పాత వివాదాలు… కొత్త అనుమానాలు! చంద్రబాబు సింగపూర్ పర్యటనపై సందేహాలు

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించాలనే నినాదంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్‌ పర్యటనకు బయలుదేరుతుండగా, గతంలో ఈ దేశంతో జరిగిన వివాదాస్పద ఒప్పందాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నెల 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆరు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ముఖ్యమంత్రితోపాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్, ఐదుగురు ఐఏఎస్‌ అధికారులు సహా ఎనిమిది మంది బృందం పాల్గొననుంది. మళ్లీ అదే బాటలో పయనమా?సింగపూర్‌లో ముఖ్యమంత్రి…

Read More

మోడీ గుండెల్లో ధన్‌ఖడ్‌ దడ -నరేంద్రుడికి ఉపరాష్ట్రపతి ఝలక్

సహనం వందే, న్యూఢిల్లీ:ఎవరి మాటా వినని… తన మాటే శాసనం అన్న తీరుగా దేశ రాజకీయాలను శాసిస్తున్న నరేంద్ర మోడీ శకానికి తెరపడుతోందా? ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ అనూహ్యంగా రాజీనామా చేయడం వెనుక ప్రధాని మోడీతో పెరిగిన విభేదాలే కారణమని స్పష్టమవుతోంది. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ వివాదం పతాక స్థాయికి చేరడం, మోడీ అవిశ్వాస హెచ్చరికలకు ధన్‌ఖడ్‌ రాజీనామాతోనే బదులివ్వడం జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మోడీ నాయకత్వానికి ధన్‌ఖడ్‌ ఉదంతం బ్లడ్‌ ఆన్‌…

Read More

మహావీర్ గుప్పిట్లో ఎన్ఎంసీ -లంచం తీసుకున్నందుకు కృతజ్ఞతాభావం

సహనం వందే, హైదరాబాద్:జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) దారి తప్పిపోయింది. లంచాల రుచికి మరిగిన ఎన్ఎంసీ బృందాలు ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ తమ తీరు మార్చుకోవడం లేదు. దేశంలో అనేక చోట్ల సీబీఐ కేసులు పెడుతూ కొందరిని అరెస్టు చేస్తున్నా… ఎన్ఎంసీ అధికారులు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ముడుపులు తీసుకుని ముందే కమిట్మెంట్లు ఇవ్వడంతో మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో చెట్టాపట్టాల్ వేసుకొని దర్జాగా తిరుగుతూనే ఉన్నాయి. అందుకు నిలువెత్తు ఉదాహరణ వికారాబాద్ లో ఉన్న మహావీర్…

Read More

బీసీల నెత్తిన టోపీ – 42 శాతం రిజర్వేషన్లపై నీలినీడలు

సహనం వందే, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల కులాలను రాజకీయ పార్టీలు మోసం చేస్తూనే ఉన్నాయి. అధిక సంఖ్యలో ఉన్న బీసీల ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు నాటకాలు ఆడుతూనే ఉన్నాయి. అగ్రవర్ణ పార్టీల నాయకులు బీసీల సంక్షేమం కోసం తాము కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటూ వారిని మోసం చేస్తూనే ఉన్నాయి. అటువంటి వారిని కొందరు బీసీ నాయకులు నమ్ముతుండడం పరాకాష్ట. ఎక్కడైనా మేకలకు పులి రక్షణ ఇస్తుందా? అని బీసీ నేతలు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. బీసీలకు…

Read More

అన్నయ్య వర్సెస్ తమ్ముడు-నాగబాబుకు మంత్రి పదవిపై సందిగ్ధత

సహనం వందే, అమరావతి:నాగబాబుకు మంత్రి పదవిపై సాగుతున్న ఊహాగానాలు, చర్చలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాజాగా ఇచ్చిన వివరణ కొత్త మలుపునిచ్చింది. సోదరుడు నాగబాబు మంత్రి అవుతారా? రాజ్యసభ సభ్యుడవుతారా? కేంద్ర మంత్రిగా ప్రమోషన్ దక్కుతుందా? అనే ప్రశ్నలకు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సమాధానాలు ఇవ్వకపోయినా, ఈ వ్యవహారం వెనుక పవన్ వ్యూహాలపై రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. పవన్ చేతిలోనే నాగబాబు మంత్రి పదవి!నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

