భజన్ రాక్… ‘జెన్ జెడ్’ కిరాక్ – ఇండియాలో భక్తికి యువతరం మోడ్రన్ టచ్

సహనం వందే, ముంబై:యువతరం ఇప్పుడు భక్తిని కొత్తగా ఆవిష్కరిస్తోంది. ప్రార్థనలు, భజనలు ఇకపై ఆలయాలకే పరిమితం కావడం లేదు. జెన్ జెడ్ యువత సాంప్రదాయ భజన్ సంధ్యలను తమదైన మ్యూజిక్ కల్చర్‌తో మిళితం చేసి ‘భజన్ క్లబింగ్’ అనే కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఈ ట్రెండ్ వేగంగా వ్యాపిస్తూ భక్తి భావానికి ‘యంగ్ వైబ్’ను జోడిస్తోంది. ఇది కేవలం పార్టీ కాదు, ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుకునే సోల్‌ఫుల్ జామ్…

Read More

రోడ్లపై నరబలి – రహదారి ప్రమాదాల్లో సామూహిక ఊచకోత

సహనం వందే, న్యూఢిల్లీ:భారతీయ రోడ్లు మరణం మృదంగాన్ని మోగిస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను కేవలం యాక్సిడెంట్లుగా పరిగణించలేం. ఇవి వేగంగా వాహనాలు నడుపుతూ నిబంధనలు ఉల్లంఘిస్తూ చేసే నిర్లక్ష్యపు హత్యలే. ప్రతిరోజూ సగటున 420 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. 2014 నుంచి 2023 వరకు ఈ దశాబ్దకాలంలో దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది రోడ్ల మీద చనిపోయారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదికలు…

Read More

రీల్స్ మత్తు… మోడీ ఎత్తు – 21 శతాబ్దపు మత్తు పదార్థం ‘రీల్స్’

సహనం వందే, హైదరాబాద్:బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తన విమర్శల తూటాలను సంధించారు. ఎన్నికల సభలో మాట్లాడుతూ… దేశంలోని యువతను సామాజిక మాధ్యమాల ‘రీల్స్’ మత్తులో ముంచేసి ప్రభుత్వ వైఫల్యాలు, సమస్యలు పట్టించుకోకుండా చేయాలని మోడీ కోరుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. ఈ రీల్స్ మత్తు యువతను బానిసత్వం వైపు నెడుతోందని… ఇది వారి భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ పాలనలో టెక్నాలజీని…

Read More

క్రికెట్ క్వీన్స్… ప్రైజ్ మనీ అదుర్స్ – ప్రపంచ కప్ విజయంతో రూ. 90 కోట్ల ప్రైజ్

సహనం వందే, న్యూఢిల్లీ:క్రికెట్ చరిత్రలో తొలిసారిగా భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ కిరీటాన్ని ఎగరేసుకుపోయింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన తుది పోరులో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తుచేసి భారత నారీశక్తి తమ సత్తా చాటింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన నాయకత్వంలో ఈ చరిత్రాత్మక విజయాన్ని భారత్ సొంతం చేసుకుంది. దేశం గర్వించేలా చేసిన ఈ క్రీడాకారిణులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాసుల వర్షం… కోట్లు కురిపిస్తున్న బీసీసీఐవిశ్వవిజేతగా…

Read More

నేతల లూటీ… ఏఐ లాఠీ – రాజకీయ అవినీతిని వెలికితీసేలా కొత్త ఫీచర్

సహనం వందే, హైదరాబాద్:దేశ రాజకీయాల్లో త్వరలో ఒక పెను సంచలనం చోటు చేసుకోనుంది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సెర్చ్ ఇంజిన్ పెర్ప్లెక్సిటీ ఏఐ తీసుకొస్తున్న నూతన ఫీచర్ భారతీయ రాజకీయ నాయకుల స్టాక్ హోల్డింగ్స్ గుట్టు రట్టు చేయనుంది. ఇప్పటివరకు ఎన్నికల అఫిడవిట్లు, ఆస్తి డిక్లరేషన్లలో అస్పష్టంగా ఉన్న నేతల ఆర్థిక కార్యకలాపాలు, షేర్ల పెట్టుబడులు ప్రజల కళ్ల ముందు పారదర్శకంగా ఆవిష్కృతం కాబోతున్నాయి. పెర్ప్లెక్సిటీ సీఈవో అరవింద్ శ్రీనివాస్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు….

