సిద్ధు కామెడీ ఉన్నా.. కథలో ‘క్రాక్’ మిస్!
‘జాక్’ రివ్యూ: సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్:సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన “జాక్ – కొంచెం క్రాక్” చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. “టిల్లు స్క్వేర్” వంటి హిట్ తర్వాత సిద్ధు నుండి వచ్చిన ఈ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, సినిమా కథాబలం లేకపోవడం వల్ల నిరాశపరిచిందని టాక్ వినిపిస్తోంది. సినిమా కథ విషయానికొస్తే…జాక్ అనే తెలివైన హ్యాకర్ రా ఏజెంట్ కావాలని…