అక్రమ సంబంధాల ‘కాంచీపురం’ – దేశంలోనే మొదటి స్థానం నిలిచిన పుణ్యక్షేత్రం

సహనం వందే, హైదరాబాద్:మారుతున్న జీవనశైలితోపాటు సంబంధాలు, అనుబంధాలు కూడా మారతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు దేశంలో విపరీతంగా పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సంబంధాల మోజులో పడి కట్టుకున్నవాళ్ళనే కడతేర్చిన ఘటనలు ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. మేఘాలయలో భర్తను చంపిన భార్య ఉదంతం… అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కొత్త పెళ్లికొడుకును కడతేర్చిన నవ వధువు ఉదంతాలు ఇందుకు నిదర్శనం. ఇలాంటి పరిస్థితుల్లో వివాహేతర సంబంధాలకు కాంచీపురం అడ్డాగా మారిందని ప్రముఖ డేటింగ్ యాప్ వెల్లడించిన…

Read More

లైవ్ సర్జరీల వ్యాపారానికి చెక్ – ప్రైవేట్ ఆసుపత్రులకు కేంద్రం ముకుతాడు

సహనం వందే, న్యూఢిల్లీ:ప్రైవేట్ ఆసుపత్రుల్లో లైవ్ సర్జరీలు నిర్వహించే విధానంలో రోగుల భద్రత, నైతిక ప్రమాణాలను కాపాడేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. లైవ్ సర్జరీ లకు తప్పనిసరిగా ఎన్ఎంసీ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతి తీసుకోవాలి. రోగుల భద్రతను ఫణంగా పెట్టి, వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ సర్జరీలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ ఎన్ఎంసీ కఠిన నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు ఆసుపత్రులు, సర్జన్లు, వైద్య సంస్థలు అమలు…

Read More

రాష్ట్ర జడ్జీల సంఘం ప్రధాన కార్యదర్శిగా మురళీమోహన్

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర జడ్జీల సంఘం అధ్యక్షుడిగా జి.రాజగోపాల్, ప్రధాన కార్యదర్శిగా మురళీమోహన్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. సంఘం ఎన్నికలు ఈ నెల 19న జరిగాయి. ఈ ఎన్నికలను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్. శశిధర్ రెడ్డి రిటర్నింగ్ అధికారిగా పర్యవేక్షించారు. ఆదివారం ఓట్ల లెక్కింపు పూర్తికావడంతో, విజేతలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికలు న్యాయవ్యవస్థలో నూతన నాయకత్వానికి మార్గం సుగమం చేశాయి. వారి నాయకత్వంలో తెలంగాణ…

Read More

యూరియా కోసం…. గడప దాటండి… ఢిల్లీ వెళ్లండి…

సహనం వందే, హైదరాబాద్:ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. దీంతో పంటల సాగు ఊపందుతుంది. ఇంతటి కీలక సమయంలో యూరియా అత్యవసరం. అందుకోసం అన్నదాత ఎదురుచూస్తున్నారు. కానీ యూరియా అందుబాటులో లేకుండా పోయింది. దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉండటంతో సాగు ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కేంద్రం నుంచి రావాల్సిన యూరియా పూర్తి స్థాయిలో సరఫరా కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆరోపిస్తుంది. మంత్రి తుమ్మల…

Read More

బీహార్ లో జర్నలిస్టులకు 15 వేల పెన్షన్

సహనం వందే, హైదరాబాద్:జర్నలిస్టుల బతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. ఉద్యోగ భద్రత కరువైంది. పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఆధారం లేకుండా నిస్సహాయ స్థితిలో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. పత్రికా యాజమాన్యాలు వీరిని పట్టించుకోకపోగా, చాలీచాలని జీతాలతో బతుకులీడుస్తున్నారు. దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రిటైర్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తుంటే, తెలుగు రాష్ట్రాలు మాత్రం ఈ విషయంలో జర్నలిస్టులను విస్మరించాయి. ఇళ్ల స్థలాలు, పెన్షన్ వంటి కీలకమైన విషయాల్లో జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోంది. బీహార్‌లో పెరిగిన పెన్షన్…తాజాగా…

