సిగిరెట్టు ఎంతో సమోసా అంతే – కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆదేశాలు

సహనం వందే, హైదరాబాద్:భారతదేశంలో స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి జీవనశైలి వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సమోసా , జిలేబీ, పకోడా, వడపావ్, ఛాయ్ బిస్కెట్లు వంటి అధిక కొవ్వు, చక్కెర కలిగిన ఆహార పదార్థాలపై సిగరెట్ల తరహా ఆరోగ్య హెచ్చరికలు ప్రదర్శించనుంది. ప్రజల్లో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి అవగాహన కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం. ఈ వినూత్న ప్రచార…

Read More

49,000 కోట్ల భారీ స్కామ్‌ – పెరల్ ఆగ్రో టెక్ మోసం

సహనం వందే, లక్నో: దేశంలో అత్యంత పెద్ద కుంభకోణాల్లో ఇదొకటి.‌ పెరల్ ఆగ్రో టెక్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఏసీఎల్‌) సంస్థ ఏకంగా రూ. 49 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడటంతో దేశం యావత్తూ నిర్ఘాంత పోయింది. మధ్యతరగతి ప్రజలను, అనేకమంది చిన్నచిన్న పెట్టుబడిదారులను మోసం చేయడంతో ఆయా వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది ప్రజల నుంచి, చిన్నచిన్న పెట్టుబడిదారుల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో శుక్రవారం…

Read More

గేమింగ్… మనీ వింగ్ – సాంప్రదాయ కెరీర్‌లకు గేమింగ్ సవాల్

సహనం వందే, హైదరాబాద్:యూట్యూబ్ వాక్‌త్రూలు, మల్టీప్లేయర్ గేమ్‌లతో పెరిగిన ప్రస్తుత తరానికి గేమింగ్ ఇకపై కేవలం ఒక అలవాటు లేదా వినోదం మాత్రమే కాదు. ఇది ఒక లాభదాయకమైన కెరీర్‌గా, గణనీయమైన ఆదాయ వనరుగా రూపాంతరం చెందుతోంది. గేమింగ్ రంగం సాంప్రదాయ ఉద్యోగాల భావనను సవాల్ చేస్తూ యువతకు సరికొత్త అద్భుతమైన అవకాశాలను సృష్టిస్తోంది. ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ పట్ల దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తోంది. కొత్త తరం కలల వృత్తిగా ఆవిష్కరణ…గతంలో గేమింగ్‌ను కేవలం సమయం…

Read More

చేతి భోజనం … అజీర్తి దూరం

సహనం వందే, హైదరాబాద్:అమెరికాలో సభ్య సమాజం చేతి భోజనం చేయదు. పాశ్చాత్య సంప్రదాయాలను అనుసరించకపోతే, మీ దేశాలకు వెళ్లిపోండి’ అని అమెరికా రిపబ్లికన్ కాంగ్రెస్‌ మెన్ బ్రాండన్ గిల్ చేసిన వ్యాఖ్యలు భారతదేశాన్ని అవహేళన చేశాయి. న్యూయార్క్ నగర మేయర్ అభ్యర్థి, భారత సంతతికి చెందిన జోహ్రాన్ మామ్దానీ చేతులతో భోజనం చేస్తున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై బ్రాండన్ ఈ విధంగా కామెంట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం…

Read More

రుచుల విందులో ‘అదుర్స్’ – ప్రపంచంలో 50వ స్థానం హైదరాబాద్

సహనం వందే, హైదరాబాద్:ప్రపంచ ఆహార పటంలో భారతదేశం తన విశిష్టమైన వంటకాలతో మరోసారి సగర్వంగా నిలిచింది. ప్రముఖ ఫుడ్ గైడ్ టేస్ట్‌అట్లాస్ ప్రకటించిన ప్రపంచంలోని టాప్ 100 ఆహార నగరాల జాబితాలో ఆరు భారతీయ నగరాలు చోటు దక్కించుకున్నాయి. ఇది భారతదేశపు అద్భుతమైన, వైవిధ్యమైన వంటకాల వారసత్వానికి నిదర్శనం. ఈ జాబితాలో ముంబై (5వ స్థానం) అగ్రగామిగా నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో అమృత్‌సర్ (43వ స్థానం), ఢిల్లీ (45వ స్థానం), హైదరాబాద్ (50వ స్థానం), కోల్‌కతా…

