మతం ముసుగులో మారణహోమం

సహనం వందే, జమ్ము కాశ్మీర్: కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన హృదయ విదారక ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు… వారి మతం తెలుసుకొని మరీ హిందువులను లక్ష్యంగా చేసుకున్నారన్న వార్తలు మరింత కలచి వేస్తున్నాయి. ఈ దుర్ఘటన కేవలం ఒక ఉగ్రవాద చర్య మాత్రమే కాదు… మతోన్మాదం విషం ఎంతగా పాతుకుపోయిందో చెప్పే భయానక సత్యం. ఈ దుర్ఘటన యావత్ భారతదేశ లౌకికవాద స్ఫూర్తిని ప్రశ్నిస్తోంది. మతాల మధ్య గొడవలు చెలరేగేలా……

Read More

మహారాష్ట్రలో హిందీకి బ్రేక్

సహనం వందే, ముంబై: మహారాష్ట్రలోని పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. రాష్ట్రంలో భాషా రాజకీయాలు మరోసారి వేడెక్కడంతో, ప్రాంతీయ వాణి గట్టిగా వినిపించడంతో ఈ ఉత్తర్వును నిలిపివేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ప్రాథమిక స్థాయి విద్యార్థులకు హిందీని తప్పనిసరి చేస్తూ ఒక ఉత్తర్వును జారీ చేసింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత…

Read More

గ్రూప్‌–1లో…దగాపడ్డ తెలుగు అభ్యర్థి

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తెలుగు మీడియంలో చదివిన అభ్యర్థులు దగాపడ్డారు. దాదాపు పది సంవత్సరాలుగా పక్కాగా సన్నద్దమైన తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీలో భాగంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. గత నెల 30న మెయిన్స్‌ ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ… గ్రూప్‌–1 ఉద్యోగాలకు…

Read More

హిందువులే లక్ష్యంగా రక్తపుటేరు

సహనం వందే, జమ్ము కాశ్మీర్‌: మతాన్ని అడ్డుపెట్టుకొని మారణ హోమం జరిగింది. హిందూమతమే లక్ష్యంగా ఆ మత ప్రజలను ఉగ్రవాద సంస్థ ఊచకోత కోసింది. మంగళవారం పహల్గామ్ రక్తంతో తడిసిపోయింది. అనంత్‌నాగ్ జిల్లాలోని ఈ ప్రశాంతమైన లోయలో ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడిలో హైదరాబాద్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి మనీష్‌ రంజన్‌తో సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా గాయపడటంతో విషాదఛాయలు అలుముకున్నాయి. 2019లో పుల్వామాలో జరిగిన…

Read More

భాస్కర మెడికల్ కాలేజీలో ఇంటర్న్‌ల వేదన

సహనం వందే, హైదరాబాద్: మొయినాబాద్‌లోని భాస్కర మెడికల్ కాలేజీ (బీఎంసీ) ఎంబీబీఎస్ ఇంటర్న్‌లకు నెలకు కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే స్టైపెండ్‌గా చెల్లిస్తోందని ఆరోపిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ)కి ఫిర్యాదు అందింది. కళాశాల యాజమాన్యం ఇందుకు సంబంధించి 2003 నాటి పాత ప్రభుత్వ ఉత్తర్వును చూపుతూ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ఎన్‌ఎంసీ గత కొద్ది నెలలుగా తెలంగాణ వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) దృష్టికి తీసుకెళ్లినా, ఎలాంటి చర్యలు…

Read More

సివిల్స్‌లో మహిళా ‘శక్తి’

సహనం వందే, హైదరాబాద్‌ సివిల్‌ సర్వీసు అర్హత పరీక్షల్లో మహిళలు సత్తా చాటారు. ఆలిండియా టాపర్‌తో పాటు ఆలిండియా రెండో ర్యాంకును నారీమణులు కైవసం చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శక్తి దూబే ఆలిండియా టాపర్‌గా నిలిచారు. రెండో స్థానంలో హర్షిత గోయల్, మూడో స్థానంలో డోంగ్రె అర్చిత్‌ పరాగ్‌ ఉన్నారు. తొలి మూడు ర్యాంకుల్లో ఇద్దరు మహిళలే కావడం గమనార్హం. సివిల్‌ సర్వీసు ఉద్యోగాలకు సంబంధించి తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 1009…

Read More

సూపర్ స్టార్ మహేశ్‌బాబుపై ఈడీ కొరడా

సహనం వందే, హైదరాబాద్: తెలుగు సినీ వినీలాకాశంలో సూపర్‌స్టార్‌గా వెలుగొందే మహేశ్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేయడం సంచలనం రేపింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థల ఆర్థిక మోసాల కేసులో ఈ నోటీసులు ఇవ్వడం ఆయన అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఈ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ బాబు తన స్టార్‌డమ్‌ను ఉపయోగించి, అమాయక ప్రజలను మోసం చేసేందుకు ఉపకరించారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ సంఘటన…

Read More

‘రక్త’ సంబంధాలు

సహనం వందే, క్రైమ్ బ్యూరో, హైదరాబాద్: వివాహేతర సంబంధం నేరం కాదని ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు.. నేటి సమాజంలో పెరిగిపోతున్న దారుణాలకు మరింత ఊతమిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. కోర్టు తీర్పును కొందరు తప్పుగా అర్థం చేసుకుంటూ.. తమ వికృత చేష్టలకు చట్టపరమైన అనుమతి లభించినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా వివాహ బంధాలు తెగిపోతున్నాయి. రక్తపుటేరులు పారుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో…భారతీయ సంస్కృతిలో పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలవడమే కాదు.. రెండు కుటుంబాల కలయిక. జన్మజన్మల…

Read More

నేడు ఇంటర్ ఫలితాలు విడుదల!

మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటన సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య అధికారికంగా తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొంటారని…

Read More

‘న్యాయమూర్తికి అంత హక్కుందా?’

సహనం వందే, ఢిల్లీదేశంలో న్యాయవ్యవస్థకు, చట్టసభలకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కొత్త మలుపు తిరిగింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అనూహ్యంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సంబంధించిన ఒక పాత వీడియోను తెరపైకి తెచ్చింది. ఈ వీడియోలో ఇందిరా గాంధీ న్యాయవ్యవస్థ అధికార పరిధిని ప్రశ్నిస్తూ, 1975 ఎమర్జెన్సీ సమయంలో జరిగిన అత్యాచారాల విచారణ కోసం ఏర్పాటు చేసిన షా కమిషన్‌ను తప్పుబడుతున్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్న…

Read More