Read More

శ్రావణం ఆధ్యాత్మిక సంగమం

శ్రావణమాసం అనేది హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రత కలిగిన మాసం. ‘శ్రవణ’ అనే నక్షత్రంతో ఈ మాసం ప్రారంభమవుతుంది కనుక దీనికి శ్రావణం అనే పేరు వచ్చింది. ఈ మాసం అంతటా భక్తిపరవశం, పూజాపారాయణలు, ఆచారాలు కనిపిస్తాయి. ముఖ్యంగా శివునికి ఇది ప్రీతికరమైన కాలంగా చెప్పబడుతుంది. ఈ మాసంలో వచ్చే సోమవారాలు ‘శ్రావణ సోమవారాలు’గా ప్రసిద్ధి చెందాయి. భక్తులు ఉపవాసంతో శివుడికి అభిషేకాలు చేసి, బిల్వపత్రాలతో పూజలు చేస్తారు. వనమూలికలతో చేసిన పూజా ద్రవ్యాలు ప్రకృతి సౌందర్యాన్ని…

Read More

ముఖ్యమంత్రికి విన్నవించినా…ఆగని ఆయిల్ ఫెడ్ అక్రమార్కుల ఆగడాలు

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్ అక్రమాలపై అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోయర్స్ సొసైటీ అధ్యక్షులు ఉమామహేశ్వర్ రెడ్డి, కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య ఆధ్వర్యంలో గత ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెండు సార్లు విన్నవించారు. అయినా ఆయిల్ ఫెడ్ లో అక్రమాలు తగ్గకపోగా మరింత పెరుగుతున్నాయి. కొందరు సీనియర్ అధికారులు, కొన్ని ప్రైవేట్ కంపెనీలు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై కోట్లు దోపిడీ చేస్తున్నారు. ఆ సంస్థకు చెందిన కీలక అధికారులు సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,…

Read More

ఉత్తుత్తి పెళ్లిళ్ల కొత్త ట్రెండ్ – వధూవరులే ఉండని ఫేక్ మ్యారేజెస్

సహనం వందే, హైదరాబాద్:పెళ్లంటే పంతులు లేని… పీటలు లేని… పన్నీరు చిలకరించని పసందైన విందు అని ఈ తరం యువత కొత్త భాష్యం చెబుతోంది. బంధువుల చుట్టూ తిరగడం… వారి యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పడం… వధూవరుల మొహాలు చూడటం వంటివేవీ లేకుండా కేవలం రుచికరమైన భోజనం, మ్యూజిక్, డాన్స్ మాత్రమే కావాలనుకునే వారి కోసం ఉత్తుత్తి పెళ్లిళ్ల కొత్త ట్రెండ్ మొదలైంది. ఈ వింత పార్టీలలో వధూవరులే ఉండరు! అవును మీరు విన్నది నిజమే. అసలు…

Read More

రాహుల్ కుల జ్ఞానోదయం – కాంగ్రెస్ నేత ఆత్మ విమర్శ వెనుక రాజకీయం

సహనం వందే, న్యూఢిల్లీ:మూడోసారి కూడా అధికారం దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి, దాని అధినేత రాహుల్ గాంధీకి ఇప్పుడు జ్ఞానోదయం అయినట్లు కనిపిస్తోంది. దేశంలో కులగణన జరగకపోవడం తన తప్పేనని, అది పార్టీ తప్పు కాదని రాహుల్ శుక్రవారం చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ తప్పును ఇప్పుడు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. కుల గణన ఆవశ్యకతపై వ్యాఖ్యలు…కుల గణన ఆవశ్యకతపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ… సమాజంలోని వివిధ వర్గాల…

Read More

ఎన్ఎంసీ స్కాన్… మెడికల్ స్కామ్ – తనిఖీల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల బండారం

సహనం వందే, హైదరాబాద్:ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య అత్యంత నాసిరకంగా మారుతోంది. డబ్బుల కోసం కాలేజీలు పెట్టిన కొందరు బడా బాబులు నాసిరకం వైద్య విద్య అందిస్తున్నారు. వ్యాపార ధోరణి తప్ప మరో ఆలోచన లేకపోవడంతో ఆయా కాలేజీలు కునారిల్లిపోతున్నాయి. కనీస సౌకర్యాలు కల్పించక… బోధన సిబ్బంది పూర్తిస్థాయిలో లేక వైద్య విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కొన్ని కాలేజీల్లో ఉండాల్సిన సంఖ్యలో…

Read More