ఆయిల్ పామ్ మొక్కల్లో జన్యు లోపాలు

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్ పామ్ తోటలు రైతులకు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో సుమారు 90 వేల ఎకరాల్లో సాగవుతున్న ఆయిల్ పామ్ తోటలు రైతులకు నిరాశ మిగిలిస్తున్నాయి. తెలంగాణ ఆయిల్ ఫెడ్ జోన్‌లో 1993 నుండి 2015 వరకు మంచి నాణ్యత గల మొక్కలను అందించినప్పటికీ, 2016 నుండి నర్సరీల ద్వారా సరఫరా చేసిన మొక్కల్లో గణనీయమైన శాతం (20% నుండి 50% వరకు) జన్యు…

Read More

కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్‌లో అందాల తారలు

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ, ఈ రంగంలో అపారమైన సేవ‌లందిస్తున్న ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్ – ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్‌ను మిస్ వరల్డ్ పోటీదారులు కొందరు మంగళవారం సందర్శించారు. సౌందర్యం కేవలం బాహ్య రూపానికే పరిమితం కాదని, సామాజిక సేవలో కూడా తమ వంతు పాత్ర పోషించగలమని ఈ సందర్శన ద్వారా వారు చాటిచెప్పారు. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ 2025 ప్రతినిధులకు కిమ్స్ గ్రూప్…

Read More

‘నకిలీ’ మాఫియా నీడలో వ్యవసాయశాఖ

సహనం వందే, హైదరాబాద్: వానాకాలం సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. రైతులు ఇప్పటికే విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎప్పటిలాగే దళారులు రైతులను మోసం చేస్తున్నారు. తెలంగాణలో పత్తి రైతులు నిషేధిత బీటీ-3 విత్తనాల దందాతో మోసపోతున్నారు. వ్యాపారులు, దళారులు అధిక దిగుబడి, తెగుళ్ల నిరోధకత పేరుతో ఈ విత్తనాలను రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఈ నకిలీ విత్తనాల రవాణాను అరికట్టడంలో విఫలమవుతూ, కొందరు దళారులతో కుమ్మక్కై చూసీ చూడనట్టు…

Read More

మహేశ్‌బాబు కుటుంబంలో కరోనా

సహనం వందే, హైదరాబాద్: కరోనా వైరస్ మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. సింగపూర్, థాయిలాండ్, హాంగ్‌కాంగ్ దేశాల్లో వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇదే సమయంలో, భారతదేశంలో కూడా కరోనా తిరిగి ప్రవేశించింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు కుటుంబంలో ఈ వార్త కలకలం రేపింది. ఆయన భార్య నమ్రత శిరోద్కర్ సోదరి, బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ‘ఎక్స్’ ద్వారా…

Read More

ప్రపంచంపైకి పాకిస్తాన్ రేపిస్టులు

సహనం వందే, ఢిల్లీ: పాకిస్తాన్ అంతర్జాతీయ నేరగాళ్ల అడ్డాగా మారిపోయింది. ఆ దేశ పౌరులు ప్రపంచమంతటా విషబీజాల్లా వ్యాపించి, దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారు. పాక్ విదేశాంగశాఖ సోమవారం స్వయంగా వెల్లడించిన లెక్కల ప్రకారం… ఏకంగా 23,456 మంది పాక్ ఉన్మాదులు రేప్, హత్య, డ్రగ్స్ సరఫరా, మోసాలు వంటి హేయమైన నేరాలకు పాల్పడి వేర్వేరు దేశాల్లో కటకటాల్లో ఉన్నారు. సౌదీ అరేబియాలో 12,156 మంది, యూఏఈలో 5,292 మంది ఖైదీలుగా ఉండటం పాకిస్తాన్ సమాజం నేరకూపంలో ఎంతగా…

