సిగిరెట్టు ఎంతో సమోసా అంతే – కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆదేశాలు

సహనం వందే, హైదరాబాద్:భారతదేశంలో స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి జీవనశైలి వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సమోసా , జిలేబీ, పకోడా, వడపావ్, ఛాయ్ బిస్కెట్లు వంటి అధిక కొవ్వు, చక్కెర కలిగిన ఆహార పదార్థాలపై సిగరెట్ల తరహా ఆరోగ్య హెచ్చరికలు ప్రదర్శించనుంది. ప్రజల్లో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి అవగాహన కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం. ఈ వినూత్న ప్రచార…

Read More

నకిలీ ఎండీల బురిడీ-ఎంబీబీఎస్ కు సమానంగా విదేశీ ఎండీ కోర్స్

సహనం వందే, హైదరాబాద్: ______________________________________________________________________________________________________________________ రాష్ట్రంలో అనేకమంది నకిలీ ఎండీలు ఉన్నారు. అనేక దేశాల్లో ఎంబీబీఎస్ తత్సమాన ఎండీ కోర్సు ఉంది. అంటే అక్కడ ఎండీ చేసినవాళ్లు ఇక్కడి ఎంబీబీఎస్ తో సమానం. ఆయా దేశాల్లో సదరు కోర్సు చేసిన పలువురు డాక్టర్లు రాష్ట్రంలో ఎండీ (డాక్టర్ ఆఫ్ మెడిసిన్) లుగా చలామణి అవుతూ రోగులను బురిడీ కొట్టిస్తున్నారు. అంతేకాదు అలా చదివిన వారు తప్పుడు డిగ్రీతో దాదాపు 150 ఆసుపత్రులు నడిపిస్తున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి….

Read More

రాముడిపై భక్తి… గోకర్ణ గుహలో రష్యన్‌ మహిళ జీవితం

సహనం వందే, బెంగళూరు:కర్ణాటకలోని గోకర్ణ సమీపంలో ఉన్న రామతీర్థ కొండల గుహలో రష్యన్‌ మహిళ నీనా కుటినా తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఎనిమిదేళ్లుగా రహస్యంగా జీవిస్తోంది. ఈ 40 ఏళ్ల మహిళ, ఆమె ఆరేళ్ల కూతురు ప్రేమ, నాలుగేళ్ల కూతురు ఆమాతో కలిసి ఆధ్యాత్మిక జీవనం సాగించింది. ఆమె వీసా 2017లోనే ముగిసినప్పటికీ, భారతదేశంలోనే ఉంటూ గోకర్ణ అడవుల్లో దాక్కుంది. జులై 9న సాధారణ గస్తీలో ఉన్న గోకర్ణ పోలీసులు ఈ కుటుంబాన్ని గుర్తించి సురక్షితంగా…

Read More

ఎన్ఎంసీ చైర్మన్ ఔట్… దేశవ్యాప్తంగా ప్రకంపనలు

సహనం వందే, న్యూఢిల్లీ:నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ గంగాధర్ పై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. ఆయన స్థానంలో డాక్టర్ అభిజాత్ చంద్రకాంత్ సేథ్ ను నియమించింది. దేశంలో మెడికల్ కాలేజీల ఏర్పాటు… సీట్ల పునరుద్ధరణలో భారీ అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా ఏకంగా ఎన్ఎంసీ చైర్మన్ నే తొలగించటం దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తుంది. ఇంకా మరికొందరిని తప్పించే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ…

Read More

కారం చల్లి… సిగరెట్లతో కాల్చి…బహుజనుడిపై పోలీసుల రాక్షసత్వం

సహనం వందే, చెన్నై:పోలీసుల చిత్రహింసలకు బహుజనుడు బలయ్యాడు. చిన్నపాటి దొంగతనం ఆరోపణలతో అరెస్టు చేసి కొట్టి చంపేశారు. తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆభరణాల దొంగతనం ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్న అజిత్ కుమార్ (27) అనే యువకుడు చిత్రహింసల కారణంగా మరణించాడు. పోస్ట్-మార్టమ్ నివేదికలు పోలీసుల క్రూరత్వాన్ని వెల్లడి చేయడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించారు. ఏ…

