మార్క్’ఫ్రాడ్’… యూరియా ‘బ్లాక్’ – దళారులకు అధికారుల అండ

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలో యూరియా కొరత రైతులను వెన్నాడుతుంది. కొరతను నివారించని అధికారులు… కొద్దిపాటి స్టాక్ ను దళారుల చేతుల్లో పెట్టి నల్ల బజారుకు తరలిస్తున్నారు. ఈ విషయంలో కొందరు మార్క్ ఫెడ్ అధికారులు దళారులతో కుమ్మక్కు అవుతున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. వివిధ జిల్లాల్లో ప్రాథమిక సహకార సంఘాలు, మార్క్ ఫెడ్ అధికారులు, దళారులు ఏకమై బ్లాక్ మార్కెటుకు తరలిస్తున్నారు. ఈ విషయంలో కొందరు మార్క్ ఫెడ్ అధికారులు దళారులతో కుమ్మక్కు అవుతున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. వివిధ…

Read More

‘సీతారామ’… జగ్గారం గిరిజనుల రైతుల గోడు వినుమ

సహనం వందే, హైదరాబాద్: అత్యంత పవిత్రమైన సీతారాముల పేరుతో నిర్మిస్తున్న ప్రాజెక్టు అది. అంతటి ప్రాముఖ్యత ఉన్న ప్రాజెక్టు కింద ఉన్న గిరిజన రైతులకు గత ప్రభుత్వం నుండి అన్యాయమే జరుగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు ముఖ్యమైన మంత్రులు ఉన్నా న్యాయం జరగకపోవడం పట్ల ఆదివాసీలు మండిపడుతున్నారు. దమ్మపేట మండలం జగ్గారం గ్రామానికి చెందిన గిరిజన రైతులు తమ భూములకు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద ఐదేళ్లుగా నష్టపరిహారం అందకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు….

Read More

నారా భువనేశ్వరికి ఒక్కరోజే రూ. 78 కోట్లు లాభం

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి ఊహించని లాభం చేకూరింది. శుక్రవారం ఒక్కరోజే హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్ ధర 7 శాతం పైగా పెరగడంతో ఆమె వ్యక్తిగతంగా రూ. 78.80 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు తెలిసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసినప్పటికీ, హెరిటేజ్ స్టాక్ మాత్రం దూసుకుపోవడం విశేషం. హెరిటేజ్‌ ఎండీగా భువనేశ్వరి…నారా భువనేశ్వరి ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమెకు…

Read More

కవిత ‘ఢీ’ఆర్ఎస్ – తండ్రి పార్టీతో కవిత బంధానికి ముగింపు?

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికర చర్చ ఎమ్మెల్సీ కవిత చుట్టూ తిరుగుతోంది. బీఆర్‌ఎస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా? కవిత ఇక పార్టీకి పూర్తిగా దూరమైనట్టేనా? అంటే ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు అవుననే సూచిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఆమె అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత కదలికలు, చేసిన వ్యాఖ్యలు ఈ అంచనాలకు బలం చేకూరుస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ విషయంలో పార్టీ వైఖరిని ఉద్దేశించి ఆమె…

Read More

డిజిటల్ గర్ల్‌ఫ్రెండ్ ను ‘గ్రోక్‌’Oడి’

సహనం వందే, అమెరికా:ఎలాన్ మస్క్ మరోసారి తన ఆవిష్కరణలతో అందరినీ నివ్వెరపరిచారు. ఈసారి ఆయన సృష్టించిన అద్భుతం ఏంటో తెలుసా? మనసు పారేసుకునే డిజిటల్ గర్ల్‌ఫ్రెండ్ ! అవును మీరు విన్నది నిజం. ఆయన కంపెనీ ఎక్స్‌ ఏఐ రూపొందించిన గ్రోక్ చాట్‌బాట్‌లో ‘అని’ అనే పేరుతో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. ఇది గోత్ యానిమే స్టైల్లో మెరిసిపోతూ వినియోగదారులతో సరసాలాడటం, నవ్వుల పువ్వులు చిందించడం, మీమ్స్ షేర్ చేసుకోవడం, అంతేకాదు మీ పేర్లు కూడా గుర్తుంచుకోవడం…

Read More

రీజినల్ రింగ్ రైలుతో ట్రాఫిక్ కు చెక్

సహనం వందే, న్యూఢిల్లీ: తెలంగాణను సాంకేతిక, పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సెమీకండక్టర్ల ప్రాజెక్టులతో పాటు కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వినూత్న ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు పుష్కలంగా ఉన్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేంద్రమంత్రి…

Read More

ఆర్ఎంపీలకు రాజకీయ అండ’దండలు’ – మెడికల్ కౌన్సిల్ ఫైర్

సహనం వందే, హైదరాబాద్: ఆర్ఎంపీలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నోటీసులు జారీ చేసింది. అనర్హులైన ఆర్ఎంపీలకు మద్దతు ఇవ్వడం ద్వారా నకిలీ వైద్యాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని కౌన్సిల్ మండిపడింది. ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. అవకాశవాద రాజకీయాల కోసం అనర్హులైన వైద్యులను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే సత్యనారాయణ డాక్టరు అయినందున తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుండి వైద్యుడిగా ఆయన పేరును…

Read More

ఆయిల్ పామ్ తోటల్లో అవినీతి పుట్టలు-బుసలు కొడుతున్న అక్రమాలు

సహనం వందే, వేంసూర్: ఆయిల్ పామ్ తోటల్లో అవినీతి పుట్టలు వెలుగు చూస్తున్నాయి. ఆ పుట్టలను తవ్వుతుంటే అక్రమాల విషపు నాగులు బుసలు కొడుతున్నాయి. ఆయిల్ ఫెడ్ అధికారుల అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోయింది. అక్కడి రైతుల జీవితాలతో అధికారులు ఆటలాడుతున్నారు. వారి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డగోలు సంపాదనకు మరిగిన కొందరు అధికారులు రైతులకు నాసిరకం మొక్కలు అంటగట్టడంపై నిరసన వ్యక్తం అవుతుంది. ఆయిల్ పామ్ మొక్కల్లో ఎక్కువ సంఖ్యలో జన్యు లోపం ఉన్నట్టు…

Read More

కృష్ణా, గోదావరి నదీ జలాలపై కీలక ఒప్పందం

సహనం వందే, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీపై నెలకొన్న సమస్యలకు పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ సమక్షంలో బుధవారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జరిపిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, నదీ జలాల వినియోగాన్ని పర్యవేక్షించడానికి యుద్ధ ప్రాతిపదికన టెలిమెట్రీ విధానాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది, దీనిని తెలంగాణకు ఒక విజయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Read More

విదేశీ ఎంబీబీఎస్ …దేశీ పరీక్ష ఫెయిల్…డాక్టర్ల ప్రైవేట్ దందా

సహనం వందే, హైదరాబాద్:విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుతారు… కొన్ని దేశాల్లో ఎంబీబీఎస్ నే ఎండీ అంటారు. అలా విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన వారు మన దేశంలో నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజీఈ) పరీక్షల్లో ఫెయిల్ అయినప్పటికీ డాక్టర్లుగా చలామణి అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని అనేక ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఇటువంటి వారిని డాక్టర్లుగా నియమించుకుంటున్నాయి. నెలకు పాతిక వేలు జీతం ఇస్తే చాలని విదేశీ ఎంబీబీఎస్ అభ్యర్థులు భావిస్తుండటంతో, తక్కువ వేతనాలతోనే ఆసుపత్రులు…

Read More