మెడికోలపై ‘ప్రైవేట్’ల ఆగడాలు

సహనం వందే, హైదరాబాద్: వైద్య విద్యార్థులపై ప్రైవేటు మెడికల్ కాలేజీల ఆగడాలకు అంతే లేదు. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూల్ చేయడం… విద్యార్థులకు ఇవ్వాల్సిన ఉపకార వేతనాలను కాజేయడం… ఇదేంటని ప్రశ్నిస్తే ‘మీ జీవితం మా చేతుల్లో ఉందం’టూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మెడికోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని వైద్య విద్యార్థులు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణలోని ప్రైవేటు వైద్య కళాశాలలు విద్యార్థులను పీల్చి పిప్పి చేస్తున్న వైనం, వారిని వేధిస్తున్న తీరుపై తెలంగాణ అడ్మిషన్, ఫీజు…

Read More

బహుజనం నెత్తిన అగ్రవర్ణ పెత్తనం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ మంత్రి వర్గంలో అగ్రవర్ణాలే ఆదిపత్యం వహిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలోనూ మళ్లీ పదవులు కావాలని హై కమాండ్ పై ఒత్తిడి చేస్తున్నారు. అగ్రవర్ణ పెత్తనాన్ని మరింత విస్తరించేందుకు కుట్రలు పనుతున్నారు. 85% బహుజన జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాల పెత్తనంపై విమర్శలు వస్తున్నాయి. కుల గణన, సామాజిక న్యాయంపై కాంగ్రెస్ చెప్తున్నవన్నీ కబుర్లే అని బహుజన వర్గాలు మండిపడుతున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా 12 మంది ఉండగా… అందులో ఐదుగురు…

Read More

కమల్ హాసన్ మాటల తూటాలు

సహనం వందే, చెన్నై: చెన్నైలో ఇటీవల జరిగిన థగ్ లైఫ్ అనే కార్యక్రమం ఒక భారీ వివాదానికి కేంద్రమైంది. ఈ వేడుకలో పాల్గొన్న కమల్ హాసన్, కన్నడ భాష కూడా తమిళం నుంచే ఉద్భవించిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య తీవ్ర వివాదాస్పదమైంది. తమిళులు, కన్నడిగుల మధ్య సంబంధాలు అంత గొప్పగా ఉండవన్న విషయం తెలిసిందే. జల వివాదాలు, సరిహద్దు తగాదాలు వంటి అంశాలు ఎప్పుడూ రగులుకుంటూనే ఉంటాయి. ఇలాంటి సున్నితమైన సమయంలో అలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా…

Read More

ఆర్థికమా? అధికారమా?

సహనం వందే, హైదరాబాద్: మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కమ్యూనిస్టు పితామహుడు కారల్ మార్క్స్ చెప్పింది అక్షరాలా నిజం. డబ్బు, పదవి… ఈ రెండూ కవల పిల్లలు. ఈ రెండింటి కోసం రక్త సంబంధాలన్నింటినీ ధ్వంసం చేసుకోవటానికి కూడా వెనుకాడడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ తోనూ తెగతెంపులు చేసుకోవడానికి ఆ రెండే కారణం. తల్లి, తండ్రి, అన్న, చెల్లి… ఇవన్నీ కూడా పదవి, డబ్బు ముందు దిగదుడుపే. ఆంధ్రప్రదేశ్ లో…

Read More

‘పోష్ కాదు స్లేవ్స్’

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి చేసిన వివాదాస్పద, అమానవీయ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా అగ్ని రాజేశాయి. గురుకులాల్లో చదివే దళిత విద్యార్థులను పాష్ సొసైటీ నుంచి రాలేదని చులకనగా కించపరిచి, వారితో టాయిలెట్లు, గదులు శుభ్రం చేయించడాన్ని సమర్థించిన ఆమె, చివరకు పిల్లల తల్లిదండ్రులను షోకాజ్ నోటీసులతో బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ఈ వ్యాఖ్యలు దళిత సమాజాన్ని అవమానించడమే కాక, ఐఏఎస్ అధికారిగా ఆమె స్థాయికే మచ్చ…

