ఉగ్రమరణం స్వర్గలోకం – మసూద్ ఆధ్వర్యంలో మహిళా జిహాదీ బ్రిగేడ్
సహనం వందే, న్యూఢిల్లీ:భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ నడ్డి విరిగినా ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ కొత్త కుట్రకు తెర లేపాడు. తన ఉగ్ర ఎజెండాను కొనసాగించేందుకు ఏకంగా మహిళలనే జిహాదీ బ్రిగేడ్‌గా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. బహవల్‌పూర్‌లోని ప్రధాన కార్యాలయం కేంద్రంగా ఈ వ్యూహం రూపొందుతోంది. పాకిస్తాన్ అధికారులు, ప్రభుత్వంలోని పెద్దల అండదండలు లేకుండా ఈ ప్రమాదకర కుట్ర చేయడం అసాధ్యం. నిషేధించిన సంస్థలంటూ పదే పదే ప్రపంచానికి…