బీ’హోర్’లో తేజస్వీ(ప్) – ఆర్జేడీ, కాంగ్రెస్ మహాకూటమికే మెజారిటీ

సహనం వందే, న్యూఢిల్లీ:బీహార్ రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు తాజాగా వెలువడిన లోక్ పోల్ సర్వే ఫలితాలు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఈ సర్వే తీవ్ర హెచ్చరికగా మారింది. బీహార్‌లో రాజకీయం వేగంగా మారుతున్నట్లు ఈ సర్వే స్పష్టం చేస్తోంది. ఆర్జేడీ సారథ్యంలోని మహా కూటమి 118 నుండి 126 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తుందని అంచనా. మరోవైపు…

Read More

రక్తంతో తడుస్తున్న అభిమానం – విజయ్ ర్యాలీ ఘటనలో 38 మంది మృతి

సహనం వందే, తమిళనాడు:అభిమానుల పట్ల సినిమా తారల తీరు అత్యంత దారుణంగా ఉంటుంది. ఫ్యాన్స్ అమాయకత్వాన్ని తమ సినిమా రాజకీయ, అవసరాల కోసం ఉపయోగించుకుంటూ వందల కోట్లు గడిస్తున్నారు. సినిమాల ద్వారా వచ్చిన అభిమానాన్ని రాజకీయాల వైపు మళ్ళించుకుని పదవులు పొందుతున్నారు. తమ స్వార్థం కోసం అభిమానుల రక్తం కళ్ళచూస్తున్నారు. పదవీకాంక్ష కోసం ఇష్టారాజ్యంగా ర్యాలీలు నిర్వహిస్తూ జనాన్ని తొక్కి చంపేస్తున్న ఈ ధోరణిని అభిమాన ఉగ్రవాదం అనకుండా ఎలా ఉండగలం? కరూరు జిల్లాలో నటుడు విజయ్…

Read More

రైతు బలి… రఘునందన్ బదిలీ – రుణమాఫీ… యూరియా కొరత ఎఫెక్ట్

సహనం వందే, హైదరాబాద్:సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్ రావును తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కార్యదర్శి బాధ్యతల నుంచి తొలగించి బదిలీ చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఎక్కువకాలం వ్యవసాయశాఖలో ఉన్నందున బదిలీ చేశారని కొందరు అంటుంటే… కీలకమైన పంటల సీజన్లో అకస్మాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని మరికొందరు అంటున్నారు. అయితే ఆయన హయాంలో జరిగిన రెండు ప్రధాన వైఫల్యాలే ఈ పరిస్థితికి కారణమని సచివాలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రుణమాఫీ అమలులో గందరగోళం…కాంగ్రెస్ పార్టీ అధిష్టానం… ముఖ్యమంత్రి…

Read More

డాక్టర్లపై డాలర్ సెగ – భారతీయ వైద్యులకు హెచ్1బీ గుదిబండ

సహనం వందే, అమెరికా:అమెరికా ఆరోగ్య వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న విదేశీ వైద్యులకు హెచ్1బీ వీసా ఫీజు రూపంలో అకస్మాత్తుగా పెనుభారం పడింది. అగ్రరాజ్యం తాజాగా వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచడంపై అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (ఏఎంఏ) అగ్గిమీద గుగ్గిలమైంది. ఈ భారీ ఫీజు వైద్య సేవలకు అడ్డంకిగా మారుతుందని, దీని ప్రభావం వల్ల దేశ ఆరోగ్య రంగం కుప్పకూలిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికన్ల ఆరోగ్య భద్రతకు అత్యవసరం అయిన వైద్యులను ఈ నిబంధన…

Read More

బీసీలకు అ’భయం’ – ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు (బీసీలకు) సామాజిక న్యాయాన్ని అందించే దిశగా చారిత్రక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఏకంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఈ రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. న్యాయపరమైన చిక్కులపై ఆందోళన…ఈ చారిత్రక నిర్ణయం…

