బిడ్డ మాయమైతే ఆసుపత్రి లైసెన్స్ రద్దు

సహనం వందే, న్యూఢిల్లీ: ఇకపై ఏ ఆసుపత్రిలో పసిపాప కనిపించకుండా పోయినా, వారి లైసెన్స్ రద్దు చేయడం ఖాయం! పిల్లల అక్రమ రవాణాదారుల పట్ల తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో, ఆసుపత్రులు కూడా అంతే బాధ్యతగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు మంగళవారం తన తీర్పులో స్పష్టం చేసింది. ముఠాల నుంచి చిన్నారులను కాపాడటంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అత్యున్నత న్యాయస్థానం పిలుపునిచ్చింది. కంటికి రెప్పలా కాపాడాలి… ప్రతి ఆసుపత్రిలో ప్రసవించిన శిశువు సంపూర్ణ బాధ్యత ఆసుపత్రి సిబ్బందిదేనని జస్టిస్…

Read More

నగర జీవితానికి స్వస్తి పలికి…

సహనం వందే, హర్యానా: నగరంలోని ఉరుకులు పరుగుల జీవితానికి విసిగిపోయిన ఓ జంట.. పచ్చని పొలాల బాట పట్టారు. రసాయనాలు లేని సేంద్రీయ వ్యవసాయంతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. హర్యానాలోని సోనిపట్ జిల్లా, మెహమూద్‌పూర్ గ్రామానికి చెందిన జితేంద్ర మాన్, ఆయన భార్య సర్లా మాన్.. పట్టణ జీవితంలోని ఒత్తిళ్లకు దూరంగా, స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. టీసీఎస్ ఉద్యోగం వదిలేసి… గతంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్)లో 11 ఏళ్ల పాటు…

Read More

ఉగ్రవాది డిమాండ్లకు తలొగ్గిన ఎన్ఐఏ

సహనం వందే, న్యూఢిల్లీ: 2008 ముంబై మారణహోమ సూత్రధారి, వైద్య వృత్తిని అభ్యసించి ఉగ్రవాదిగా మారిన తహవూర్ హుస్సేన్ రాణా ప్రస్తుతం ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నాడు. ఢిల్లీలోని ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సెల్‌లో ఉన్న రాణా డిమాండ్లకు ఎన్ఐఏ తలొగ్గిందా అన్న విమర్శలు వస్తున్నాయి. అతను ఖురాన్ పుస్తకం, రాయడానికి కలం, కాగితం ఇవ్వాలని కోరడంతోపాటు రోజూ ఐదు సార్లు నమాజ్ చేసుకుంటానని కోరాడు. దీన్ని ఎన్ఐఏ అధికారులు అనుమతించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొనసాగుతున్న…

Read More

కోవిడ్ తర్వాత పుంజుకున్న విమానయానం

సహనం వందే, న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి కారణంగా నాలుగేళ్లపాటు భారీగా పడిపోయిన విమాన ప్రయాణాలు… గత ఏడాది నుంచి మళ్లీ పుంజుకున్నాయి. 2024లో ప్రపంచ వైమానిక ప్రయాణికుల సంఖ్య 2019 స్థాయిలను అధిగమించినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ డేటా ప్రకారం… 2024లో మొత్తం ప్రయాణికుల సంఖ్య 4.7 బిలియన్లకు చేరుకుంది, ఇది 2019లో నమోదైన 4.5 బిలియన్ల కంటే ఎక్కువ. నాలుగేళ్లు దెబ్బ తిన్న విమానరంగం… 2020లో కోవిడ్ కారణంగా విమాన…

Read More

అందాల వేదికపై ఎర్రజెండా

సహనం వందే, హైదరాబాద్: చైనా, వియత్నాం వంటి కమ్యూనిస్టు దేశాలు అందాల పోటీలను ప్రోత్సహిస్తుంటే… క్యూబా, ఉత్తర కొరియా కమ్యూనిస్టు దేశాలు మాత్రం వాటిని పాశ్చాత్య సంస్కృతిగా దూరంగా ఉంచుతున్నాయి. ఇండియా కమ్యూనిస్టులు సైతం ఇదే బాటలో నడుస్తున్నారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలపై వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతర్జాతీయ ఉనికికోసం చైనా తహతహ… చైనా, వియత్నాం వంటి కమ్యూనిస్టు దేశాలు అందాల పోటీలను ఆర్థికాభివృద్ధికి, అంతర్జాతీయంగా తమ…

