జగదీశ్‌గా జాకీర్‌… సావిత్రిగా సబీరా

సహనం వందే, మథుర: ఉత్తరప్రదేశ్ లో మతమార్పిడి సంఘటన సంచలనంగా మారింది. మొఘలుల కాలంలో తమ పూర్వీకులు హిందువులని… అప్పుడు వారిని బలవంతంగా మతమార్పిడి చేసి ముస్లింగా మార్చారని… అందుకే ఇప్పుడు తిరిగి హిందూ మతంలోకి తిరిగి వచ్చామని కుటుంబ సభ్యులు అంటున్నారు. తాము ముస్లింలం అయినప్పటికీ మనసులో హిందువులు గానే బతుకుతున్నామని కుటుంబ పెద్ద చెప్తున్నారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని మథురా జిల్లా జమునాపార్ ప్రాంతానికి చెందిన ఒక ముస్లిం…

Read More

బహు’భ’జన

సహనం వందే, హైదరాబాద్: ఇలా అగ్రవర్ణాల ప్రయోజనాల కోసమే పనిచేస్తూ… మరోవైపు తాము బహుజనుల కోసమే పుట్టామని… వారి సేవలోనే తరిస్తామని… అందుకే కులగణన చేశామని అధికార పెద్దలు డబ్బా కొట్టుకుంటున్నారు. వారి మాటలకు చేతలకు ఎంత తేడా ఉందో పై ఉదాహరణలు చాలు. దేశంలో… రాష్ట్రంలో బహుజనుల పట్ల అగ్రవర్ణ పార్టీల తీరు ఇదే. బీజేపీ మతంపై ఆధారపడి ఓట్లు సంపాదిస్తున్నందున… కులంపై ఆధారపడి ఓటు బ్యాంకును స్థిరం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ…

Read More

పాక్ కళాకారులపై నిషేధం విధించాల్సిందే

బాలీవుడ్ సినీ నటుడు సునీల్ శెట్టి కామెంట్ సహనం వందే, ముంబై: పహల్గాంలో జరిగిన దాడి తర్వాత పాకిస్థానీ కళాకారులపై నిషేధం విధించాలన్న డిమాండ్‌కు నటుడు సునీల్ శెట్టి గట్టిగా మద్దతు తెలిపారు. మన శాంతికి భంగం కలిగించి, అమాయకులను చంపేవారితో కళలు, క్రికెట్ వంటి రంగాల్లో పనిచేయటం సరైనది కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు దేశం ఐక్యంగా ఉండాలని, ఎవరూ విద్వేషాలు వ్యాప్తి చేయకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.ఉగ్రదాడి నేపథ్యంలో స్పందించిన…

Read More

30 ఏళ్ల సర్వీసు… 57 బదిలీలు

సహనం వందే, హరియాణా: హర్యానా కేడర్‌లో తిరుగులేని ధైర్యానికి మారుపేరుగా నిలిచిన ఐఏఎస్ అధికారి అశోక్ బుధవారం పదవి విరమణ చేశారు. తన 30 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఏకంగా 57 సార్లు బదిలీ అయిన ఆయన… అవినీతిపై నిక్కచ్చిగా పోరాడిన యోధుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.1991 బ్యాచ్‌కు చెందిన అశోక్ ఖేమ్కా హరియాణా ఎన్నో కీలక పదవులు నిర్వహించినా, ఎక్కడ అవినీతి కనిపించినా నిలదీసే తత్వం ఆయనది. ఈ కారణంగానే అధికారులు, రాజకీయ నాయకుల నుంచి…

Read More

ఏఐలో భారత్ వెనుకబాటు

సహనం వందే, హైదరాబాద్: కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంలో భారతదేశం వెనుకబాటులో ఉందని గూగుల్, కాంటార్ నిర్వహించిన తాజా అధ్యయనం తెలిపింది. ఏఐ వినియోగం ఆశించిన స్థాయిలో లేదని తెలిపింది. 18 నగరాల్లో 8,000 మందితో జరిపిన సర్వే ఏఐ గురించి 60% మందికి తెలియదని, కేవలం 31% మంది మాత్రమే ఏఐ టూల్స్ ను ప్రయత్నించారని పేర్కొంది. ఈ గణాంకాలు భారతదేశం ఏఐ విప్లవంలో వెనుకబడుతుందనే ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఏఐ వినియోగంలో అడ్డంకులు ఎక్కడ?భారతీయులలో ఏఐ…

