జలుబుకి సిగరెట్ చికిత్స

5 ఏళ్ల బాలుడికి చికిత్స పేరుతో సిగరెట్ తాగించిన డాక్టర్ సహనం వందే, లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో ఒక డాక్టర్ చేసిన పని అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. డాక్టర్ సురేష్ చంద్ర ఐదేళ్ల బాలుడికి జలుబు నయం చేయడానికి చికిత్స పేరుతో సిగరెట్ తాగించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై విచారణ ప్రారంభించారు. కుతుంద్‌లోని సెంట్రల్ హెల్త్ సెంటర్‌లో ఈ అమానుషమైన సంఘటన జరిగింది. వీడియోలో డాక్టర్ ఆ బాలుడికి…

Read More

35 రకాల ఔషధాలపై నిషేధం

నొప్పి నివారణ, మధుమేహం సహా పలు మందులు సహనం వందే ఢిల్లీ: దేశవ్యాప్తంగా 35 రకాల ఔషధాల తయారీని నిలిపివేయడంతో పాటు వాటి విక్రయాలను కూడా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నొప్పి నివారణ, మధుమేహం వంటి వ్యాధులకు ఉపయోగించే అనుమతి లేని సుమారు 35 రకాల ఔషధాలపై నిషేధం విధిస్తూ కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సంస్థ సూచనల మేరకు అనుమతి…

Read More

బిడ్డ మాయమైతే ఆసుపత్రి లైసెన్స్ రద్దు

సహనం వందే, న్యూఢిల్లీ: ఇకపై ఏ ఆసుపత్రిలో పసిపాప కనిపించకుండా పోయినా, వారి లైసెన్స్ రద్దు చేయడం ఖాయం! పిల్లల అక్రమ రవాణాదారుల పట్ల తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో, ఆసుపత్రులు కూడా అంతే బాధ్యతగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు మంగళవారం తన తీర్పులో స్పష్టం చేసింది. ముఠాల నుంచి చిన్నారులను కాపాడటంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అత్యున్నత న్యాయస్థానం పిలుపునిచ్చింది. కంటికి రెప్పలా కాపాడాలి… ప్రతి ఆసుపత్రిలో ప్రసవించిన శిశువు సంపూర్ణ బాధ్యత ఆసుపత్రి సిబ్బందిదేనని జస్టిస్…

Read More

నగర జీవితానికి స్వస్తి పలికి…

సహనం వందే, హర్యానా: నగరంలోని ఉరుకులు పరుగుల జీవితానికి విసిగిపోయిన ఓ జంట.. పచ్చని పొలాల బాట పట్టారు. రసాయనాలు లేని సేంద్రీయ వ్యవసాయంతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. హర్యానాలోని సోనిపట్ జిల్లా, మెహమూద్‌పూర్ గ్రామానికి చెందిన జితేంద్ర మాన్, ఆయన భార్య సర్లా మాన్.. పట్టణ జీవితంలోని ఒత్తిళ్లకు దూరంగా, స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. టీసీఎస్ ఉద్యోగం వదిలేసి… గతంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్)లో 11 ఏళ్ల పాటు…

Read More

ఉగ్రవాది డిమాండ్లకు తలొగ్గిన ఎన్ఐఏ

సహనం వందే, న్యూఢిల్లీ: 2008 ముంబై మారణహోమ సూత్రధారి, వైద్య వృత్తిని అభ్యసించి ఉగ్రవాదిగా మారిన తహవూర్ హుస్సేన్ రాణా ప్రస్తుతం ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నాడు. ఢిల్లీలోని ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సెల్‌లో ఉన్న రాణా డిమాండ్లకు ఎన్ఐఏ తలొగ్గిందా అన్న విమర్శలు వస్తున్నాయి. అతను ఖురాన్ పుస్తకం, రాయడానికి కలం, కాగితం ఇవ్వాలని కోరడంతోపాటు రోజూ ఐదు సార్లు నమాజ్ చేసుకుంటానని కోరాడు. దీన్ని ఎన్ఐఏ అధికారులు అనుమతించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొనసాగుతున్న…

Read More

ఢిల్లీలో రూ.10 లక్షలకు శిశువుల అమ్మకం!

