సొంత గడ్డపై గడ్డుకాలం – గుజరాత్ నుండి రెండేళ్లు బహిష్కరణ

సహనం వందే, న్యూఢిల్లీ:కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోహ్రబుద్దీన్ షేక్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో తన రెండేళ్ల గుజరాత్ బహిష్కరణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని న్యాయమూర్తి ఆఫ్తాబ్ అలం ఆందోళన వ్యక్తం చేయడంతో తానే స్వచ్ఛందంగా రాష్ట్రం విడిచి వెళ్లానని షా స్పష్టం చేశారు. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ పాలనలో హోం మంత్రిగా ఉన్న షా… తన పదవీ ప్రభావం సాక్ష్యాలపై…

Read More

వైద్య అనుబంధ వృత్తుల కౌన్సిల్ ఏర్పాటుకు డిమాండ్

సహనం వందే, హైదరాబాద్:వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మినహా వైద్య రంగానికి చెందిన 57 రకాల అనుబంధ వృత్తులను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2021 మార్చిలో వైద్య అనుబంధ వృత్తుల జాతీయ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర కౌన్సిల్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. చివరికి సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర కౌన్సిల్స్‌ను…

Read More

‘సీఎంలు వాళ్లు.. రోడ్లపై నేను’ – వి. హనుమంతరావు భావోద్వేగం

సహనం వందే, కరీంనగర్:‘నేను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్, చంద్రబాబు నా దగ్గరే పని చేశారు. వాళ్లు సీఎంలు అయ్యారు. నేను మాత్రం రోడ్లమీద తిరుగుతున్నాన’ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు రెండుసార్లు వచ్చినప్పటికీ ఆ పదవి తీసుకోలేదని చెప్పారు. సోమవారం కరీంనగర్ జిల్లాలో జరిగిన జనహిత పాదయాత్రలో చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పార్టీ మారని నేతపదవుల కోసం పార్టీలు మారిన నేతలు చాలామంది ఉన్నారని,…

Read More

ఎంఎన్ జే డైరెక్టర్ పై వేటు – డాక్టర్ శ్రీనివాసులుకు డీవోపీటీ షాక్!

సహనం వందే, హైదరాబాద్‌:ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులుపై వేటు పడింది. ఆయనను తిరిగి వెనక్కి పంపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ సాధారణ పరిపాలన విభాగం తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. ఏపీకి కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలంటూ శ్రీనివాసులు చేసిన అభ్యర్థనను కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వశాఖ (డీవోపీటీ) తిరస్కరించింది. 2017 జనవరి 17న జారీ చేసిన ఆ ఉత్తర్వులు…

Read More

తెలుగు భాషపై మార్వాడీ ద్వేషం – దశాబ్దాలైనా స్థానిక భాష మాట్లాడని జాతి

సహనం వందే, హైదరాబాద్:శతాబ్దాలుగా దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నామని… సొంత తెలివి తేటలతో వ్యాపారాలు చేస్తున్నామని చెప్పుకుంటున్న మార్వాడీలు… ఇన్నేళ్ల కాలంలో తెలుగు భాష ఎందుకు నేర్చుకోలేదు? గ్రామాలు మొదలు హైదరాబాద్ వరకు ఎక్కడ చూసినా వాళ్ళెవరూ తెలుగు నేర్చుకోరు… మాట్లాడరు. వాళ్ల కోసం మనం హిందీ నేర్చుకోవాలి తప్ప… మార్వాడీలు మాత్రం తెలుగు నేర్చుకోరు. మనకు వచ్చినా రాకున్నా వాళ్ల భాషలోనే మాట్లాడాలి. తెలుగు భాషపై మార్వాడీ ద్వేషం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. స్థానిక ప్రజల భాషా,…