Read More

బీహార్ బుల్డోజర్

సహనం వందే, పాట్నా: జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియం వేదికగా 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025లో చరిత్ర సృష్టించాడు. కేవలం 35 బంతుల్లోనే మెరుపు శతకం బాది, క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన ఈ బీహార్ బుల్డోజర్… గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై 11 సిక్సర్లు, 7 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ వీరుడిగా నిలిచిన వైభవ్ వెనుక ఎన్నో త్యాగాలు, కఠోర…

Read More

పహల్గాంలో హైటెక్ టెర్రరిజం

సహనం వందే, ఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి కేవలం ఒక హింసాత్మక చర్య మాత్రమే కాదు, భారత భద్రతా వ్యవస్థపై జరిగిన సైబర్ దాడి! పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు చైనా తయారీ శాటిలైట్ ఫోన్లు, నిషేధిత ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించి తమ మారణకాండను సమన్వయం చేసుకున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. ఈ హైటెక్ టెర్రరిజం వెనుక అంతర్జాతీయ శక్తులున్నాయని స్పష్టమవుతోంది. భారత భూభాగంలోకి చొరబడిన ఈ సైబర్ ఉగ్రవాదులు…

Read More

పిల్లలతో అసభ్యంగా ఏఐ చాట్‌బాట్‌

సహనం వందే హైదరాబాద్: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా రూపొందించిన కృత్రిమ మేధస్సు (ఏఐ) చాట్‌బాట్‌లు ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్నాయి. ఈ చాట్‌బాట్‌లు సరదా సంభాషణల కోసం తయారు చేసినా, ఇవి చిన్నారులతో సహా అందరు యూజర్లతో అసభ్యకరమైన, లైంగిక విషయాలు మాట్లాడుతున్నాయని కొత్తగా వెలుగులోకి వచ్చింది. మెటా ఏఐ అధికారిక చాట్‌బాట్‌తో పాటు యూజర్లు తయారుచేసిన చాలా చాట్‌బాట్‌లు లైంగిక చర్చలను ప్రోత్సహిస్తున్నాయి. ఇది పిల్లల భద్రతకు పెను ప్రమాదంగా మారుతోందని ఆందోళనలు…

Read More

తొలి మహిళా డాగ్ హ్యాండ్లర్ శ్రీలక్ష్మి

సహనం వందే, అస్సాం: భారత సైన్యంలోని ప్రతిష్టాత్మక అస్సాం రైఫిల్స్‌లో ఒక తెలుగు మహిళ చరిత్ర సృష్టించారు. రైఫిల్‌వుమన్ పీవీ శ్రీలక్ష్మి… ఈ పారామిలిటరీ దళం మొట్టమొదటి మహిళా డాగ్ హ్యాండ్లర్‌గా విజయవంతంగా శిక్షణ పూర్తి చేశారు. సాంప్రదాయకంగా పురుషుల ఆధిపత్యంలో ఉన్న ఈ కీలక విభాగంలో శ్రీలక్ష్మి తన అంకితభావం, ధైర్యంతో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. అస్సాం రైఫిల్స్ స్వయంగా ఈ విషయాన్ని తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించడంతో, సోషల్ మీడియాలో ఆమె…

Read More

పాఠ్యపుస్తకాల్లో ‘మొఘలు’లకు మంగళం

సహనం వందే, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎన్సీఈఆర్టీ ఏడో తరగతి పాఠ్యపుస్తకాలను పూర్తిగా మార్చడం సంచలనంగా మారింది. ఈ పుస్తకాల్లో అనేక మార్పులు చేర్పులు చేశారు. నూతన పాఠ్య పుస్తకాల్లో మొఘల్ చక్రవర్తులు, ఢిల్లీ సుల్తానేట్‌కు సంబంధించిన సమస్త చరిత్రను తొలగించింది. ‘భూమి ఎలా పవిత్రమవుతుంద’నే కొత్త చాప్టర్ ను పొందుపరిచారు. ఈ చాప్టర్లో హిందూ, బౌద్ధ, సిక్కు, ఇస్లాం, క్రైస్తవ, జుడాయిజం, జోరాస్ట్రియన్ మతాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. అలాగే భారత్ సహా ఇతర దేశాల్లోని…

Read More