‘రియల్’ దూకుడు… దిమ్మతిరిగే ధరలు! – దేశంలో ఉరకలేస్తున్న రియల్ ఎస్టేట్ రంగం

సహనం వందే, హైదరాబాద్:దేశంలో రియల్ ఎస్టేట్ రంగం ఉరకలు వేస్తుంది. సామాన్యుడి సొంతింటి కలపై ఈ ధరల మంట తీవ్ర ప్రభావం చూపుతోంది. 2025 మూడో త్రైమాసికంలో నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) రియల్ ఎస్టేట్ ధరల పెరుగుదలలో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే ఇక్కడ ఇంటి ధరలు ఏకంగా 24 శాతం పెరిగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చదరపు అడుగు ధర రూ.7200 నుంచి రూ.8900కు చేరింది. గురుగ్రామ్, నోయిడా వంటి ఐటీ…

Read More

విడాకుల సంబరం… పాలతో స్నానం – కేక్ కట్ చేసిన యువకుడు

సహనం వందే, న్యూఢిల్లీ:విడాకులు అంటే విషాదం… విచారం అనే పాత భావనలు ఇప్పుడు కొత్త తరం యువత ఆలోచనల్లో చెరిగిపోతున్నాయి. వైవాహిక బంధం నుంచి విముక్తి పొందిన ఒక వ్యక్తి కేక్ కట్ చేసి పాల స్నానం చేసి పెళ్లికొడుకు వేషంలో తన ఒంటరి జీవితాన్ని పండుగలా జరుపుకోవడం మారుతున్న పోకడకు సజీవ సాక్ష్యం. ఈ విడాకుల సంబరం సోషల్ మీడియా లో వైరల్‌గా మారడం, భిన్నమైన అభిప్రాయాలకు తావివ్వడం గమనార్హం. స్వేచ్ఛ, వ్యక్తిగత ఆనందం అనే…

Read More

విదేశాల్లో విద్యార్థనాదాలు – ఆరేళ్లలో 842 మంది భారత విద్యార్థుల మృతి

సహనం వందే, హైదరాబాద్:విదేశాల్లో ఉన్నత విద్య… మంచి ఉద్యోగం… మెరుగైన జీవితం అనే కలల రెక్కలు కట్టుకుని కడలి దాటిన భారతీయ యువ హృదయాలు అక్కడి ప్రమాదాల్లో ఆరిపోతున్నాయి. 2018 నుంచి 2024 వరకు ఈ ఆరేళ్లలో ఏకంగా 842 మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోయారని కేంద్రం వెల్లడించింది. ప్రతి మరణం వెనుక ఒక కుటుంబం ఆశ… ఒక యువకుడి భవిష్యత్తు ఆధారపడి ఉంది. కలల మాటున కన్నీళ్ల కథభారతీయ విద్యార్థులకు కలల గమ్యంగా…

Read More

దేశదేశాన ‘జెన్ జెడ్’ ప్రభంజనం – ప్రపంచ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది

సహనం వందే, న్యూఢిల్లీ:మొరాకో… మడగాస్కర్… పెరూ… నేపాల్… ఈ పేర్లు ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాల ప్రభుత్వాలకు వణుకు పుట్టిస్తున్నాయి. దేశ దేశాలకు జెన్ జెడ్ ఉద్యమం ప్రభంజనంలా వ్యాపిస్తుంది. జెన్ జెడ్ తరం సామాజిక మాధ్యమాల నుంచి వీధుల్లోకి దిగి అధికార పీఠాలను కుదిపేస్తోంది. అవినీతి, అసమానతలు, అణచివేతలపై ఈ తరం గట్టిగా నినదిస్తుంది. మొరాకోలో జెడ్212 ఉద్యమం విద్య, వైద్య వ్యవస్థల్లోని దయనీయ దుస్థితిని బయటపెట్టింది. ఒకవైపు 2030 ప్రపంచ కప్ కోసం వేల…

Read More

ఫ్యాషన్ ఉప్పు… థైరాయిడ్ ముప్పు – రాక్, పింక్ సాల్టుల్లో అయోడిన్ ఉండదు

సహనం వందే, న్యూఢిల్లీ:పప్పు… పచ్చళ్ల నుంచి నూడుల్స్… చాట్ వరకూ మన దైనందిన ఆహారంలో ఉప్పు దాగి ఉంటుంది. కానీ అధిక ఉప్పు వినియోగం మన గుండె, కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు చేసిన పరిమాణం కంటే భారతీయులు ఏకంగా రెట్టింపు ఉప్పు తీసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ అలవాటును వెంటనే మార్చుకోవడం అత్యవసరం. ఉప్పు ఎక్కువైతే ప్రాణాలకు చేటు…డబ్ల్యూహెచ్ఓ ప్రకారం……