Read More

‘స్తోమత లేకుంటే సినిమాకు రాకండి’ – హైకోర్టులో ‘ఓజీ’ తరపు లాయర్ వింత వాదన

సహనం వందే, హైదరాబాద్:‘ఓజీ’ సినిమా టికెట్ రేట్లపై శుక్రవారం హైకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. ఆ సినిమా నిర్మాత తరపున వాదించిన సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. ‘సినిమా టికెట్ ధరలపై మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తే రూ.100, రూ.150 పెంచుకోమని ఉత్తర్వులు ఇచ్చారు. రూ.150 కూడా పిటిషనర్‌కు కష్టం అనుకుంటే సాధారణ రేటు ఉన్నప్పుడే సినిమా చూడాలి. పిటిషనర్ మొదటి రోజు సినిమా చూడాలంటారు. కానీ ఆయనకు…

Read More

హిందువుల ఎమోషన్… ఐఫోన్ ప్రమోషన్! – కాషాయ రంగులో ప్రత్యేకంగా ఐఫోన్ 17

సహనం వందే, న్యూఢిల్లీ:కాషాయ రంగుతో యాపిల్ కంపెనీ విడుదల చేసిన ఐఫోన్ 17 ప్రో ఇప్పుడు దేశంలో రాజకీయ రంగు పులుముకుంది. ఇది హిందువుల కోసమే తయారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. దీనిని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ ఘనతగా ప్రచారం చేస్తున్నారు. మోడీ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకునే యాపిల్ ఈ ఫోనును తీసుకొచ్చిందని ప్రకటించడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఒక మొబైల్ ఫోన్ రంగును రాజకీయ ప్రచారంగా మార్చేశారని విమర్శకులు…

Read More

అసెంబ్లీలో అఖండ ‘చంద్ర’ప్రచండ – చంద్రబాబునూ వదలని బాలయ్య బాబు

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం ఎమ్మెల్యే బాలయ్య బాబు విశ్వరూపం చూపించారు. అఖండ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. సొంత ప్రభుత్వం పైనా… మాజీ సీఎం జగన్ పైనా చెలరేగిపోయారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవినీ ఇరికించేశారు. రాజకీయంగా సొంత పార్టీనీ… పెద్దలను చెడుగుడు ఆడుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని సైకోగాడు అంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలు సభను స్తంభింపజేశాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖులు జగన్‌ను కలిసిన వివాదాస్పద అంశంపై మాటల…

Read More

పచ్చబొట్టుకు పండగ – దక్షిణ కొరియాలో టాటూకు చట్టబద్ధత!

సహనం వందే, సియోల్:కొత్త చట్టంతో దక్షిణ కొరియాలో ఇక టాటూ కళకు స్వేచ్ఛ వచ్చింది. ఇప్పటివరకు చీకటి గదుల్లో రహస్యంగా పనిచేసిన టాటూ కళాకారులకు మంచి రోజులు వచ్చాయి. జాతీయ అసెంబ్లీ టాటూ కళను చట్టబద్ధం చేస్తూ చారిత్రక బిల్లును గురువారం ఆమోదించింది. ఈ చట్టం దక్షిణ కొరియా సమాజంలో టాటూలపై ఉన్న అపోహలను తొలగించి కళగా గుర్తించే దిశగా వేసిన అతిపెద్ద అడుగు. కళాకారుల జీవితాల్లో వెలుగు…దక్షిణ కొరియాలో టాటూలు వేయడం ఎప్పటి నుంచో నిషేధం….

Read More

సీపీఐలో పల్లాకు పెద్దపీట – జాతీయ కార్యదర్శిగా అత్యున్నత అవకాశం

సహనం వందే, హైదరాబాద్:చండీగఢ్‌లో జరిగిన సీపీఐ జాతీయ 25వ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రానికి సముచిత స్థానం లభించింది. సీపీఐ జాతీయ కార్యదర్శివర్గంలో తెలంగాణ నుంచి పల్లా వెంకట్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా తప్పుకోవడంతో… నల్లగొండ నేత పల్లాకు జాతీయస్థాయిలో అత్యున్నత పదవి దక్కింది. దీంతో తెలంగాణకు చెందిన పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏఐఎస్ఎఫ్ నుంచి జాతీయ కార్యదర్శి వరకు…నల్లగొండ జిల్లాకు చెందిన పల్లా…

Read More