గ్రూప్-1… గుండెల్లో గన్ – మూడున్నరేళ్ల నిరీక్షణ పటాపంచలు

సహనం వందే, హైదరాబాద్:మూడున్నరేళ్ల నిరీక్షణ… నిద్రాహారాలు లేని కఠోర శ్రమ… అసంఖ్యాకమైన ఆశల పతాక. వీటన్నింటికీ ప్రతిఫలంగా తుది జాబితాలో తమ పేర్లు చూసుకుని మురిసిపోయారు గ్రూప్-1 అభ్యర్థులు. నియామక పత్రాలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు వారి ఆశలపై పిడుగుపాటులా పడింది. తుది జాబితాను రద్దు చేస్తూ మెయిన్స్ పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశించడం..‌. లేదంటే మళ్ళీ పరీక్షలు పెట్టాలని సూచించడం… ఈ తీర్పుతో వారి గుండె ఝల్లుమంది. ఈ…

Read More

అల్లు అర్జున్ కు మరో షాక్ – అల్లు బిజినెస్ పార్క్‌ పై జీహెచ్ఎంసీ కన్నెర్ర

సహనం వందే, హైదరాబాద్:పుష్ప-2 సినిమా విడుదలైనప్పటినుంచి అల్లు కుటుంబాన్ని సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. అల్లు అర్జున్ ఏకంగా జైలుకు వెళ్లి రావాల్సి వచ్చింది. తాజాగా ఆయన తండ్రి అల్లు అరవింద్ కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో సినీ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన అల్లు బిజినెస్ పార్క్‌ ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పెంట్‌హౌస్‌పై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తీవ్రంగా స్పందించింది. అనుమతులు లేకుండా…

Read More

వేటు కోసం వెయిట్ – బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల రగడ

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం సంచలనం సృష్టించింది. ఈ ఫిరాయింపులపై వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అయితే ఒకరిద్దరు మినహా ఎవరూ స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో…

Read More

వేల కోట్ల డ్రగ్స్… ముంబై దెబ్బ అదుర్స్ – హైదరాబాదులో రూ. 12 వేల కోట్ల డ్రగ్స్ సీజ్

సహనం వందే, హైదరాబాద్:దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్ ఇప్పుడు డ్రగ్స్ మాఫియాకు కేంద్రంగా మారుతోంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు మేడ్చల్‌లో నిర్వహించిన ఆపరేషన్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దాదాపు రూ. 12 వేల కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడంతో నగరంలో అక్రమ డ్రగ్స్ తయారీ ఏ స్థాయిలో జరుగుతుందో వెల్లడైంది. ఎక్స్‌టీసీ, మోలీ, ఎండీఎంఏ వంటి అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్‌తో పాటు, వాటి తయారీకి అవసరమైన…

Read More

గురుశిష్యుల చెడుగుడు – కేసీఆర్, జగన్ లకు బాబు, రేవంత్ చుక్కలు

సహనం వందే, హైదరాబాద్/అమరావతి:తెలుగు రాష్ట్రాల రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీలు ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీలు అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, మద్యం కుంభకోణం ఈ రెండు పార్టీల పతనానికి కారణమవుతున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఒకవైపు కేసీఆర్ కుటుంబం సీబీఐ విచారణల నీడలో చిక్కుకుంటే, మరోవైపు జగన్ చుట్టూ సిట్ విచారణల ఉచ్చు బిగుస్తోంది. ఈ కుంభకోణాల పర్వం తెలుగు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరిస్తోంది….

Read More

ఐఏఎస్ కామకేళిలో ఒక మహిళ బలి!

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్‌కి చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని గత కొంతకాలంగా ఆమెతోనే ఎక్కువ సమయం గడిపిన ఏపీకి చెందిన ఓ కీలక ఐఏఎస్ అధికారి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. గత ఏపీ ప్రభుత్వంలో ఓ కీలక శాఖకు అధిపతిగా పనిచేసిన సదరు అధికారి, తన కుటుంబం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. అయితే ఇటీవల ఆ ఐఏఎస్ అధికారి వివాహేతర సంబంధంలో చోటు చేసుకున్న అనుమానాలు, కలహాలు ఒక మహిళ ప్రాణాన్ని…

Read More

రాజకీయ ఎజెండాగా కుటుంబ తగాదాలు – కవిత రాజీనామా… భవిష్యత్తుపై గందరగోళం

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. భారత రాష్ట్ర సమితి పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరాయి. కవిత తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని, ప్రజా సమస్యలపై మాట్లాడితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలుగా చిత్రీకరించారని ఆమె ఆరోపించారు. పార్టీ పెద్దలు ఈ విషయాలపై పునరాలోచించాలని ఆమె కోరారు. తన తండ్రి కేసీఆర్, సోదరుడు…

Read More

హైదరాబాదులో మార్వాడీపై దాడి – బీజేపీలో అంతర్గత గొడవలే కారణం

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ఊపందుకున్న సమయంలో హైదరాబాద్ నగరంలో ఒక మార్వాడీపై దాడి జరగడం కలకలం రేపింది. ఈ దాడికి రాజకీయ విభేదాలే కారణమని తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలే ఈ దాడికి కారణమని స్పష్టమవుతోంది. ఆర్కేపురం కార్పొరేటర్ రాధ భర్త ధీరజ్ రెడ్డి, విజయ్ దేవడా అనే మార్వాడీపై దాడి చేశారు. ఆర్కేపురంలో విజయ్ దేవడా ఏర్పాటు చేసిన వినాయకుడి దర్శనానికి సరూర్ నగర్ బీజేపీ…

Read More

అమెరికాలో హై’డ్రగ్స్’బాద్ నరమేధం – ఫెంటానిల్‌ వాడి వందల మంది మృతి

సహనం వందే, హైదరాబాద్:వసుధ ఫార్మా కెమ్ కంపెనీ అమెరికాతో సహా పలు దేశాల్లో డ్రగ్ నరమేధం సృష్టిస్తుంది. ఆ కంపెనీ ప్రమాదకర ఫెంటానిల్‌ డ్రగ్ ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలను ఏకంగా అమెరికాకే సరఫరా చేయడంతో ఆ దేశంలో వందల మంది చనిపోయారు. దీంతో ఆ కంపెనీ సీఈవో, మార్కెటింగ్ డైరెక్టర్లను ఈ ఏడాది మార్చి 20వ తేదీన అమెరికా ఫెడరల్ ఏజెన్సీ అరెస్టు చేయడంతో హైదరాబాద్ పరువు గంగలో కలిసింది. దీనిపై అప్పుడే సహనం వందే…

Read More

ఎంఎన్ జేలో ఏం జరుగుతుంది? – డైరెక్టర్ తొలగింపుపై సీఎస్ ఆదేశాలు బేఖాతర్

సహనం వందే, హైదరాబాద్:ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రికి ప్రభుత్వ ఆదేశాలు పట్టవా? ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జారీ చేసిన ఆదేశాలనే తుంగలో తొక్కుతున్నారు. వారం క్రితమే ఆయన ఎంఎన్ జే డైరెక్టర్ శ్రీనివాసులును రిలీవ్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ ప్రతిరోజూ ఆయన ఆస్పత్రికి వస్తూనే ఉన్నారు. అంతేకాదు డైరెక్టర్ పోస్టులో విధులు నిర్వహిస్తుండటంపై ఆసుపత్రి వర్గాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం తప్పించినా…

Read More