Read More

టీసీఎస్‌ లో ఉద్యోగాల ఊచకోత – నైపుణ్యం లేదంటూ12 వేల మంది బలి

సహనం వందే, న్యూఢిల్లీ:టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) దేశ ఐటీ రంగంలో గొప్పలు చెప్పుకునే సంస్థ. కానీ ఇప్పుడు తన ఉద్యోగులను రోడ్డున పడేసే దుర్మార్గానికి ఒడిగట్టింది. 12,000 మంది ఉద్యోగులను అంటే గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 2 శాతం మందిని ఏడాది కాలంలో తొలగించేందుకు ఈ కార్పొరేట్ కంపెనీ కత్తి సానబెట్టింది. క్లయింట్ డిమాండ్లు, ఆటోమేషన్, కొత్త టెక్నాలజీ అవసరాలను సాకుగా చూపుతూ మధ్య, ఉన్నత స్థాయి ఉద్యోగుల జీవితాలను చిదిమేస్తోంది. దశాబ్దాలుగా కంపెనీకి చెమటోడ్చి సేవలందించిన…

Read More

పంట పొలాల్లో రక్తపుటేరులు – అప్పులు.. నష్టాలతో రైతు ఆత్మహత్యలు

సహనం వందే, న్యూఢిల్లీ:2023లో దేశవ్యాప్తంగా 10,786 మంది రైతులు, కూలీలు ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వాల ఘోర వైఫల్యానికి నిదర్శనం. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం ఏటా పది వేలకు పైగా రైతు జీవితాలు గాలిలో కలిసి పోవడం వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. వ్యవసాయ విధానాల్లోని లోపాలు, అందని సాయం, పెరిగిన రుణ భారం రైతన్నలను ఈ దారుణమైన స్థితికి నెట్టాయి. ఈ సంక్షోభం వెనుక ఉన్న రాజకీయ కోణాలు, ప్రభుత్వాల మొండి వైఖరిని…

Read More

అంబానీ క్లబ్‌లోకి ‘ఐఐటీ’యన్ ఎంట్రీ! – 31 ఏళ్లకే రూ. 21,190 కోట్ల సంపద

సహనం వందే, హైదరాబాద్:దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు ఒక యువ భారతీయ పారిశ్రామికవేత్త. కేవలం 31 ఏళ్ల వయసుకే రూ. 21,190 కోట్ల నికర సంపదతో మెరిసి ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్-2025లో అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా నిలిచారు. ఆయనే అరవింద్ శ్రీనివాస్. ఏఐ రంగంలో తనదైన ముద్ర వేసిన ఈ చెన్నై యువకుడు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ జాబితాలో ముఖేష్ అంబానీ మొదటి…

Read More

బేడీలు వేసినా మారని మెడి’కేడీలు’ – ఎన్ఎంసీ అధికారులు ‘మహా’ ముదుర్లు

సహనం వందే, హైదరాబాద్:అదొక డబ్బా మెడికల్ కాలేజ్… నగరానికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందులో వసతులు లేవని లోకమంతా కోడై కూసింది. మూడేళ్ల క్రితం ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఒక బ్యాచ్ రద్దు కూడా చేశారు. అయినా దాని తీరు మారలేదు… జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అధికారుల అక్రమాలు ఆగలేదు. ఎన్ని ఆరోపణలు వచ్చినా… నకిలీ రోగులు ఉన్నారని తేలినప్పటికీ ఆ కాలేజీకి ఎన్ఎంసీ తాజాగా మరో 50 ఎంబీబీఎస్ సీట్లను…

Read More

రాజకీయ ‘తొక్కిసలాట’లో విజయ్ – ఆయనకు మద్దతు ప్రకటిస్తున్న బీజేపీ

సహనం వందే, చెన్నై:తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపునకు కరూర్ తొక్కిసలాట ఘటన వేదికైంది. ఈ సంఘటనలో తమ తప్పేమీ లేదని చెప్పుకునేందుకు సినీ నటుడు, యువ రాజకీయ నేత విజయ్ ఆరోపణల పర్వం మొదలుపెట్టారు. తమ సభలో అలజడి సృష్టించి తమను ఇరికించేందుకు డీఎంకే ప్రభుత్వమే కుట్ర చేస్తోందని ఆయన నేరుగా ఆరోపించారు. అయితే ఇదంతా రొటీన్ రాజకీయం అయినప్పటికీ… ఈ కేసు విచారణ ఇప్పుడు విజయ్‌కు అసలు పరీక్షగా మారింది. డీఎంకే ప్రభుత్వం విచారణ జరిపితే…

Read More