పాక్‌కు వేల కోట్ల ఐఎంఎఫ్ రుణం

సహనం వందే, హైదరాబాద్: భారత్ ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అవిశ్రాంతంగా పోరాడుతుంటే, సరిహద్దుల్లో పాకిస్థాన్ కయ్యానికి కాలుదువ్వుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా చితికిపోయిన పాకిస్థాన్‌కు భారీ మొత్తంలో రుణం ఇచ్చేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సిద్ధమవడం విమర్శలకు దారితీస్తోంది. పాకిస్థాన్ ఈ నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించే ప్రమాదం ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఐఎంఎఫ్ మాత్రం రుణాన్ని మంజూరు చేసింది. ఆర్థిక స్థిరత్వమే ప్రధాన కర్తవ్యం…ఐఎంఎఫ్ అనేది 191 దేశాలు సభ్యులుగా ఉన్న ఒక…

Read More

పాకిస్తాన్ కాదు మోసగిస్తాన్

సహనం వందే, న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ దానిని ఉల్లంఘించిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తీవ్రంగా ఖండించారు. శనివారం రాత్రి ఏర్పాటు చేసిన అత్యవసర మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పాకిస్తాన్ చర్యను తీవ్రంగా పరిగణిస్తున్నామని, భారత సైన్యం తగిన రీతిలో స్పందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. మధ్యాహ్నం అంగీకారం… సాయంత్రం ఉల్లంఘనవిక్రమ్ మిస్రీ తెలిపిన వివరాల ప్రకారం… శనివారం…

Read More

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ 2025 ప్రారంభం

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో మిస్ వరల్డ్ 2025 పోటీలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ సంప్రదాయ సాంస్కృతిక కళలు, పోటీదారుల పాశ్చాత్య కళా ప్రదర్శనల మధ్య ఈ పోటీలు ప్రారంభమైనట్లు ముఖ్యమంత్రి, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. 110 దేశాల ప్రతినిధుల ప్రదర్శనతెలంగాణ సంప్రదాయ కళలు, పోటీదారుల పాశ్చాత్య కళల మేళవింపుతో మిస్ వరల్డ్…

Read More

ఆపరేషన్ ‘సినీ’దూర్

సహనం వందే, హైదరాబాద్: ఆయన ఒకానొక పెద్ద సినిమా స్టార్… అనేక సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. చిటికేస్తే అభిమానులు తరలివస్తారు. తన కోసం ప్రాణం ఇస్తారు. అలాంటి స్టార్ మన దేశ సైన్యానికి మద్దతు కోసం ర్యాలీ నిర్వహించాలని ఒక ప్రముఖ వ్యక్తి కోరగా, డబ్బులు ఇస్తే చేస్తానని అన్నాడట. ఇంతకంటే నీచత్వం ఇంకేమైనా ఉంటుందా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా సినిమా విడుదలవుతుందంటే చాలు, వేల మంది అభిమానులను తరలించి ప్రచార హోరు సృష్టిస్తారు….

Read More

దళారులకు మార్క్‌ఫెడ్‌ అండదండ

సహనం వందే, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మార్క్‌ఫెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డి… వీళ్లంతా జొన్న రైతుల కోసం కృషి చేస్తుంటే కిందిస్థాయిలో కొందరు అధికారులు మాత్రం దళారులకు అమ్ముడుపోతున్నారు. జొన్న రైతులకు మద్దతు ధర ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. జొన్న కొనుగోలులో ఎలాంటి అక్రమాలు జరగకూడదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదేపదే చెప్తున్నప్పటికీ అధికారులు మాత్రం తమ దందా కొనసాగిస్తున్నారు. హైదరాబాదు…

Read More

నారీ… రణభేరీ

సహనం వందే, న్యూఢిల్లీ: భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావడంతో, భారత సైన్యంలోని మహిళా అధికారులు ముందంజలో నిలిచి దేశానికి గర్వకారణమయ్యారు. కల్నల్ సోఫియా ఖురేషీ, భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మే 7న న్యూఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి, ఈ ఆపరేషన్ విశేషాలను వెల్లడించారు. ఒక ప్రధాన సైనిక చర్య గురించి ఇద్దరు మహిళా అధికారులు స్వయంగా మీడియాకు వివరించడం దేశ…

Read More

తెలంగాణలో జపానీస్ భాష

సహనం వందే, హైదరాబాద్: ఇటీవల జపాన్ దేశ పర్యటన సందర్భంగా తెలుసుకున్న విషయాల మేరకు ఆ దేశానికి అవసరమైన మానవ వనరులను సమకూర్చడానికి వీలుగా తెలంగాణలో జపనీస్ భాషను నేర్పించాలని సంకల్పించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు, అనుసరిస్తున్న విధానాలు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నాయని స్పష్టం చేశారు. సామాజిక న్యాయంతో పాటు ఇతర అంశాల్లో తెలంగాణ మాడల్‌ను కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించాల్సిన పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు. బెంగుళూరు…

Read More

‘అందం’పై యుద్ధమేఘం

సహనం వందే, హైదరాబాద్: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజలు ఆవేదనతో, ఆగ్రహంతో ఉన్నారు. భారత సైన్యం సరిహద్దుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా శత్రువును ఎదుర్కొంటున్న సమయంలో, అందాల పోటీల్లో ఆనందించే పరిస్థితి దేశంలో లేదని సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ‘మన జవాన్లు దేశం కోసం పోరాడుతుంటే, హైదరాబాద్‌లో అందాల పోటీలు నిర్వహించడం జాతీయ మనోభావాలను గాయపరుస్తుంద’ని ఒకరు సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోటీలు కొనసాగితే దేశ ఐక్యతకు భంగం కలిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు…

Read More

హత్యకు గురైన వ్యక్తి కోర్టులో ప్రత్యక్షం

సహనం వందే, అమెరికా: సాధారణంగా కోర్టులో నేరం చేసినవాళ్లు, సాక్షులు, లాయర్లు వాదోపవాదాలు వినిపిస్తుంటారు. కానీ అమెరికాలోని ఓ కోర్టులో మాత్రం మూడేళ్ల క్రితం హత్యకు గురైన వ్యక్తి స్వయంగా మాట్లాడి అందరినీ షాక్‌కు గురిచేశాడు! అవును మీరు విన్నది నిజమే. కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీతో సృష్టించిన అతని డిజిటల్ రూపం కోర్టులో ప్రత్యక్షమై, తన హంతకుడి శిక్షా విచారణలో బాధితుడి వాంగ్మూలాన్ని వినిపించింది. ఈ అద్భుతమైన ఘటన న్యాయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెర…

Read More

మెలానియా ట్రంప్ మాయం!

సహనం వందే, వాషింగ్టన్: అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్… ఈ పేరు వినగానే ఒక మిస్టరీలా అనిపిస్తోంది. ఆమె ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? వైట్‌హౌస్‌లో ఆమె ఎందుకు కనిపించడం లేదు? ఈ ప్రశ్నలు ఇప్పుడు అమెరికా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జనవరిలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, గత 108 రోజుల్లో మెలానియా వైట్‌హౌస్‌లో కేవలం 14 రోజులు మాత్రమే ఉన్నారని సమాచారం. ఆమె ఎప్పుడు, ఎంతసేపు…

Read More