Read More

49,000 కోట్ల భారీ స్కామ్‌ – పెరల్ ఆగ్రో టెక్ మోసం

సహనం వందే, లక్నో: దేశంలో అత్యంత పెద్ద కుంభకోణాల్లో ఇదొకటి.‌ పెరల్ ఆగ్రో టెక్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఏసీఎల్‌) సంస్థ ఏకంగా రూ. 49 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడటంతో దేశం యావత్తూ నిర్ఘాంత పోయింది. మధ్యతరగతి ప్రజలను, అనేకమంది చిన్నచిన్న పెట్టుబడిదారులను మోసం చేయడంతో ఆయా వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది ప్రజల నుంచి, చిన్నచిన్న పెట్టుబడిదారుల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో శుక్రవారం…

Read More

గేమింగ్… మనీ వింగ్ – సాంప్రదాయ కెరీర్‌లకు గేమింగ్ సవాల్

సహనం వందే, హైదరాబాద్:యూట్యూబ్ వాక్‌త్రూలు, మల్టీప్లేయర్ గేమ్‌లతో పెరిగిన ప్రస్తుత తరానికి గేమింగ్ ఇకపై కేవలం ఒక అలవాటు లేదా వినోదం మాత్రమే కాదు. ఇది ఒక లాభదాయకమైన కెరీర్‌గా, గణనీయమైన ఆదాయ వనరుగా రూపాంతరం చెందుతోంది. గేమింగ్ రంగం సాంప్రదాయ ఉద్యోగాల భావనను సవాల్ చేస్తూ యువతకు సరికొత్త అద్భుతమైన అవకాశాలను సృష్టిస్తోంది. ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ పట్ల దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తోంది. కొత్త తరం కలల వృత్తిగా ఆవిష్కరణ…గతంలో గేమింగ్‌ను కేవలం సమయం…

Read More

పాడ్‌కాస్ట్‌లపై జెన్ జెడ్ (1997-12) జోరు

సహనం వందే, హైదరాబాద్:ఆధునిక యువతరం… ముఖ్యంగా జెన్ జెడ్ కేవలం సోషల్ మీడియా, వీడియో కంటెంట్‌లకే పరిమితం కావడం లేదు. ప్రస్తుతం వారి ఆసక్తి కొత్త ధోరణి వైపు మళ్లింది – అదే పాడ్‌కాస్ట్‌. ఈ ఆడియో కంటెంట్ రూపం జెన్ జెడ్ తరంలో అనూహ్యమైన ఆదరణ పొందుతోంది. డిజిటల్ యుగంలో పెరిగిన ఈ తరానికి చెందినవారు పాడ్‌కాస్ట్‌లలో కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా విజ్ఞానాన్ని, సమాచారాన్ని వెతుకుతున్నారు. పాడ్‌కాస్ట్‌లపై అమిత ఆకర్షణ…జెన్ జెడ్ అంటే 1997…

Read More

చేతి భోజనం … అజీర్తి దూరం

సహనం వందే, హైదరాబాద్:అమెరికాలో సభ్య సమాజం చేతి భోజనం చేయదు. పాశ్చాత్య సంప్రదాయాలను అనుసరించకపోతే, మీ దేశాలకు వెళ్లిపోండి’ అని అమెరికా రిపబ్లికన్ కాంగ్రెస్‌ మెన్ బ్రాండన్ గిల్ చేసిన వ్యాఖ్యలు భారతదేశాన్ని అవహేళన చేశాయి. న్యూయార్క్ నగర మేయర్ అభ్యర్థి, భారత సంతతికి చెందిన జోహ్రాన్ మామ్దానీ చేతులతో భోజనం చేస్తున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై బ్రాండన్ ఈ విధంగా కామెంట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం…

Read More

మెడికోల సస్పెన్షన్లపై ఫైమా ఫైర్ – ఎన్‌ఎంసీకి ఫిర్యాదు

సహనం వందే, న్యూఢిల్లీ:కరీంనగర్‌ చల్మెడ ఆనందరావు ప్రైవేటు మెడికల్ కాలేజీలో స్టైపెండ్ కోసం నిరసన తెలిపిన 64 మంది ఇంటర్న్‌లను సస్పెండ్ చేయడంపై అఖిల భారత వైద్య సంఘాల సమాఖ్య (ఫైమా) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఇంటర్న్‌లకు స్టైపెండ్‌లు చెల్లించకపోవడంపై మండిపడింది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) ఛైర్మన్‌కు ఫైమా లేఖ రాసింది. ఈ సమస్యపై తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. స్టైపెండ్ చెల్లింపుల్లో అక్రమాలు…తెలంగాణలో…

Read More