Read More

ముస్లిం ఓట్లు… బీజేపీకి సీట్లు – బిహార్ ఎన్నికల్లో ఓవైసీ శిఖండి పాత్ర

సహనం వందే, పాట్నా:బిహార్ ఎన్నికల రాజకీయాలు అసదుద్దీన్ ఓవైసీ వ్యూహంతో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలోని మహాకూటమి ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని ఎంఐఎం పోటీ పడడం పరోక్షంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి లాభం చేకూర్చే అవకాశం కలిగించింది. మహాకూటమి ప్రధానంగా ఆధారపడిన ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారానే ఈ ప్రమాదం ఏర్పడుతోంది. 2020 ఎన్నికల్లో ఎంఐఎం పోటీ వల్ల ఐదు సీట్లు కోల్పోయిన మహాకూటమి… ఇప్పుడు 64 సీట్లకు…

Read More

లైక్ చేస్తే లూటీ – 30,000 మంది… రూ. 1,500 కోట్లు లూటీ

సహనం వందే, హైదరాబాద్:డిజిటల్‌ ప్రపంచంలో చిన్న లైక్‌ కూడా ఎంత పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందో సుమిత్ కుమార్ ఉదంతం నిరూపిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని చెఫ్ సుమిత్… ఒక ఆర్థిక సలహాదారు వీడియోకు లైక్ కొట్టగానే పది నిమిషాల్లోనే వాట్సాప్ సందేశం వచ్చింది. పెట్టుబడి కోసం ఎర వేయడానికి సైబర్ నేరగాళ్లు ఎంత వేగంగా పకడ్బందీగా పనిచేస్తున్నారో చెప్పడానికి ఇదే ఉదాహరణ. వాట్సాప్ గ్రూపుల ద్వారా నకిలీ సభ్యులతో లాభాల ఊసేత్తుతూ తమ వలలో చిక్కుకున్న వ్యక్తికి ఆశ…

Read More

ఏఐ ఉండగా డాక్టర్ దండగ – తీరికలేని మానవ వైద్యులతో రోగుల ఇబ్బంది

సహనం వందే, న్యూయార్క్:ఆసుపత్రికి వెళితే డాక్టర్ ఉంటారో లేదో తెలియదు… ఎప్పుడు వస్తారో తెలియదు… ఒకవేళ ఉన్నా బిజీ బిజీగా ఉంటారు. కొన్నిసార్లు ఎమర్జెన్సీ అంటూ వెళతారు. దీంతో రోగులు గంటల తరబడి డాక్టర్ కోసం వేచి ఉండాల్సి వస్తుంది. ఫలితంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు. ఇక కొన్ని ఆసుపత్రుల్లోనైతే డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల రోగులందరినీ సకాలంలో చూసే పరిస్థితి ఉండదు. అయితే ఇప్పుడు కాలం మారింది. ఏఐ యుగం నడుస్తుంది. ఏఐ చాట్…

Read More

ఉగ్రమరణం స్వర్గలోకం – మసూద్ ఆధ్వర్యంలో మహిళా జిహాదీ బ్రిగేడ్‌

సహనం వందే, న్యూఢిల్లీ:భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ నడ్డి విరిగినా ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ కొత్త కుట్రకు తెర లేపాడు. తన ఉగ్ర ఎజెండాను కొనసాగించేందుకు ఏకంగా మహిళలనే జిహాదీ బ్రిగేడ్‌గా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. బహవల్‌పూర్‌లోని ప్రధాన కార్యాలయం కేంద్రంగా ఈ వ్యూహం రూపొందుతోంది. పాకిస్తాన్ అధికారులు, ప్రభుత్వంలోని పెద్దల అండదండలు లేకుండా ఈ ప్రమాదకర కుట్ర చేయడం అసాధ్యం. నిషేధించిన సంస్థలంటూ పదే పదే ప్రపంచానికి…

Read More

రెండేళ్ల ప్రేమ ఐదేళ్ల నరకం – ఒక యువతి కన్నీటి గాధ

సహనం వందే, ముంబై:29 ఏళ్ల ముంబై యువతి గుండెలు బద్దలు చేసిన ఒక విషాద కథ ఇది. రెండేళ్ల పాటు ఇద్దరూ కలిసి మెలిసి డేటింగ్ చేసి ఒకరికొకరు ప్రపంచంగా బతికిన ప్రేమ కథ. పెళ్లైన ఐదేళ్ల తర్వాత పచ్చి నరకంగా మారింది. మొదట్లో ఆమెకు తన భర్తంటే పిచ్చి ఆరాధన. అర్థవంతమైన మాటలు, ఆదరణ, సొంతంగా ఎదిగిన వ్యక్తిత్వం చూసి తల్లిదండ్రుల హెచ్చరికలను కూడా లెక్కచేయకుండా పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పుడు ఆమె కళ్లల్లో కన్నీళ్లు…

Read More