
వైద్య విద్యకు ‘ఎన్ఎంసీ’ చెద – అవినీతి అడ్డా జాతీయ మెడికల్ ‘కమీ’షన్
సహనం వందే, హైదరాబాద్:భారత వైద్య విద్య రంగాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి, అక్రమాలపై ప్రపంచ ప్రఖ్యాత వైద్య పత్రిక ‘లాన్సెట్’ బాంబు పేల్చింది! జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) వ్యవస్థీకృత అవినీతికి, అసమర్థతకు నిలయంగా మారిందని ఘాటుగా విమర్శించింది. జులై 19న ప్రచురితమైన ఈ సంచలనాత్మక నివేదిక… భారత వైద్య విద్య భవిష్యత్తును, ప్రజల ఆరోగ్య సంరక్షణ నాణ్యతను అంధకారంలోకి నెట్టేస్తోందని హెచ్చరించింది. ఎన్‌ఎంసీ అక్రమాల పుట్ట అని దునుమాడింది. లంచాల బాగోతం… వ్యవస్థకే చీడజూన్ 30న…