Read More

ప్రముఖులు జైళ్లలో అతిథులు – డబ్బుంటే జైళ్లు గెస్ట్ హౌస్ లే

సహనం వందే, రాజమండ్రి:‘జైలుకు పంపిస్తే విశ్రాంతి తీసుకుంటా’… ఈ వ్యాఖ్య చేసింది ఎవరో కాదు… తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్. ధనికులకు చట్టం చుట్టం అవుతుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. తప్పుచేసి జైలుకు వెళ్లినప్పటికీ వారికి రాచ మర్యాదలు కల్పిస్తారు. ఒకప్పుడు జగన్… తర్వాత రేవంత్ రెడ్డి..‌. చంద్రబాబు నాయుడు… కవిత.‌.‌. ఇప్పుడు మిధున్ రెడ్డి. వీళ్ళందరికీ ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. జైళ్లు ఒకరకంగా ధనికులకు విశ్రాంతి కేంద్రాలుగా మారిపోవడం దురదృష్టకరం. ఎంత డబ్బు చెల్లిస్తే అన్ని…

Read More

డాక్టర్ల ఫేక్(స్) రికగ్నేషన్ – మెడికల్ కాలేజీలకు కొత్త సమస్య

సహనం వందే, హైదరాబాద్:మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల హాజరు విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) చెబుతోంది. అయితే ఈ చర్యలను ఛేదించే విధంగా కొన్ని కంపెనీలు కొత్త యాప్‌లతో ముందుకొచ్చాయి. ఇంటి నుంచే ముఖ గుర్తింపు ద్వారా హాజరు వేసుకునే సౌలభ్యాన్ని కేవలం రూ.7000కే అందిస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు వైద్య విద్యా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బొటనవేలు నుంచి ముఖ గుర్తింపు వరకువైద్య కళాశాలల్లో అధ్యాపకుల హాజరు కోసం గతంలో…

Read More

ఆయిల్ పామ్ తోటల్లో అవినీతి ఊట – ఐఐఓపీఆర్ బృందం పర్యటనలో వాస్తవాలు

సహనం వందే, అశ్వారావుపేట:ఆయిల్ పామ్ తోటలు తవ్విన కొద్దీ అవినీతి బండారం బయటపడుతుంది. ఇదొక వెబ్ సిరీస్ లాగా రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తుంది. జన్యు లోపాలున్న మొక్కలతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతుంటే, ఆయిల్ ఫెడ్ అధికారుల నిర్లక్ష్యం, కుమ్మక్కు రాజకీయాలు వారిని మరింత దిగజారుస్తున్నాయి. ఇటీవల ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ ప్రతినిధులు, ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలు ఆసన్నగూడెం గ్రామంలో పర్యటించినప్పుడు వెలుగుచూసిన వాస్తవాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక పెద్ద…

Read More

వైద్య విద్యకు ‘ఎన్ఎంసీ’ చెద – అవినీతి అడ్డా జాతీయ మెడికల్ ‘కమీ’షన్

సహనం వందే, హైదరాబాద్:భారత వైద్య విద్య రంగాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి, అక్రమాలపై ప్రపంచ ప్రఖ్యాత వైద్య పత్రిక ‘లాన్సెట్’ బాంబు పేల్చింది! జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) వ్యవస్థీకృత అవినీతికి, అసమర్థతకు నిలయంగా మారిందని ఘాటుగా విమర్శించింది. జులై 19న ప్రచురితమైన ఈ సంచలనాత్మక నివేదిక… భారత వైద్య విద్య భవిష్యత్తును, ప్రజల ఆరోగ్య సంరక్షణ నాణ్యతను అంధకారంలోకి నెట్టేస్తోందని హెచ్చరించింది. ఎన్‌ఎంసీ అక్రమాల పుట్ట అని దునుమాడింది. లంచాల బాగోతం… వ్యవస్థకే చీడజూన్ 30న…

Read More

నర్మెట్ట వెనుక త్రిబుల్ ‘ఎస్’ల కుట్ర – సురేందర్, సుధాకర్, శ్రీకాంత్ రెడ్డీల స్కెచ్

సహనం వందే, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా నర్మెట్ట లో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ మెగా ఫ్యాక్టరీ వెనుక ఘరానా దోపిడి జరుగుతుందని ఆయిల్ పామ్ గ్రోయర్స్ అసోసియేషన్ మండిపడుతుంది. ఏమీ లేకుండా ఆయిల్ ఫెడ్ అక్కడ అంత పెద్ద ఫ్యాక్టరీ ఎందుకు కడుతుందని అసోసియేషన్ నాయకులు నిలదీస్తున్నారు. దాని వల్ల ఆ ప్రాంత ఆయిల్ పామ్ రైతులకు ఏమైనా ఉపయోగం ఉందా? లేక ఆయిల్ ఫెడ్ కేవలం రాజకీయ నాయకులకు, కాంట్రాక్టర్లకు దోచి పెట్టటానికి ఇదంతా చేస్తుందా?…

Read More