Read More

గుల్జార్ ఘటన…వ్యవస్థాగత ఉగ్రవాదం

సహనం వందే, హైదరాబాద్: పహల్గాంలో ఉగ్రవాదుల చేతుల్లో 26 మంది చనిపోతే, భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై యుద్ధం చేసింది. మరి హైదరాబాదులోని గుల్జార్ హౌస్‌లో మంటలు చెలరేగి 17 మంది చనిపోతే ఎవరిపై మనం యుద్ధం చేయాలి? నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలను బలిగొన్న ఇక్కడ ఉగ్రవాదులు ఎవరు? అధికారులు కాదా? ఇది అంతర్గత వ్యవస్థాగత ఉగ్రవాదం కాదా? ఈ ఉగ్రవాదులపై చర్యలు ఉండవా? ఏదో సాకులు చెప్పి తప్పించుకుంటే సరిపోతుందా? ఇది కేవలం దుర్ఘటన కాదు….

Read More

ఢీకొట్టినా వెనక్కితగ్గని ‘జర్నలిజం’

సహనం వందే, బాల్టీమోర్: గుర్రపు పందేలంటే ఉత్కంఠకు కేరాఫ్ అడ్రస్. క్షణక్షణానికో మలుపు తిరిగే ఈ రేస్‌ల్లో ఒక్కోసారి ఊహించని విజయాలు నమోదవుతుంటాయి. సరిగ్గా అలాంటి సంచలనమే ఆదివారం మేరీల్యాండ్ లోని బాల్టిమోర్‌ పిమ్లికో రేస్ కోర్స్‌లో జరిగింది. 150వ ప్రీక్‌నెస్ స్టేక్స్‌లో జర్నలిజం అనే గుర్రం అద్భుతమైన కంబ్యాక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. రేస్ మధ్యలో మరో గుర్రంతో ఢీకొని ట్రాక్ తప్పే ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ ఈ గుర్రం, చివరి క్షణాల్లో మెరుపు వేగంతో…

Read More

’23’: తెరపై దళిత గాథ!

సహనం వందే, హైదరాబాద్: వెండితెరపై కదులుతున్న దృశ్యం కేవలం సినిమా కాదు… అది కాలం చేసిన గాయం! ’23’ అనే అంకె… 1993లో చిలకలూరిపేటలో జరిగిన బస్సు దహన ఘటనలో అసువులు బాసిన 23 మంది అమాయకుల ఆర్తనాదం! జీఆర్ మహర్షి అందించిన కథతో దర్శకుడు రాజ్ ఆర్ రూపొందించిన ఈ చిత్రం… ఆనాటి విషాదాన్ని, నేటి సమాజంలోని అసమానతలను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. నేరం చేసిన వారికి శిక్ష పడాలి… కానీ, సమాజంలో అందరికీ న్యాయం…

Read More

ఆయిల్ ఫెడ్ అక్రమాలపై సీబీఐ!

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని రైతులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని యోచిస్తున్నారు. ఆయిల్ ఫెడ్ లో అక్రమాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వారెవరూ పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయిల్ ఫెడ్ లోని కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడినట్లు వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ కోరడమే సరైన పరిష్కారంగా రైతులు భావిస్తున్నారు. ‘రైతుల…

Read More

హిట్లర్ నాజీ’హీరో’యిజం

సహనం వందే, హైదరాబాద్: అడాల్ఫ్ హిట్లర్… ఈ పేరు వింటేనే ప్రపంచ చరిత్రలో రక్తపు అధ్యాయం కళ్లముందు కదలాడుతుంది. రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడైన ఈ నియంత విద్వేషపూరిత భావజాలం 80 ఏళ్ల తర్వాత కూడా పూర్తిగా అంతరించలేదు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే కొన్ని దేశాల్లో నియో-నాజీలు కేవలం రహస్యంగానే కాకుండా, రాజకీయ పార్టీల రూపంలోనూ ఉనికిని చాటుకుంటున్నాయి. హిట్లర్ భావజాలం పట్ల నేటి తరం ఆకర్షితులవుతున్నారు. అనేక దేశాల్లో హిట్లర్ ఒక హీరోగా యువతను…

Read More