సహనం వందే, ఢిల్లీ: ఢిల్లీలో మానవ సంబంధాలను మంటగలిపే ఒక భయంకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఒక పెద్ద శిశువుల అక్రమ రవాణా ముఠాను సోమవారం పట్టుకున్నారు. ఈ ముఠా ఏకంగా 35 మందికి పైగా పసి పిల్లలను ఒక్కొక్కరిని రూ.10 లక్షల వరకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హృదయ విదారకర సంఘటన ఆధునిక సమాజానికి మాయని మచ్చ. రాజస్థాన్, గుజరాత్ కేంద్రంగా దందా… ఈ స్మగ్లింగ్ ముఠా తమ కార్యకలాపాల కోసం రాజస్థాన్,…

Read More

దారికడ్డంగా నిలబడే పెనుభూతమే కులవ్యవస్థ

సహనం వందే, హైదరాబాద్:దేశవ్యాప్తంగా అణగారిన కులాలు తమకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అయితే ఆ పోరాటాలన్నీ ప్రాంతీయ ఉద్యమాలుగాను, స్థానిక పోరాటాలుగానూ మిగిలిపోతున్నాయి. ఈ పోరాటాలన్నీ విడివిడి ఘటనలుగానూ, గుంపు తగాదాలుగానూ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఎన్నో ఉద్యమాలు గుర్తింపునకు నోచుకోలేదు. అలాగే అంబేద్కర్ జీవితాంతం అణగారిన వర్గాలకోసం చేసిన పోరాటం సంబంధిత ప్రజల దృష్టికి పోనేలేదు. కనీసం 50 శాతం మందికి కూడా తెలియదంటే అతిశయోక్తిలేదు. “ఓటు హక్కు ద్వారా పోరాడి రాజులు…

Read More

కర్ణాటకలో 70 శాతం మంది బీసీలే

సహనం వందే, బెంగళూరు:కర్ణాటకలో బీసీల జనాభా ఏకంగా 70 శాతం ఉండటం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇంతమంది బీసీలు అక్కడ ఉన్నారా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. కులగణన సర్వేలో ఈ వివరాలు వెలుగు చూశాయి. కర్ణాటకలో దశాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉన్న కుల గణన నివేదిక ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ ఈ నివేదికను ఏప్రిల్ 17న చర్చించనుంది. ఈ సందర్భంగా ఇతర వెనుకబాటు తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్‌ను ప్రస్తుత 32 శాతం నుంచి…

Read More

26/11 రియల్ హీరో సదానంద్ డేట్

సహనం వందే, ఢిల్లీ:26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్ రాణా విచారణను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ముమ్మరం చేసింది. ఈ విచారణకు 26/11 దాడుల్లో పోరాడిన హీరో, ఐపీఎస్ అధికారి సదానంద్ డేట్ నాయకత్వం వహిస్తుండటం విశేషం. అప్పుడు ముంబై దాడుల్లో గాయపడిన ఈ ఐపీఎస్, ఇప్పుడు అదే కేసులో అంతర్జాతీయ ఉగ్రవాదిని విచారణ చేయడం విశేషం. సదానంద్ డేట్ 1990 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి. ముంబై దాడుల్లో అసమాన ధైర్యం…26/11 దాడుల…

Read More

కర్ణాటకలో ఓబీసీలకు 51 శాతం రిజర్వేషన్లు

సహనం వందే, బెంగళూరు:కర్ణాటకలో రిజర్వేషన్ల విధానం ఒక్కసారిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్‌ను భారీగా పెంచాలని కుల గణన నివేదిక సిఫార్సు చేసింది. ప్రస్తుతం 32 శాతంగా ఉన్న ఓబీసీ రిజర్వేషన్లను ఏకంగా 51 శాతానికి పెంచాలని నివేదిక ప్రతిపాదించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నివేదికను సమర్పించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కుల గణన నివేదికలో ఏం…

Read More