Read More

ప్రజా నాయకుడి శరీరమూ ప్రజలకే అంకితం – మెడికల్ కాలేజీకి సురవరం భౌతికకాయం

సహనం వందే, హైదరాబాద్:సిపిఐ అగ్రనేత, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డికి రెడ్ ఆర్మీ ఘనంగా అంతిమ వీడ్కోలు పలికింది. ఆయన భౌతికకాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో గౌరవించింది. అంతిమయాత్రలో వేలాది మంది ప్రజలు, నాయకులు పాల్గొని నివాళులర్పించారు. సుధాకర్ రెడ్డి చివరి కోరిక మేరకు ఆయన భౌతికకాయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు. అంతిమయాత్రలో ముందు పోలీసులు అధికారిక గౌరవ వందనం సమర్పించగా, ఆ తర్వాత…

Read More

మా దేశం… మా కోసం – టూరిస్ట్ గోబ్యాక్ – యూరోపియన్ల నినాదం

సహనం వందే, యూరప్:ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో స్థానిక ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ‘మా దేశం మా కోసమే’నని అక్కడి ప్రజలు నినదిస్తున్నారు. టూరిస్టుల పేరుతో తమ అందమైన నగరాలను నాశనం చేస్తున్నారని… తమ జీవనశైలిని, సంస్కృతిని, ఉనికిని ధ్వంసం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఆదాయ వనరుగా భావించిన పర్యాటకం ఇప్పుడు యూరప్‌లోని అనేక నగరాలకు సమస్యగా మారింది. పర్యాటకుల తాకిడి పెరిగి స్థానిక సంస్కృతి, జీవనశైలి దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ బార్సిలోనా నుంచి…

Read More

500 కోట్ల సైబర్ మోసగాడు – బెజవాడ యువకుడు శ్రవణ్ గ్యాంగ్ నిర్వాకం

సహనం వందే, విజయవాడ:విజయవాడకు చెందిన యువకుడు శ్రవణ్ కుమార్ రెండు నెలల్లోనే 500 కోట్ల రూపాయల సైబర్ క్రైంకు పాల్పడడం సంచలనం అయ్యింది. అతన్ని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. శ్రవణ్ కుమార్ 500 మ్యూల్ అకౌంట్లు సృష్టించి వాటి ద్వారా 500 కోట్ల పైచిలుకు నగదు బదిలీలు చేసిన విషయం తెలిసింది. సైబర్ లింకుల ద్వారా వచ్చిన మోసపూరిత డబ్బును ఈ అకౌంట్లలోకి మార్చి, తర్వాత ఫేక్ కంపెనీలకు పంపేవాడు. ఈ వ్యవస్థలో ఆరు కంపెనీలకు ప్రత్యేక…

Read More

వినాయక చవితి విశిష్టత – సంతోషం పంచే సనాతన సంప్రదాయం

భారతీయ సంస్కృతిలో పండుగలకు విశిష్ట స్థానం ఉంది. ప్రతి పండుగ ఒక ప్రత్యేకమైన సందేశాన్ని, ఒక తాత్విక బోధనను అందిస్తుంది. వాటిలో అత్యంత ప్రాముఖ్యమైనది వినాయక చవితి. భాద్రపద శుద్ధ చవితి నాడు గణనాథుడిని ఆరాధించడం అనాది కాలం నుండి వస్తున్న సనాతన సంప్రదాయం. విఘ్ననాయకుడు, విద్యాదాయకుడు, ఐశ్వర్యప్రదాత అయిన గణపతిని పూజించడం ద్వారా జీవితంలో ఆనందం, శాంతి, సౌఖ్యం కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గణపతి రూపంలోనే ఎన్నో బోధనలు!వినాయకుడు గజాననుడు, విఘ్నేశ్వరుడు, గణాధిపతి, సిద్ధివినాయకుడు…

Read More

యూరియా కోసం రైతుల రాళ్ల దాడి

సహనం వందే, వనపర్తి:యూరియా కోసం అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. కీలకమైన సమయంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో అధికారులను నిలదీస్తున్నారు. అందులో భాగంగా శనివారం వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో అన్నదాతలు ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద అధికారులను నిలదీశారు. వారు స్పందించకపోవడంతో రాళ్లతో దాడి చేశారు. దీంతో అక్కడ తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల రైతులు యూరియా కోసం ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.‌ మరోవైపు కొందరు మార్క్…

Read More