్ల భర్తీ

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఆధ్వర్యంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో (డీసీసీబీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తారు. ఆరు జిల్లాల్లో ఉన్న ఈ బ్యాంకుల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాల వారీగా ఖాళీలుఖమ్మం జిల్లా సహకార బ్యాంకులో అత్యధికంగా 99 ఖాళీలు ఉన్నాయి. కరీంనగర్‌లో 43, హైదరాబాద్‌లో 32 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇక మెదక్,…

Read More

రాముడి కోటలో లక్షల కాంతులు – 26 లక్షల దీపాలతో అయోధ్య అలంకరణ

సహనం వందే, అయోధ్య:ఈ దీపావళికి రామజన్మభూమి అయోధ్య చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. ఆదివారం (ఈ రోజు) సరయూ నదీ తీరంపై ఏకంగా 26 లక్షలకు పైగా దీపాలు వెలిగించి ఒకేసారి మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 20వ తేదీ వరకు జరగనున్న ఈ మహోత్సవంలో భక్తులతో మహా ఆరతి సహా మరో ఆశ్చర్యకరమైన రికార్డు నమోదు కానుంది. భక్తుల ఊహకు అందని అద్భుతం…26 లక్షలకు పైగా దీపాలు వెలిగించే ఈ దృశ్యం భక్తుల…

Read More

‘కోట్ల’ విలువలు… కలిశెట్టి కలలు – విజయభాస్కర్ రెడ్డి ఆదర్శాలకు ఫిదా

సహనం వందే, కర్నూలు:మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నిబద్ధతతో కూడిన రాజకీయ ప్రస్థానం యువ నాయకులకు ఇప్పటికీ ఒక పాఠ్యపుస్తకమే. విజయనగరం పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు అదే స్ఫూర్తితో అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన కోట్ల స్వగ్రామం లద్దగిరిలో పర్యటించి ఆ మహానాయకుడికి ఘన నివాళులు అర్పించారు. డోన్ శాసనసభ్యుడు కోట్ల జై సూర్యప్రకాష్ రెడ్డి నివాసానికి వెళ్లి కోట్ల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కోట్ల రాజకీయ జీవితం తనకు అత్యంత స్ఫూర్తిదాయకం…

Read More

కిలో స్వీట్ బంగారం రేటు – శ్రేష్టమైన ‘స్వర్ణ ప్రసాదం’ ధర రూ.‌ 1.11 లక్షలు

సహనం వందే, న్యూఢిల్లీ:దీపావళి పండుగకు సాంప్రదాయ భారతీయ మిఠాయిలు తమ పాత రూపాన్ని వదిలి సరికొత్త శైలిలో మెరుస్తున్నాయి. ఈసారి మార్కెట్లోకి వచ్చిన శ్రేష్ఠమైన మిఠాయిలు కేవలం రుచిని మాత్రమే కాక అపారమైన విలాసాన్ని కూడా అందిస్తున్నాయి. ముంబై, ఢిల్లీలలోని అగ్రశ్రేణి బ్రాండ్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టి ‘స్వర్ణ ప్రసాదం’, గులాబీ కాజు కత్లీ, హాజెల్‌నట్ బేసన్ లడ్డూ వంటి సృజనాత్మక రుచులతో దీపావళి సంబరాలకు ప్రత్యేక టచ్‌ ఇస్తున్నాయి. ‘లక్ష’ణమైన స్వర్ణ ప్రసాదం…సాధారణ స్వీట్ల…

Read More

‘రాజీవ్’ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) – 1984 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు

సహనం వందే, న్యూఢిల్లీ:1984 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రికార్డు స్థాయిలో 414 సీట్ల విజయాన్ని అందించింది కేవలం ఇందిరా గాంధీ సానుభూతి మాత్రమే కాదు… ఆ విజయం వెనుక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మద్దతు ఉందన్న తాజా సమాచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. బీజేపీని పక్కనబెట్టి ఇందిర హత్య తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీకి ఆర్ఎస్ఎస్ నాయకత్వం రహస్యంగా చేయూతనిచ్చిన వైనం ఆసక్తికరమైన రాజకీయ మలుపు. బీజేపీ పుట్టి…

Read More