Read More

వ్యవసాయశాఖలో ‘మావోయిస్టు’ చైర్మన్

సహనం వందే, హైదరాబాద్: వ్యవసాయ దాని అనుబంధ శాఖలకు చెందిన అనేక కార్పొరేషన్లలో ఒక కార్పొరేషన్ చైర్మన్ వ్యవహారం విమర్శలకు తావిస్తుంది. తనకు మావోయిస్టు బ్యాక్‌గ్రౌండ్‌ ఉందని గొప్పగా చెప్పుకుంటూ… ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ప్రతిపక్ష కేడర్, మీడియా, ప్రైవేట్ వ్యాపారులను ఆయన బహిరంగంగా బెదిరిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ‘నేను గతంలో నక్సలైట్లలో పనిచేశా… నాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి… నన్ను విమర్శిస్తే నా బ్యాక్‌గ్రౌండ్‌తో బయటకొస్తా… నాతో పెట్టుకుంటే ఖతమే’ అంటూ ఆయన చేస్తున్న…

Read More

కేసీఆర్ అండతో జీ’ఎస్ఆర్’

సహనం వందే, హైదరాబాద్: గడల శ్రీనివాసరావు… తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులుగా ఉన్న కాలంలో మొత్తం వ్యవస్థను తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఆ విభాగాన్ని గడల సామంత రాజ్యం (జీఎస్ఆర్)గా మలుచుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అండ చూసుకొని మరీ పెచ్చుమీరిపోయారు. ఎందుకో ఏమో కానీ గడలను ఒకానొక సందర్భంలో పక్కన పెట్టాలని అనుకున్న కేసీఆర్.‌‌.. కరోనా కాలంలో అందలం ఎక్కించారు. దీంతో గడలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఆయన ఒక సెలబ్రిటీగా మారిపోయారు. రాష్ట్రంలో ఏ ఐఏఎస్,…

Read More

తెరపైకి మహేష్ కుమార్ గౌడ్

సహనం వందే, హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో వెళ్లి రాహుల్ గాంధీని కలవడం చర్చనీయాంశం అయింది. బీసీగా తనకు అవకాశం కల్పించాలని ఆయన అధిష్టానాన్ని అభ్యర్థిస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ మంత్రి అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డికి అవకాశాలు సన్నగిల్లినట్లే. కాగా, కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చే ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి…

Read More

కరోనా శవాలపై రూ. 450 కోట్లు?

సహనం వందే, హైదరాబాద్: ఇలా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కాలంలో 2020 నుంచి ప్రజారోగ్య విభాగం పరిధిలోని అనేకమంది జిల్లా వైద్యాధికారులు, రాష్ట్ర వైద్యాధికారులు ప్రైవేట్ ఆసుపత్రులపై పడి అందినంత దోచుకున్నారు. రోగులకు సాయం చేయాల్సింది పోయి యాజమాన్యానికి తొత్తులుగా మారారన్న విమర్శలు ఉన్నాయి. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు వైద్య ఆరోగ్య శాఖలో కరోనా కాలంలో రూ.కోట్లు దండుకోవటమే పనిగా కొందరు అధికారులు వ్యవహరించారు. కరోనా చావులపై పైసలు ఏరుకున్నారు. వందల ఫిర్యాదులు… చర్యలెక్కడ?కరోనా సమయంలో…

Read More

జైలు నుంచి సీఎం

సహనం వందే, హైదరాబాద్: భారత రాజకీయాల్లో జైలు జీవితం అనేక మంది నాయకులకు అనూహ్య అవకాశాలు కల్పించింది. ఇటీవల కాలంలో జైలుకు వెళ్లి వచ్చిన నాయకుల పట్ల ప్రజల్లో సానుభూతి పెరుగుతుండటం గమనార్హం. రాజకీయ పోరాటాలు, అవినీతి ఆరోపణలు… కారణం ఏదైనా వారికి బ్రహ్మరథం పడుతున్నారు. జైలుకు వెళ్లడం ఒక అర్హతగా భావించేవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదలైన తర్వాత కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని,…

Read More