తెలంగాణ కలెక్టర్… ఏపీ మంత్రికి కనెక్ట్ – ఒక్క ఫోన్ తో పని చేసిపెట్టిన ఉన్నతాధికారి

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో మంత్రుల ఆదేశాలను పట్టించుకోకుండా అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒక జిల్లాలో జరిగిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా అధికారుల వైఖరిపై తీవ్ర చర్చకు దారితీసింది. సినీ పరిశ్రమకు చెందిన ఒక వ్యక్తి తన భూమి వివరాలు సరిచేయడానికి ధరణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. ఎన్ని రోజులు గడిచినా సొంత మంత్రి ఆదేశించినా స్పందించని కలెక్టర్… చివరకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రి చేసిన ఒక్క…

Read More

ఏఐజీ ‘ఠాగూర్ సినిమా’ – శవాన్ని దాచి… డబ్బు దోచి

సహనం వందే, హైదరాబాద్:పేదల ప్రాణాల కన్నా చివరి పైసా వసూలే ముఖ్యమనే కార్పొరేట్ హాస్పిటల్స్ దురాశకు హైదరాబాద్‌లోని ఏఐజీ సాక్ష్యంగా నిలిచింది. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం వచ్చిన 40 ఏళ్ల మురళీధర్ అనే వ్యక్తి ప్రాణం పోయినా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి చివరి వరకు డబ్బు పిండుకుని చివరకు డెడ్ బాడీని కుటుంబ సభ్యుల చేతిలో పెట్టిన దారుణ ఘటన ఇది. తమ కుటుంబ పెద్దను బతికించుకోవడానికి ఇల్లు అమ్ముకుని సర్వం కోల్పోయిన ఆ కుటుంబం…

Read More

బహుజన హక్కుల బలిదానం – బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చుక్కెదురు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై హైకోర్టు తాత్కాలిక స్టే విధించడం సామాజిక న్యాయానికి తీవ్ర విఘాతం కలిగించింది. రాష్ట్ర జనాభాలో 56 శాతం ఉన్న బహుజన సమాజానికి విద్య, ఉద్యోగం, రాజకీయం వంటి రంగాలలో సరైన అవకాశాలు దక్కకుండా చేయాలనే కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటుతున్నాయన్న సాంకేతిక అంశాన్ని సాకుగా చూపించి బహుజనుల రాజ్యాంగ హక్కులను అణచివేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ పరిణామం దేశంలోని…

Read More

ప్రజా’రోగ్’ కార్యాలయం – ప్రజారోగ్య విభాగంలో అధికారి హరి లీలలు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ప్రజారోగ్య కార్యాలయం అవినీతికి, లైంగిక వేధింపులకు అడ్డాగా మారిందనేందుకు తాజా లీగల్ నోటీసు తిరుగులేని రుజువు. ఒక సీనియర్ అధికారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు అందులోనే పనిచేస్తున్న ఒక ఉద్యోగిని ఫిర్యాదు చేయడం వైద్య ఆరోగ్య శాఖలో సంచలనం అయింది. అంతేకాదు ఈ విషయంపై సంబంధిత మంత్రి దామోదర రాజనర్సింహ సహా ఉన్నతాధికారులకు లీగల్ నోటీసులు జారీ చేయడంతో యంత్రాంగం ఉలిక్కిపడింది. అవినీతి ఆరోపణలతో పాటు మహిళల వేధింపుల ఫిర్యాదులు నిత్యం…

Read More

బీజేపీ రాగం… టీడీపీ విలాపం – తెలంగాణ తెలుగుదేశం నేతల నిరాశ

సహనం వందే, అమరావతి/హైదరాబాద్:తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం సుదీర్ఘ కాలం తర్వాత కదిలినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర టీడీపీ నేతలు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఉండవల్లి నివాసంలో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని… ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదని పార్టీ నేతలే వ్యాఖ్యానించడం టీడీపీకి దిశానిర్దేశం లేకపోవడాన్ని స్పష్టం చేస్తోంది. ఈ సమావేశం తర్వాత జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టీడీపీ పోటీ…

Read More

బాడీ షేమింగ్… బహుజనుల ఫైటింగ్ – దున్నపోతు వ్యాఖ్య దుమారం…

సహనం వందే, హైదరాబాద్:బహుజనుల మధ్య సఖ్యత కొరవడింది. బీసీ, ఎస్సీల మధ్య ఉండాల్సిన ఐక్యత దెబ్బతింటుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు బహుజన మంత్రుల మధ్య ఉన్న వర్గ వైరం చినికి చినికి గాలివానలా మారుతోంది. బీసీ వర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దున్నపోతు చుట్టూ దుమారం రేపాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి….

Read More

కరోనా విపత్తు… రెమెడెసివిర్ రాకెట్ – హరీష్ రావును టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ విమర్శ

సహనం వందే, హైదరాబాద్:కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని కుదిపేసిన సమయంలో రెమెడెసివిర్ ఇంజెక్షన్ల చుట్టూ జరిగిన అవినీతి దారుణాలు ఇప్పటికీ ప్రజలను కలవరపరుస్తున్నాయి. అప్పటి తెలంగాణ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖను శాసించిన మాజీ మంత్రి హరీష్ రావును పాలనలో ఈ అవినీతి జరిగినట్లు కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అతని నియంత్రణలో వైద్య వ్యవస్థ అవినీతి మయమైందని ఆరోపిస్తుంది. కాంగ్రెస్ సోషల్ మీడియా ద్వారా ఈ దారుణాలను ఎండగడుతూ హరీష్ రావును నిలదీస్తోంది. మందుల సరఫరా నుంచి వ్యాక్సిన్ల…

Read More

బీసీ కోటా… కోర్టుల్లో రగడ – 42 శాతం రిజర్వేషన్లపై సుప్రీంలో సవాల్

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ న్యాయపరమైన జోక్యం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి గత నెల 29న ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్…

Read More

రిజర్వేషన్ల ‘తప్పు’టడుగు – చిత్రవిచిత్రంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రిజర్వేషన్ల కేటాయింపులో జరిగిన తప్పులు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం సృష్టిస్తున్నాయి. ఓటరు లేని చోట పదవుల రిజర్వేషన్లు కల్పించడం వెనుక దాగి ఉన్న రాజకీయం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సామాజిక న్యాయం ప్రధాన లక్ష్యంగా రూపొందిన రిజర్వేషన్లు అస్తవ్యస్తమైన డేటా ఆధారంగా కేటాయించడం వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియే అపహాస్యం అవుతోందని విమర్శకులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ తప్పిదాల కారణంగా పలు గ్రామాల్లో ఎన్నికలు జరగకముందే ఏకగ్రీవాలు ఖాయమవుతున్నాయి….

Read More

గులాబీ ఐఫిల్… పింక్ చార్మినార్… క్యాన్సర్ పరార్

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ నగరం మంగళవారం అర్ధరాత్రి గులాబీమయం అయింది. ప్రముఖ భవనాలపై పింక్ రంగు మెరిసిపోయింది. అక్టోబర్ క్యాన్సర్ నివారణ నెల నేపథ్యంలో ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రపంచంలో వైట్ హౌస్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, ఐఫిల్ టవర్ వంటి ప్రపంచ ప్రసిద్ధ కట్టడాలతో పాటు మన దేశంలో హైదరాబాదులో మాత్రమే పెయింట్ ది సిటీ పింక్ నిర్వహిస్తుండడం విశేషం. చార్మినార్, బుద్ధ విగ్రహం, టీ-హబ్, ప్రసాద్‌ ఐమ్యాక్స్, దుర్గం…

Read More