5జీ భ్రమ… 4జీ కర్మ – 25 రెట్లు ఉండాల్సిన సామర్థ్యం ఢమాల్

సహనం వందే, న్యూఢిల్లీ:మొబైల్ స్క్రీన్ పై 5జీ గుర్తు కనిపించిందంటే రాకెట్ వేగంతో నెట్‌వర్క్‌ వచ్చేసినట్టేనని భ్రమ పడతాం. కానీ నెట్‌వర్క్‌ కంపెనీలు ఇచ్చిన హామీలన్నీ నీటి మీద రాతలయ్యాయి. ఒక నిమిషంలో 18 హై డెఫినిషన్ సినిమాలు డౌన్ లోడ్ అవుతుందని ఊరించారు. కానీ తాజాగా జరిగిన పరిశోధనలో దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. 5జీ నెట్‌వర్క్‌ 40 శాతం 4జీ నెట్‌వర్క్‌నే చూపిస్తోందని తేలింది. ఈ మోసాన్ని ఇకనైనా ప్రశ్నించాలి. 5జీ 25 రెట్ల…

Read More

ఏఐ చాట్… స్మశానానికి రూట్ – మెంటలెక్కిస్తున్న చాట్‌జీపీటీ

సహనం వందే, హైదరాబాద్:సాధారణంగా కనిపించే ఏఐ చాట్‌బాట్లు ఇప్పుడు వినియోగదారుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాట్‌జీపీటీని తయారుచేసిన ఓపెన్‌ఏఐ సంస్థ తాజాగా బయటపెట్టిన లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. తమ వినియోగదారులలో వారానికి దాదాపు 0.07 శాతం మంది పిచ్చి ఆలోచనలు, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలకు గురవుతున్నారని సంస్థ వెల్లడించింది. ఈ శాతం చిన్నదే అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా వారానికి దాదాపు 80 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నందున… ఈ లెక్క లక్షల్లో…

Read More

అమెజాన్‌లో 30,000 మంది ఔట్- నేటి నుంచి భారీగా ఉద్యోగాల ఊచకోత

సహనం వందే, న్యూఢిల్లీ:నేటి (మంగళవారం) నుంచి అమెజాన్‌లో మరోసారి భారీగా ఉద్యోగాల తొలగింపు మొదలుకానుంది. ఏకంగా 30 వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను ఇంటికి పంపించడానికి కంపెనీ సిద్ధమైంది. కరోనా సమయంలో అధికంగా నియామకాలు చేపట్టిన అమెజాన్… ఇప్పుడు ఖర్చులను కట్టడి చేసే పేరుతో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. దాదాపు 15 లక్షల మంది ఉద్యోగులు ఉంటే… అందులో కార్పొరేట్ సిబ్బంది 3.50 లక్షల మంది ఉన్నారు. వీరిలో దాదాపు 10 శాతం మంది ఉద్యోగాలు…

Read More

యువత మౌనం వెనుక మర్మం! – జెన్ జడ్ నిశ్శబ్దం… వీధుల్లోకి రాని నేటితరం

సహనం వందే, హైదరాబాద్:భారతదేశంలో దాదాపు 37 కోట్ల మంది జెన్ జడ్ యువత ఉంది. స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా ప్రపంచంతో నిత్యం అనుసంధానమై ఉన్న ఈ శక్తిమంతమైన తరం… దేశంలో ఉన్న అవినీతి, అసమానతలు, రాజకీయ గందరగోళంపై తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తోంది. కానీ వీధుల్లోకి వచ్చి గళమెత్తడానికి మాత్రం వెనుకాడుతోంది. దేశద్రోహం ముద్ర పడుతుందనే భయం, కుల, ప్రాంతీయ విభజనలు, నిరుద్యోగంతో కూడిన ఆర్థిక ఒత్తిళ్లు, మార్పు అసాధ్యమనే నిరాశ… నేటి తరాన్ని నిశ్శబ్దంగా ఉంచుతున్నాయి….

Read More

అతిథి దేవో… భద్రత లేదో – ఇండోర్‌ లో విదేశీ మహిళా క్రికెటర్లకు వేధింపులు

సహనం వందే, ఇండోర్:క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆడటానికి భారత్‌కు వచ్చిన విదేశీ మహిళా క్రీడాకారులకు భద్రత కరువైంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ మహిళా ప్రపంచకప్ సందర్భంగా ఇండోర్‌ లో బస చేసిన ఆస్ట్రేలియా మహిళా జట్టుకు చెందిన ఇద్దరు క్రికెటర్లను ఓ మతిలేని వ్యక్తి వేధించడం దేశంలో మహిళా భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య గ్రూప్ దశ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు గురువారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. హోటల్ నుంచి ఓ…

