అందానికి అంత్యక్రియలు – బరువు తగ్గించే మాయా మందులు
సహనం వందే, హైదరాబాద్: బరువు తగ్గాలనే ఆశను ఫార్మా కంపెనీలు వ్యాపార అవకాశంగా మార్చుకున్నాయి. ప్రిస్క్రిప్షన్ మందులను సాధారణ సరుకుల్లా మార్చి సోషల్ మీడియాలో అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నాయి. శాస్త్రీయతను పక్కనబెట్టి లాభాలే పరమావధిగా సాగిస్తున్న ఈ కమర్షియల్ ట్రాప్ సామాన్యుల ప్రాణాలకు ముప్పుగా మారింది. ఈ అశాస్త్రీయ ప్రచారాలను అడ్డుకునేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. మందుల ముసుగులో విషంబరువు తగ్గించే మందుల్లో ప్రధానంగా కనిపిస్తున్నవి జీఎల్పీ-1 రిసెప్టర్ అగోనిస్ట్ మందులు. ఇవి…