పిఠాపురంలో ఫైట్
సహనం వందే, పిఠాపురం:జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబు ఇటీవల పిఠాపురం పర్యటనలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ అనుచరుల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. కుమారపురంలో జరిగిన ఈ సంఘటనలో వర్మ వర్గీయులు నాగబాబును చుట్టుముట్టి “జై వర్మ” అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన, టీడీపీ వర్మల మధ్య ఉన్న రాజకీయ ఘర్షణలను మరోసారి ఉద్ధృతం చేసింది. జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్…