ఏ దారి ఎటు పోతుందో! – స్వదేశీ ‘మ్యాపుల్స్’ మహాద్భుతం!

సహనం వందే, హైదరాబాద్:గూగుల్‌ మ్యాప్‌కు గట్టి పోటీనిస్తూ మ్యాప్స్‌ మై ఇండియా సంస్థ రూపొందించిన ‘మ్యాపుల్స్’ యాప్‌ ఆకర్షిస్తుంది. మన రోడ్ల సంక్లిష్టతకు అనుగుణంగా తయారుచేసిన ఈ నావిగేషన్ యాప్ 3.5 కోట్ల డౌన్‌లోడ్లతో దూసుకుపోవడమే కాకుండా గోప్యత, భద్రతకు పెద్దపీట వేస్తుంది. ఇస్రో భాగస్వామ్యంతో ఉపగ్రహ చిత్రాల డేటాను ఉపయోగించుకోవడం ద్వారా మ్యాప్ ఖచ్చితత్వాన్ని అమాంతం పెంచింది. 13 అద్భుత ఫీచర్లు…ఇందులో 13 అద్భుత ఫీచర్లు ఉన్నాయి. ఫ్లైఓవర్లు, ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల వద్ద మూడు డైమెన్షనల్…

Read More

ఏడు అడుగులకు… అరవై లక్షలు – అబ్బాయిలకు మ్యారేజ్ బ్యూరో కండీషన్

సహనం వందే, హైదరాబాద్:పెళ్లి అనేది రెండు మనసుల కలయిక అని మన సంప్రదాయం చెబుతోంది. కానీ‌ ఏఐ యుగంలో పెళ్లి సంబంధాలు కూడా పక్కా వ్యాపారంగా మారిపోయాయని ఒక కొత్త పరిణామం రుజువు చేస్తోంది. దేశంలో పెళ్లి సంబంధాల కోసం ఏర్పాటు అయిన నాట్(Knot) డేటింగ్ యాప్… అబ్బాయిల వార్షిక ఆదాయం కనీసం రూ. 60 లక్షలు ఉండాలని కఠిన షరతు విధించింది. అమ్మాయిలకు మాత్రం ఎలాంటి ఆదాయ పరిమితి పెట్టకుండా వివాదానికి కేంద్రంగా మారింది. సంప్రదాయ…

Read More

కులోన్మాదం… ఐపీఎస్ ఆత్మ’బలి’దానం- డీజీపీ స్థాయి అధికారిపైనే దళిత వివక్ష

సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో కులం అనే విషం ఎంత లోతుగా పాతుకుపోయిందో మరోసారి నిరూపించే దారుణ ఘటన ఇది. హర్యానాలో సీనియర్ ఐపీఎస్ అధికారి వై.పురాణ్ కుమార్ ఆత్మహత్య కేవలం ఒక వ్యక్తి విషాదాంతం కాదు. ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ ఒక దళిత అధికారి తన తోటి అధికారుల చేతిలో మానసిక హింసకు, జాతి వివక్షకు ఎలా బలైపోయాడో తెలిపే పచ్చి నిజం. చండీగఢ్‌లోని తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆయన బలవన్మరణం చెందడం దేశంలోని…

Read More

ప్రైవేట్ క్యాబ్… మహిళల ట్రాప్ – యూపీఐ చెల్లింపులతో లీకవుతున్న నంబర్లు

సహనం వందే, న్యూఢిల్లీ:క్యాబ్‌లలో ప్రయాణించే మహిళల భద్రత తీవ్ర ప్రమాదంలో పడింది. ఓలా, ఉబర్, ఇన్‌డ్రైవ్, రాపిడో వంటి ప్రైవేటు రవాణా యాప్‌లు ఎంత గొప్ప భద్రతా హామీలు ఇచ్చినా… డ్రైవర్ల వేధింపులు ఆ హామీల డొల్లతనాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ముఖ్యంగా యూపీఐ ద్వారా డబ్బు చెల్లించడం వల్ల మహిళల వ్యక్తిగత ఫోన్ నంబర్లు డ్రైవర్లకు లీక్ అవుతున్నాయి. దానిని అడ్డుపెట్టుకుని వారు వాట్సాప్ లేదా పేటీఎం వంటి వాటిలో అసభ్యకర సందేశాలు పంపడం… వేధించడం సమస్యగా…