Read More

అవినీతి మంటల్లో బస్సు ప్రయాణం – నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపైకి బస్సులు

సహనం వందే, హైదరాబాద్:కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు మంటల్లో 19 మంది మాడి మసైపోయారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. సీటింగ్ బస్సుగా రిజిస్ట్రేషన్ పొందిన ఈ వాహనాన్ని స్లీపర్ బస్సుగా మార్చి రవాణా నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించిన వైనం బయటపడింది. 2018లో తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయించిన ఈ బస్సు 2023లో డయ్యూ డామన్‌లో ఎన్ఓసీతో మరో రిజిస్ట్రేషన్ పొంది నేషనల్ పర్మిట్ సాకుతో రోడ్లపై దూసుకెళ్లింది. ఒడిశాలోని రాయగడలో ఆల్టరేషన్…

Read More

ట్రంప్ బ్రాండ్… ‘రియల్’ ట్రెండ్ – భారత మార్కెట్లో ట్రంప్ ఎస్టేట్ మోజు

సహనం వందే, న్యూఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రాండ్‌తో కూడిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు భారత్ అతిపెద్ద విదేశీ మార్కెట్‌గా మారింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ (గూర్గావ్)లో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రెండు లగ్జరీ ప్రాజెక్టులతో పాటు… ఇప్పుడు హైదరాబాద్‌లోని కోకపేట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్ ప్రకటన రియల్ ఎస్టేట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. 63 అంతస్తులతో సుమారు రూ. 3,500 కోట్ల పెట్టుబడితో ఈ టవర్లు నిర్మాణం కానున్నాయని డెవలపర్లు చెబుతున్నారు. ఈ భారీ…

Read More

మార్క్సిజం… మస్కిజం – మార్క్స్, మస్క్ ల లక్ష్యం సంపద పంపిణీయే

సహనం వందే, హైదరాబాద్:కారల్ మార్క్స్ ప్రతిపాదించిన కమ్యూనిజం సిద్ధాంతం, ఎలాన్ మస్క్ ఊహించిన రోబో యుగం— ఈ రెండు దృక్పథాలూ ఆర్థిక అసమానతలకు చెక్ పెట్టి సంపద సమృద్ధిని లక్ష్యంగా చేసుకున్నాయి. మార్క్స్ అందించిన ఎవరి సామర్థ్యానికి తగ్గట్టు పని, ఎవరి అవసరానికి తగ్గట్టు సంపద పూర్తిస్థాయిలో అనుభవించడం అనే సూత్రం… మస్క్ ప్రతిపాదించిన యూనివర్సల్ హై ఇన్‌కం ఆలోచనతో ఆశ్చర్యకరంగా పోలి ఉంది. రెండు ఆలోచనల అంతిమ లక్ష్యం ఒకటే. సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆర్థిక…

Read More

గోల్కొండ వజ్రం… ఫ్రాన్స్ రక్తసిక్తం – రత్నం వెనుక శాపం…‌ రక్తపాతం… విప్లవం

సహనం వందే, పారిస్:ప్రపంచ ప్రసిద్ధి చెందిన రీజెంట్ వజ్రం చుట్టూ అల్లుకున్న రహస్యాలు… దాని భారతీయ మూలాల శాపం తాజాగా జరిగిన లూవ్ర్ మ్యూజియం దొంగతనంతో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. కోట్ల విలువైన ఇతర ఆభరణాలను దోచుకెళ్లిన దొంగలు… గోల్కొండ గనుల నుంచి వచ్చిన ఈ రీజెంట్ రాణి వజ్రాన్ని మాత్రం తాకకపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. చరిత్రలోని ఈ అపురూప వజ్రం కేవలం రత్నం కాదు… రక్తపాతంతో మొదలైన ఒక శాపగ్రస్త కథకు…

Read More

అనారోగ్య దళితుడిపై అగ్రకుల దమనకాండ – ఆలయం పరిసరాల్లో మూత్రం పోశాడని ఫైర్

సహనం వందే, లక్నో:లక్నో సమీపంలోని కాకోరి పట్టణంలో జరిగిన దారుణ ఘటన దేశంలో కుల వివక్ష ఎంత వికృతంగా ఉందో మరోసారి బట్టబయలు చేసింది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న 65 ఏళ్ల దళిత వృద్ధుడు రంపాల్ రావత్..‌. దీపావళి రోజున శీత్ల మాతా ఆలయం సమీపంలో అనుకోకుండా మూత్ర విసర్జన చేస్తే… ఒక స్థానికుడు అతనిపై దాడి చేసి అవమానించడం మానవత్వానికే సిగ్గుచేటు. మందిరానికి కనీసం 40 మీటర్ల దూరంలో జరిగిన ఈ చిన్నపాటి అనుకోని ఘటనను…

Read More