sahanamvande@gmail.com

ఐఫోన్ రూ. 2.50 లక్షలు?

సహనం వందే, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మేక్ ఇన్ యూఎస్ విధానంలో భాగంగా యాపిల్ ఐఫోన్‌లను అమెరికాలోనే తయారు చేయాలని గట్టిగా కోరుకుంటున్నారు. అయితే ఈ కల నిజమైతే ఐఫోన్ కొనుగోలుదారులకు భారీ షాక్ తగలవచ్చు. నిపుణుల హెచ్చరికల ప్రకారం, ఒక ఐఫోన్ ధర ఏకంగా $3,000 (సుమారు రూ. 2.5 లక్షలు) వరకు పెరిగే అవకాశం ఉంది. చైనా నుంచి అమెరికాకు ఉత్పత్తి మారితే…ట్రంప్ ప్రభుత్వం చైనా నుంచి దిగుమతి చేసుకునే…

Read More

ట్రంప్‌పై కంగనా ఫైర్

సోషల్ మీడియాలో పోస్ట్… తొలగింపు సహనం వందే, న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై చేసిన సోషల్ మీడియా పోస్ట్ గురువారం రాత్రి హఠాత్తుగా మాయమైంది. బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా ఫోన్ కాల్ తర్వాతే ఆమె ఈ పోస్ట్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. ట్రంప్‌పై కంగనా చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించడంతో, నడ్డా స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కంగనా పోస్ట్‌లో ఏముంది?కంగనా రనౌత్ తన…

Read More

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం

సహనం వందే, హైదరాబాద్: వానాకాలం పంటల సాగుకు సన్నద్ధంగా ఉండాలని, నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో సాగు విస్తీర్ణానికి సరిపడే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని స్పష్టం చేశారు. సచివాలయంలో శుక్రవారం వ్యవసాయశాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వానాకాలం పంటల సాగుపై సమీక్ష సమావేశం…

Read More

‘అగ్ల్రీ’ చైర్మన్లు… డమ్మీ ఎండీలు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ శాఖలోని కార్పొరేషన్లు ఇప్పుడు చైర్మన్ల సొంత జాగీర్లుగా మారిపోయాయి. కొందరు చైర్మన్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఐఏఎస్ అధికారులుగా ఉన్న ఎండీలు సైతం వారి గుప్పిట్లో డమ్మీలుగా మిగిలిపోయారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న చైర్మన్ల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎండీలు గులాంలు.. చైర్మన్లదే పెత్తనం! వ్యవసాయశాఖలో ఆగ్రోస్, ఆయిల్ ఫెడ్, విత్తనాభివృద్ధి సంస్థ, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్, హాకా, టెస్కాబ్, మార్క్‌ఫెడ్ వంటి…

Read More

మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ సునీతారావు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావు మధ్య పదవుల పంపకంపై మొదలైన వివాదం వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. గాంధీభవన్‌ వేదికగా ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పార్టీ కోసం కష్టపడిన మహిళా కార్యకర్తలకు పీసీసీ కార్యవర్గంలో తగిన ప్రాధాన్యం కల్పించాలని సునీతారావు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఆమె పట్టుదలతో ఉండటంతో ఇరు వర్గాల…

Read More

‘కంచ’ విధ్వంసంపై సుప్రీం గరం గరం

సహనం వందే, ఢిల్లీ: కంచ గచ్చిబౌలిలోని విలువైన అటవీ భూమిని ఐటీ ప్రాజెక్టు కోసం ధ్వంసం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. అటవీ భూమిని తిరిగి పూర్వ స్థితికి తీసుకురావాలని, లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు ఆరుగురు ఉన్నతాధికారులను జైలుకు పంపాల్సి వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. సుమోటోగా స్వీకరించిన కోర్టు…ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. హైదరాబాద్ విశ్వవిద్యాలయం సమీపంలోని…

Read More

ఆకాశంలో రాజభవనం

సహనం వందే, వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ ఇకపై ఖతార్ రాజకుటుంబం ఇచ్చిన ఖరీదైన బహుమతితో ఆకాశంలో విహరించనుంది. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే అత్యంత శక్తివంతమైన వ్యక్తి ప్రయాణించే ఈ ‘ఆకాశంలో రాజభవనం’ భద్రత విషయంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. 400 మిలియన్ డాలర్ల విలాసం!ఖతార్ రాజకుటుంబం దాదాపు 400 మిలియన్ డాలర్ల విలువైన అత్యాధునిక బోయింగ్ 747-8 విమానాన్ని…

Read More

జొన్న ‘అవినీతి’ కేంద్రాలు

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో అనేక జొన్న కొనుగోలు కేంద్రాలు అక్రమాలకు అడ్డాగా మారాయి. పక్క రాష్ట్రాల నుంచి అడ్డదారిలో జొన్నలు తెచ్చి, మద్దతు ధర పేరుతో దళారులు లక్షల రూపాయలు కొల్లగొడుతుంటే అడ్డుకోవాల్సిన అధికారులు కళ్లు మూసుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా తాంసిలో ముక్కిపోయిన అక్రమ జొన్నలు పట్టుబడటం సంచలనం రేపింది. ఈ ఘటన వెనుక అధికారుల హస్తం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అసలు ఈ జొన్నలు ఎవరివో, ఎక్కడి నుంచి తెచ్చారో తేల్చకుండా అధికారులు దాస్తున్నారు….

Read More

సీపీఆర్’హూ’?

సహనం వందే, హైదరాబాద్: అయోధ్యరెడ్డి ఆర్టీఐ కమిషనర్ గా నియమితులవడంతో, ఆయన ఖాళీ చేసిన ముఖ్యమంత్రి ప్రజా సంబంధాల అధికారి పోస్టులోకి కొత్తగా ఎవరు వస్తారన్న విషయం మీడియా వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి కార్యాలయంలో అత్యంత కీలకమైన ఈ సీపీఆర్ఓ పదవి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక పదవిని దక్కించుకోవడానికి సీనియర్ జర్నలిస్టులు పోటీ పడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే కొందరు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయగా,…

Read More

అమెరికాను ఊపేసిన హత్యలు

సహనం వందే, లాస్ ఏంజిల్స్: 1989లో బెవర్లీ హిల్స్‌లో సంచలనం సృష్టించిన తమ తల్లిదండ్రుల హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మెనెండెజ్ సోదరులు – ఎరిక్, లైల్‌లకు ఊరట లభించింది. లాస్ ఏంజిల్స్ కోర్టు వారి శిక్షను 50 సంవత్సరాల జీవిత ఖైదుకు తగ్గించడంతో వారు పెరోల్ (ముందస్తు విడుదల)కు అర్హత సాధించారు. వచ్చే నెలలో కాలిఫోర్నియా పెరోల్ బోర్డ్ ఈ విషయంపై విచారణ జరపనుంది. ఈ కేసు గతంలో అనేక పుస్తకాలు, డాక్యుమెంటరీలకు ఆధారం…

Read More