Read More

ఫిమేల్ ఫేవర్… పన్నెండు లీవ్స్ – స్త్రీలకు రుతు సెలవులు ప్రకటించిన కర్ణాటక

సహనం వందే, బెంగళూరు:కర్ణాటక ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం తీసుకొచ్చిన సంవత్సరానికి పన్నెండు రుతు మాసపు సెలవుల నిర్ణయం చారిత్రక ఘట్టం. ఉద్యోగం చేస్తూ ఇల్లు, కుటుంబాన్ని సమన్వయం చేసే మహిళలకు రుతుక్రమం వల్ల కలిగే శారీరక, మానసిక ఒత్తిడిని గుర్తించి ప్రభుత్వం వారికి ఆరోగ్యపరంగా ఊరట నిచ్చే ప్రయత్నం చేసింది. ఈ నిర్ణయం వల్ల తమ శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకునే అవకాశం దొరికిందని ఉద్యోగినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసు పని ఒత్తిడిని తగ్గించుకుని…

Read More

కమ్యూనిస్టు కోటకు డిజిటల్ కిరీటం – మరో చరిత్ర సృష్టించిన కేరళ రాష్ట్రం

సహనం వందే, కేరళ:అక్షరాస్యతలో ఇప్పటికే దేశానికి దిక్సూచిగా నిలిచిన కేరళ… ఇప్పుడు డిజిటల్ అక్షరాస్యతలోనూ అదే మైలురాయిని అధిగమించింది. కేవలం 18 నెలల్లోనే ‘డిజి కేరళ’ కార్యక్రమం ద్వారా 100% డిజిటల్ అక్షరాస్యతను సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. సాధారణ శిక్షణా కార్యక్రమంలా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ఓ మహా ఉద్యమంలా సాగిన ఈ ప్రయాణం… కోట్లాది మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. స్వచ్ఛంద సైనికుల విజయగాథస్థానిక…

Read More

మరణం ‘500 రెట్లు’ ఖాయం – దగ్గు మందుల్లో పరిమితికి మించి విషం

సహనం వందే, న్యూఢిల్లీ:భారతదేశంలో తయారైన విషపూరితమైన దగ్గు మందు కారణంగా 17 మంది చిన్నారులు కన్నుమూశారు. ఈ ఘోరం జరిగి నెల రోజులు దాటినా ఇంకా మన డ్రగ్ కంట్రోలర్ల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మృతులంతా ఐదేళ్ల లోపు వారే కావడం గుండెలవిసేలా చేస్తోంది ‘కోల్డ్రిఫ్’ అనే ఈ సిరప్‌లో డైథిలీన్ గ్లైకాల్ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనం అనుమతించిన పరిమితికి ఏకంగా 500 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు పరీక్షల్లో తేలడం సంచలనం సృష్టిస్తుంది. ఈ…

Read More

‘సుప్రీం’ నిప్పు… ‘సోషల్’ ముప్పు – సుప్రీం సీజే గవాయ్‌ పై సోషల్ వార్

సహనం వందే, న్యూఢిల్లీ:దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్ట్ కూడా మత ఘర్షణల మధ్య చిక్కుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌ పై న్యాయవాది బూటు వేసిన ఘటన అంతర్జాతీయంగా సంచలనం అయింది. ఈ ఘటనకు పాల్పడిన న్యాయవాది ఏ మాత్రం పశ్చాత్తాప పడటం లేదు. ఆ మేరకు ఆయన కొన్ని వార్తా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఇదిలా ఉంటే మరోవైపు సోషల్ మీడియాలో ప్రధాన న్యాయమూర్తిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది….

Read More

క్లిని’కిల్’ ట్రయల్స్‌ – లాభాల వేట… రోగుల ప్రాణాలతో ఆట!

సహనం వందే, హైదరాబాద్:ఔషధ పరిశోధనల పేరుతో కంపెనీలు రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయా? క్లినికల్ ట్రయల్స్‌ లో రోగుల భద్రతకు కవచంగా నిలవాల్సిన నైతిక సమీక్ష మండలి (ఐఆర్‌బీ) తమ స్వతంత్రతను కోల్పోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. బడా ఫార్మా కంపెనీల ఆర్థిక ప్రయోజనాల వలలో చిక్కుకున్న ఈ వ్యవస్థ రోగుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఓజెంపిక్ వంటి ఔషధాల ట్రయల్స్‌లో వెలుగు చూసిన ఈ వ్యవహారం… మన దేశంలో కూడా తీవ్ర…

Read More

దళిత ‘సుప్రీం’పై దమనకాండ – ప్రధాన న్యాయమూర్తిపైనే కులోన్మాదం

సహనం వందే, న్యూఢిల్లీ:ఈ దేశంలో అత్యున్నత పదవుల్లోని బహుజన, దళిత వర్గాలకు చెందిన ఉన్నత స్థాయి వ్యక్తులకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. దేశ మాజీ రాష్ట్రపతి కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి… ఇద్దరూ దళితులే కావడంతో వారిపై అడుగడుగునా కులోన్మాదులు అనేక విధాలుగా మానసికంగా దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై న్యాయవాది రాకేష్ కిశోర్ బూటు విసిరిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. విచారణ సమయంలో సనాతన ధర్మాన్ని…

Read More