Read More

‘ఆకలిగా ఉన్నప్పుడే తిను’ – మాధవన్ యవ్వన ఫిట్‌నెస్ చిట్కా

సహనం వందే, ముంబై:బాలీవుడ్ నటుడు మాధవన్ 50 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల యవ్వనంతో మెరిసిపోతున్నాడు. ఇటీవలే విడుదలైన తన కొత్త సినిమా ఆప్ జైసా కోయ్ ట్రైలర్‌లో అతని రూపం అందరినీ ఆశ్చర్యపరిచింది. వయసును తగ్గించే సాంకేతికత (డీ-ఏజింగ్ టెక్నాలజీ) ఉపయోగించారనే పుకార్లను ఖండిస్తూ..‌‌. తన ఆరోగ్య రహస్యాన్ని వెల్లడించాడు. ఆరోగ్యకరమైన జీవనశైలి, అత్యంత సాధారణమైన ఆహార నియమాలతో ఎలా యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండవచ్చో వివరించాడు. ‘నా రూపం కోసం వయసును తగ్గించే సాంకేతికత ఉపయోగించానని…

Read More

ఏఐ స్టార్టప్ కొనుగోలు చేసిన యాపిల్

సహనం వందే, హైదరాబాద్: ఆన్-డివైస్ మోడల్స్‌ పై దృష్టి సారించిన ఒక స్టెల్త్ ఏఐ స్టార్టప్ ను యాపిల్ కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు భవిష్యత్తులో మరింత అధునాతనమైన సిరి అప్‌డేట్లు వస్తున్నాయని సూచిస్తోంది. ఈ స్టార్టప్ లైట్‌వెయిట్, ప్రైవసీ-ఫస్ట్ మోడల్స్‌ లో నిపుణత్వం కలిగి ఉంది. ఇది వినియోగదారుల డేటా భద్రతకు ప్రాధాన్యతనిచ్చే యాపిల్ విధానానికి అనుగుణంగా ఉంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో నూతన ఆవిష్కరణలు వేగంగా దూసుకుపోతున్నాయి. అభివృద్ధి చెందిన సాంకేతికతలతో తయారైన…

Read More

దక్షిణాది రాష్ట్రాలపై నరేంద్ర మోడీ దండయాత్ర

సహనం వందే, హైదరాబాద్:దక్షిణ భారత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన రాజకీయ ఆధిపత్యాన్ని విస్తరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో సమగ్ర వ్యూహాలు రచిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దక్షిణ రాష్ట్రాల్లో తమ పట్టు బలోపేతం చేసుకోవడానికి బీజేపీ రాజకీయ కసరత్తులు చేస్తోంది. ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ, డీఎంకే, కాంగ్రెస్, సీపీఎంలను బలహీనపరిచేందుకు బీజేపీ స్థానిక నాయకత్వం, పొత్తులు, సినీ తారలను ఉపయోగించుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు…

Read More

తెలంగాణ ఆయిల్ ఫెడ్ అక్రమాలపై కేంద్రం ఆగ్రహం

సహనం వందే, హైదరాబాద్:ఆయిల్ ఫెడ్ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం వేసింది. నర్సరీలు, నాణ్యతలేని మొక్కలు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రంగంలోకి దిగారు. తెలంగాణలో జరుగుతున్న ఆయిల్ పామ్ మొక్కల అక్రమాలపై విచారణ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ (ఐఐఓపీఆర్)లకు చెందిన అధికారులు, శాస్త్రవేత్తల బృందం…

Read More

తెలంగాణ గ్రూప్-1 ర్యాంకర్ల ఆవేదన -ఎప్పుడని నిలదీత

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో విజయం సాధించి, నియామకాల కోసం ఎదురుచూస్తున్న ర్యాంకర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నియామక ప్రక్రియలో జరుగుతున్న జాప్యం తమను, తమ కుటుంబాలను తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం అభ్యర్థులు నిశాంత్ , అభినవ్, రంజిత్ తదితరులు మీడియాకు తమ ఆవేదనను వివరించారు. మూడేళ్ల నిరీక్షణ… అడ్డంకుల పరంపర2022 ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ గ్రూప్ 1…

Read More