Read More

యాదాద్రి జిల్లాలో వైద్యం అస్తవ్యస్తం

సహనం వందే, హైదరాబాద్: ప్రభుత్వం నుంచి నిధులు రావడమే కష్టం. అలాంటిది వచ్చిన నిధులను కూడా వాడుకోకపోవడం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వైద్యాధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఆ జిల్లాకు వచ్చిన నిధుల్లో దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయకపోవడంతో అవి తిరిగి వెనక్కి పోయాయి. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్ సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్ సీ), జిల్లా ఆసుపత్రుల్లో సమస్యలు తిష్ట వేశాయి. దీంతో రోగులకు సరైన వైద్యం చేయడానికి…

Read More

కరెన్సీ వెనుక క్యాస్టిజం

(విజయ్ పుట్టపాగ, టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ లాంటి మహనీయుడి చిత్రం మన కరెన్సీ నోట్లపై లేకపోవడం కేవలం పొరపాటు కాదు, ఆధిపత్య వర్గాల కుట్ర. భారత రాజ్యాంగ శిల్పి, రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటులో కీలక సూత్రధారి, కుల నిర్మూలన యోధుడైన అంబేద్కర్‌ను గౌరవించకపోవడం సమాజంలో ఇప్పటికీ కొనసాగుతున్న వివక్షను సూచిస్తుంది. మహాత్మా గాంధీ జాతిపిత కాగా… అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన యోధుడు. దేశంలో అధిక సంఖ్యాకులైన బడుగు బలహీన వర్గాలకు ఆయన ఆరాధ్య…

Read More

ఢిల్లీలో రూ.10 లక్షలకు శిశువుల అమ్మకం!

సహనం వందే, ఢిల్లీ: ఢిల్లీలో మానవ సంబంధాలను మంటగలిపే ఒక భయంకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఒక పెద్ద శిశువుల అక్రమ రవాణా ముఠాను సోమవారం పట్టుకున్నారు. ఈ ముఠా ఏకంగా 35 మందికి పైగా పసి పిల్లలను ఒక్కొక్కరిని రూ.10 లక్షల వరకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హృదయ విదారకర సంఘటన ఆధునిక సమాజానికి మాయని మచ్చ. రాజస్థాన్, గుజరాత్ కేంద్రంగా దందా… ఈ స్మగ్లింగ్ ముఠా తమ కార్యకలాపాల కోసం రాజస్థాన్,…

Read More

బిలియనీర్ల ఆర్థిక ఉగ్రవాదం

సహనం వందే, ఢిల్లీ: భారతదేశంలోని అత్యంత సంపన్నులు తమ ఆదాయాన్ని రహస్యంగా ఉంచుతున్నారు. మధ్యతరగతి కంటే తక్కువ పన్నులు చెల్లిస్తూ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అసమానతలకు కారణమవుతున్నారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్ రామ్ సింగ్ నిర్వహించిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయం వెల్లడైంది. అగ్రశ్రేణి బిలియనీర్లు చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకుంటూ తమ వాస్తవ ఆదాయాన్ని దాచిపెట్టి, సంపదను విదేశాలకు తరలిస్తున్నారు. ఈ కారణంగా నిజాయితీగా పన్నులు చెల్లించే మధ్యతరగతి ప్రజలు మాత్రం అధిక పన్నుల…

Read More

దారికడ్డంగా నిలబడే పెనుభూతమే కులవ్యవస్థ

సహనం వందే, హైదరాబాద్:దేశవ్యాప్తంగా అణగారిన కులాలు తమకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అయితే ఆ పోరాటాలన్నీ ప్రాంతీయ ఉద్యమాలుగాను, స్థానిక పోరాటాలుగానూ మిగిలిపోతున్నాయి. ఈ పోరాటాలన్నీ విడివిడి ఘటనలుగానూ, గుంపు తగాదాలుగానూ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఎన్నో ఉద్యమాలు గుర్తింపునకు నోచుకోలేదు. అలాగే అంబేద్కర్ జీవితాంతం అణగారిన వర్గాలకోసం చేసిన పోరాటం సంబంధిత ప్రజల దృష్టికి పోనేలేదు. కనీసం 50 శాతం మందికి కూడా తెలియదంటే అతిశయోక్తిలేదు. “ఓటు హక్కు ద్వారా పోరాడి రాజులు…

Read More